Guppedanta Manasu Serial Today April 3rd: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మను తండ్రి ఎవరని అనుపమను నిలదీసిన మహేంద్ర – అనును ఇంటికి తీసుకెళ్తానన్న మను
Guppedanta Manasu Today Episode: మను తండ్రి ఎవరని అనుపమను మహేంద్ర నిలదీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: దేవయాని అనుపమకు ఫోన్ చేస్తుంది. కాలేజీలో ఏదో జరిగిందటగా నీకు తెలుసా? అని అడుగుతుంది. అనుపమ లేదని చెప్పగానే కాలేజీలో పేరేంట్స్ మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారట దీంతో శైలేంద్ర క్యాజువల్‌గా తండ్రి ఎవరో తెలియన వాళ్లు కూడా ఈ ప్రపంచంలో ఉంటారని అన్నాడట. అంతే మను అక్కడున్న గాజు గ్లాసును పగులగొట్టాడట. చేతికి గాయం అవ్వడంతో రక్తం బుడబుడ పోయిందట. మహేంద్ర కూడా తండ్రి ఎవరో తెలియకపోవడం ఒక లోపమే అని అన్నాడట అని దేవయాని వెటకారంగా చెప్పడంతో అనుపమ షాక్ అవుతుది. వెంటనే ఇక చాలు ఆపండి అంటూ అనుపమ వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి నా కొడుకు దగ్గర తండ్రి ప్రస్తావన తీసుకురావొద్దు. ఫైనల్ గా నా కొడుకుతో పెట్టుకోవద్దని మీ కొడుకుతో చెప్పండి అని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత మహేంద్ర, వసుధార ఇంటికి వస్తారు.
మహేంద్ర: నిద్రపోతున్నావా? ప్రశాంతంగా పడుకున్నావా? అక్కడెవ్వరికీ మనఃశాంతి లేకుండా చేసి.. నువ్విక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నావా? అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది.
అనుపమ: ఏం జరిగింది మహేంద్ర
మహేంద్ర: గుండె రగిలిపోతుంది అనుపమ. మనసు ముక్కలైపోతుంది. ఎందుకు నీ గతం దాస్తున్నావు? ఎందుకు నీ భర్త గురించి దాస్తున్నావు? ఇలా చేస్తే నీకేంటి లాభం.
అనుపమ: మహేంద్ర ఎందుకిలా చేస్తున్నానో ఎవరికోసం ఇలా ఉంటున్నానో.. నాకు మాత్రమే తెలుసు?
మహేంద్ర: అది తెలుస్తూనే ఉంది కానీ ఆ వ్యక్తి ఎవరు?
అనుపమ: నేను చెప్పను. చెప్పలేను కూడా
మహేంద్ర: ఎందుకు చెప్పలేవు నీ కొడుకు అవమానపడుతున్నాడు. పిచ్చి పట్టిందా? నీకు నువ్వు తల్లిలా కాకుండా ఒక్కసారి సాటి మనిషిలా ఆలోచించు.. మను గురించి ఆలోచించు. అక్కడ జరిగిన డిష్కర్షన్‌లో నేను కూడా ఫ్లో లో తండ్రి లేకపోవడ లేపమే అన్నాను. ఆ మాటకు తను ఎంత బాధపడ్డాడో చెప్పు అనుపమ నిజం చెప్పు.
వసుధార: మామయ్య చెప్తారు కానీ మీరు కొంచెం కూల్ అవ్వండి.
అనగానే ఇంకెప్పుడు చెప్తుంది. ఇప్పుడు కాకపోతే అంటూ మహేంద్ర గట్టిగా నిలదీయడంతో అనుపమ అలాగే చెప్పకుండా చూస్తుండి పోతుంది. ఇంతలో మను అక్కడకు వస్తాడు. చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఒకవేళ తను చెప్పాలనుకుంటే నాకు చెప్తుంది. అంటూ మీరు ఇలాగే తన మీద పెత్తనం చేస్తే నేను తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అంటాడు. దీంతో వసుధార మీరు ఎప్పుడైతే తనను అమ్మా అని పిలుస్తారో అప్పుడే తీసుకెళ్లండి అంటుంది. దీంతో అనుపమ ఇంకెప్పుడు నన్ను అమ్మ అని పిలిచినా నామీద ఒట్టు అన్న విషయం గుర్తు చేసుకుని మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మను వెళ్లిపోవడాన్ని ఎంజేల్ చూస్తుంది. ఒక దగ్గరకు వెళ్లి మను కారు ఆపుకుని బాధపడుతుంటాడు. మరోవైపు విశ్వం, ఏంజెల్‌కు ఫోన్ చేస్తాడు.
ఏంజేల్: హలో విశ్వం..
విశ్వం: హమ్మయ్యా ఇప్పటికి ఫోన్ కలిసింది. నెనెప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేదానివి.. లేదంటే కాల్ బాక్ చేసేదానికి.. ఒకవేల ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా అమ్మా..
ఏంజేల్: ఇక్కడ చాలా విషయాలు జరిగాయి
అనగానే ఏం జరిగిందో తనకు చెప్పమని విశ్వం అడగ్గానే అనుపమ మీద ఎవరో అటాక్ చేశారని చెప్పడంతో విశ్వం షాక్ అవుతాడు. ఇప్పుడెలా ఉందని అడగడంతో ఇప్పుడు బాగానే ఉందని.. చెప్పడంతో నా కూతురు మీద అటాక్ చేసిన వాళ్లను నేను వదలను అని విశ్వం తాను అక్కడికి వస్తున్నాను అని చెప్పగానే వద్దని నేనే అక్కడకు వస్తున్నానని ఏంజేల్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పచ్చ చీరలో శివాత్మిక హోయలు - రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోతున్న 'దొరసాని'