అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 23rd: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషిని అనుమానించి బుజ్జి – శైలేంద్రకు నిజం చెప్పిన సరోజ

Guppedanta Manasu Today Episode: ధనరాజ్ తో కలిసి శైలేంద్రను కలిసిన సరోజ తన బావను ఎందుకు తీసుకొచ్చారని నిలదీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు అని వసుధార రిషిని హెచ్చరిస్తుంది. అయితే అది నిజమే కానీ రిషి అనేవాడికి తెలియదు. వాడు తెలుసుకోలేకపోయాడు. కానీ, రంగాకు అన్ని  తెలుసు అంటాడు రిషి. ఏం వసుధార కన్‌ఫ్యూజన్‌గా ఉందా. రిషిగా చేయలేని పనులు రంగా చేయగలడు. అందుకే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాను అంటాడు రిషి.

   అయితే ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు. ఎంతకాలం ఈ దోబుచులాటలు అని వసుధార అడుగుతుంది. కథ ముగింపు వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి. చూస్తూ ఉండు అంటాడు రిషి. మరోవైపు బావ వస్తా అన్నాడు ఇంకా రాలేందేంటని సరోజ అలోచిస్తుంది. బుజ్జితో మాట్లాడి ఒక క్లారిటీకి వస్తుంది సరోజ. శైలేంద్రను కలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అనుకుంటుంది. తర్వాత బుజ్జి వచ్చి రిషిని కలుస్తాడు.

బుజ్జి: అన్నా నాన్నమ్మ చాలా గొడవ చేస్తుంది. మందులు వేసుకోవడం లేదు. నువ్ ఎప్పుడు వస్తావ్ అన్న. ఇప్పుడు ఆ శైలేంద్రను సరోజ కలవడానికి రెడీ అయింది.

రిషి: అరే బుజ్జి ఆ శైలేంద్రను సరోజ కలిసేలా నువ్వే చేయ్‌.

బుజ్జి: అలా  చేస్తే సరోజ రచ్చ రచ్చ చేస్తుంది కదా అన్న

 వారి మాటలను చాటు నుంచి  వసుధార వింటుంది.

వసుధార: ఎందుకు శైలేంద్రను సరోజ కలిసేలా చేస్తున్నారు. రిషి సర్‌ ఏం ప్లాన్ వేస్తున్నారు.

 (అని వసుధార డౌట్ పడుతుంది.)

బుజ్జి:  అన్నా నిన్ను ఒకటి అడుగుతా చెబుతావా. నువ్వు రంగావి కాదు కదా చెప్పన్న నువ్ మా రంగా అన్నవి కాదు కదా. నాకు బలంగా అనిపిస్తుంది. ముసల్దాని దగ్గరికి నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది. చిన్నప్పుడే రంగా ఊరి వదిలి వెళ్లిపోయాడు. తర్వాత నువ్వు రంగా అని వచ్చావ్. మేడమ్ గారు వచ్చాక ఆ ఉంగరం ఇచ్చాకే నాకు పక్కాగా అర్థమైంది నువ్ రంగావి కాదని.

రిషి: అరేయ్ బుజ్జి నువ్ అనవసరంగా ఆలోచిస్తున్నావ్. ఏదేదో ఊహించుకుంటున్నావ్. అలాంటిదేం లేదురా. నాకు చెప్పిందంతా నానమ్మ దగ్గర చెప్పావా?

బుజ్జి: లేదు నీ దగ్గరే చెప్పాను అన్న.

 అని బుజ్జి చెప్పగానే నేను నీతో తర్వాత మాట్లాడతాను. నాన్నమ్మ జాగ్రత్త అంటూ బుజ్జిని అక్కడి నుంచి పంపించేస్తాడు. వసుధార కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ధన్‌రాజ్‌కు సరోజ ఫోన్‌ చేస్తుంది. శైలేంద్ర, రిషిని తీసుకెళ్లింది. తాను రిషి కోసం వెతుకుతున్న విషయం చెప్తుంది. మీ అన్నయ్య శైలేంద్రకు మన పెళ్లి ఇష్టం లేదేమోనని ధన్‌రాజ్‌ కు అనుమానం రేకెత్తిస్తుంది. మీ అన్నయ్య వచ్చి పెళ్లి ఇష్టమేనని చెప్తేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరోజ చెప్తుంది. ధనరాజ్‌ సరేనని శైలేంద్రకు ఫోన్‌ చేసి కలవాలని చెప్తాడు. మరోవైపు వసుధార, రిషిని బుజ్జి కలిశాడా అని అడుగుతుంది.

రిషి: కలిశాడు. నాన్నమ్మ నా కోసం బాధపడుతుందట

వసుధార: అవునా సర్‌.. మరి ఎన్ని రోజులు ఇలా రంగాలా వారితో ఉంటారు. నిజం వారికి చెప్పొచ్చు కదా?

రిషి: అన్నిసార్లు నిజం మనం బయటపెట్టాల్సిన అవసరం లేదు వసుధార టైం వచ్చినప్పుడు నిజం  దానంతటే అదే బయటపడుతుంది.

వసుధార: రిషి సర్‌ ఇదంతా ఎందుకు చేస్తున్నారో.. నాకు కూడా చెప్పకూడదా? నా దగ్గర ఎందుకు దాస్తున్నారు.

 అని వసుధార అడిగినా రిషి మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు హైదరాబాద్‌ వచ్చిన సరోజ, ధనరాజ్‌తో కలిసి శైలేంద్ర దగ్గరకు వెళ్తుంది. నా బావను ఎందుకు తీసుకొచ్చావని నువ్వు రావడానికి నెల రోజుల ముందే వసుధార వచ్చి మా బాను రిషి సర్‌ అంటూ వేధించేదని తర్వాత నువ్వు వచ్చి మా బావను తీసుకొచ్చి మళ్లీ వసుధారతో తిరిగేలా చేశావని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా? అంటూ సరోజ నిలదీయడంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషినేనా అని అనుమానిస్తాడు. తర్వాత షాక్‌ నుంచి తేరుకుని మా బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అంటూ సరోజకు చెప్పి శైలేంద్ర వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget