Actress Srilakshmi: అత్యాశకు పోయి ఆస్తులు పోగొట్టుకున్నా - ఆ ఇల్లు కొన్నందుకు అన్నపూర్ణ గారు తిట్టారు, నటి శ్రీలక్ష్మి ఆవేదన
Actress Srilakshmi About Assets: అత్యాశకు పోయి ఆస్తులన్ని పోగొట్టుకున్నానంటూ సీనియర్ నటి శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె తన ఆర్థిక పరిస్థితిపై స్పందించారు.
Senior Actress Srilakshmi about her Assets Lost: మూవీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరూ ఎప్పుడు శాశ్వతంగా కాదు. ఒక్కసారిగా ఆర్టిస్ట్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంది. అలాగే ఒక్కసారిగా నెలకు దించేస్తుంది. దీనికి ఇండస్ట్రీలోని ఎంతోమంది నటీనటులు ఉదాహరణగా నిలిచారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్‌గా చక్రం తిప్పిన వారంత ఇప్పుడు ఆఫర్స్ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి స్టార్ హీరోయిన్ నుంచి సాధారణ ఆర్టిస్ట్ వరకు ఎవరూ అతితం కాదు. అందులో సీనియర్ నటి శ్రీలక్ష్మి ఒకరు. హాస్య నటిగా అలరించిన ఆమె మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అలా వందకు పైగా సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెరపై అలరించారు. ఇక కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో తన ఆర్థిక పరిస్థితులపై స్పందించారు. నటిగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో సంపాదించానని, చివరికి అత్యాశతో అన్ని కొల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. వెండితెరపై కామెడీతో నవ్వించిన తన నవ్వు వెనక ఎంతో విషాదం ఉందన్నారు. అవే తనకు గుణపాఠం నెర్పించాయన్నారు.
"ఇండస్ట్రీకి ఎంత అమాకంగా వచ్చానో.. ఇక్కడి వెన్నుపోటు అనుభవాలు, వెన్నుపోటుతో చాలా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలోని వారిన నమ్మి పెట్టుబడులు పెట్టి ఉన్నది కూడా పొగొట్టుకున్నాను. మనిషికి అత్యాశ ఉండకూడదు. మనం ఎంత ఎత్తు ఎదిగినా.. చివరి వరకు మిగిలేది కొంచమే. ఉన్నదాంట్లోనే తృప్తి పడాలని అర్థమైంది. నటిగా బాగానే సంపాదించాను. టీ నగర్‌లో ప్లాట్ తిసుకున్నా, వలసరవాక్కంలో ఒక ప్లాట్ కొన్నాను. ఈ రెండు ఇల్లులు దేవుడు నాకు ఇచ్చాడు. అవి చాలని తృప్తి పడాల్సింది. టీ టీ-నగర్‌లో ఆ ఫ్లాట్ ఇప్పుడు కోటీన్నర విలువ చేస్తుంది. ఇక వలసరవాక్కంలో ఇల్లు మొత్తం రెంట్‌కి ఇస్తే నాకు రూ. 40 వేలు వస్తాయి.
అవి చాలు అని సరిపెట్టుకోకుండా ఇండస్ట్రీ వాళ్లు చెప్పారని 'ఈసీఆర్'(రిసార్ట్) బిజినెస్‌లో అడుగుపెట్టాను. వారి సలహాతో చెన్నై బీచ్ సమీపంలోని రిసార్ట్‌లో హాఫ్ గ్రౌండ్ కొని అక్కడ డూప్లెక్స్ ఇల్లు కట్టించాను. అది కట్టించేసి టి-నగర్‌లోని ఇల్లు, వలసరవాకలోని ఇల్లు రెండింటిని ప్లజ్ చేశాను. ప్లజ్ చేసి నెలకు రూ. 30 వేల లోన్ కట్టాను. రిసార్టులోని ఇల్లు అమ్మేస్తే వచ్చిన లాభంతో ఈ రెండింటిని విడిపించుకోవచ్చు అనుకున్నా. కానీ కథ అంత అడ్డం తిరిగింది. రిసార్టులోని ఇల్లును కొనేందుకు ఎవరూ ముందుకు రావడం. దీంతో రెండు పాపర్టీస్ ఇందులో ఇరుక్కుపోయాయి.
Also Read: గొప్ప మనసు చాటుకున్న జ్యోతిరాయ్ (జగతి మేడం) - పద్మ శ్రీ మొగిలయ్యకు ఆర్థిక సాయం
ఇటూ డబ్బులు కట్టలేక రూ. 30 వేలు పెరిగి రూ.35 లక్షల డ్యూ అయిపోయింది. దీంతో టి-నగర్‌లోని ఇల్లును రూ.45 లక్షలకు అమ్మేశాను. దాంతో డ్యూ కట్టేశాను. ఇక రిసార్టులోని డుప్లెక్స్ బంగ్లాను రూ.25 లక్షలకు అమ్మేశా. చాలా చీప్ రేట్‌కు అది అమ్ముడుపోయింది. ఇక ఈ రెండు పోయి ఇప్పుడు నాకు వలసరవాక్కంలోని ఇల్లు ఒక్కటే మిగిలింది. అదే నాకు ఆ ఆలోచన రాకపోయినా, ఇండస్ట్రీ వాళ్లు చెప్పింది వినకపోయి ఉంటే నాకు టి-నగర్ ఇల్లు మిగిలేది. ఇది తెలిసి అంతా నన్ను తిట్టారు. రిసార్టులో ఆ ఇల్లు ఎందుకు కొన్నావని అన్నపూర్ణగారు తిట్టారు. ఎందుకు అందులో అడుగుపెట్టావు అంటూ చివాట్లు పెట్టారు. కర్మ వల్ల ఇలా అత్యాశకు పోయి ఆస్తులు పోగొట్టుకున్నా" అంటూ శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు.