Gruhalakshmi November 24th Episode : ‘గృహలక్ష్మీ’ సీరియల్: ఆఫీసులో నందను బకరాను చేయించిన లాస్య – విక్రమ్ అడ్డు తప్పించడం కోసం రాజ్యలక్ష్మీ కొత్త ప్లాన్
Gruhalakshmi today Episode: నందగోపాల్‌తో కాకుండా తులసి టాక్సీలో ఆఫీసుకు వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Gruhalakshmi Serial today Episode: తులసిని పరామర్శించడానికి వచ్చిన లాస్య, భాగ్యం ఇద్దరూ తులసి బెడ్‌రూంలోకి వెళ్లి వెటకారంగా పరామర్శిస్తారు. దీంతో తులసి కోపంగా మనిషిలా మాట్లాడమని లాస్యకు చెప్తుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుందని నీకు సపోర్టుగా నిలబడే వాళ్లంతా నీకు దూరం అవుతున్నారని ఇప్పుడు నందు కూడా నీకు దూరం అవ్వోచ్చని లాస్యం అంటుంది.
తులసి: నేను ఎవ్వరి సపోర్టు ఆశించి బతకడం లేదు. నా కాళ్ల మీద నేను నిలబడగలను. నా గురించి నేను ఆలోచించుకోగలను.
లాస్య: అదేంటక్కా నా నందును అలా తీసిపారేస్తున్నావ్.
తులసి: ఎందుకు నీ నందు గురించి నా ముందు పదేపదే మాట్లాడుతున్నావ్.
లాస్య: ప్రస్తుతం నీ రైట్ హ్యండ్ కదా పొగిడితే సంతోషిస్తావని..
తులసి: నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు థాంక్స్.. ఇక వెళ్లి రా!
లాస్య: తల్లిని పోగొట్టుకుని శాడ్ మూడ్‌లో ఉన్నావ్ కాసేపు నాతో మాట్లాడితే యాక్టివ్ అవుతావేమో..?
తులసి: అవసరం లేదు నన్ను నన్నుగా ఉండనివ్వు చాలు.
అంటూ లాస్యను తీసుకుని వెళ్లమని భాగ్యకు చెప్తుంది తులసి. భాగ్య, లాస్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంట్లో దివ్య నందగోపాల్ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. విక్రమ్ వచ్చి
విక్రమ్: ఎందుకు బాధపడుతున్నావ్.
దివ్య: అక్కడ ఇంట్లో జరిగిన గొడవ గుర్తుకు వచ్చి ఎప్పటికైనా అమ్మా నాన్న తిరిగి కలుస్తారేమోనని.. ఇన్నాళ్లు ఆశతో ఉన్నాను. ఇప్పడు ఇద్దరి మధ్య పూడ్చలేనంత ఆగాధం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఎప్పటికి తరగనంత దూరం ఏర్పడింది. తలుచుకుంటే బాధగా ఉంది.
విక్రమ్: నిజంగా అది చాలా దురదృష్టకరం. మామయ్యగారిని చూస్తే జాలేస్తుంది. చూద్దాం అత్తయ్య మనసు మారుతుందేమో..?
దివ్య: నాకా నమ్మకం లేదు. ఒకవిధంగా అమ్మ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి లేదేమో?
విక్రమ్: నువ్వెప్పుడు మీ అమ్మ నిర్ణయాన్ని వ్యతిరేకించవు నాకు తెలుసు.
అంటూ విక్రమ్ దివ్యను ఓదారుస్తాడు. అలాగే ఒకసారి తులసికి ఫోన్ చేయమని చెప్తాడు. అయితే ఎదురుగా ఉన్నప్పుడే సరిగ్గా మాట్లాడలేదని ఫోన్ చేస్తే మాట్లాడుతుందో లేదోనని దివ్య అంటుంది.
బసయవ్య రాజ్యలక్ష్మీ, సంజయ్ హాల్‌లో కూర్చుని సీరియస్‌గా ఉంటారు.
బసవయ్య: బాగుందక్క మన ముగ్గురం కలిసి ఏదో సంతాప సభ పెట్టినట్లుంది. నోరు తెరిచి ఏదైనా మట్లాడొచ్చు కదా నీలో నువ్వు రగిలిపోతే ఎలా? కక్కేయ్ అక్క మొత్తం కక్కేయ్
రాజ్యలక్ష్మీ: అసలు వాడు ఏమనుకుంటున్నాడు.
బసవయ్య: వాడంటే ఎవడు నీ పెద్దకొడుకేనా?
రాజ్యలక్ష్మీ: పెద్దకొడుకా? గాడిద గుడ్డా నాకున్నది ఒక్కటే కొడుకు సంజయ్. కర్మకాలి వాడికి అమ్మలా నటించాల్సి వస్తుంది.
అని ఆస్థి కోసం విక్రమ్‌తో జాగ్రత్తగా ఉండాలని రేపోమాపో ఆస్తి మొత్తం తమదే అని అంటే మన పరిస్థితి ఏంటని అలోచిస్తుంటారు. ఆస్థి విక్రమ్‌కు చెందకుండా ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవుతారు.
తులసి ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అయ్యి రాగానే వాళ్ల అత్తమామలు హ్యాపీగా ఫీలవుతారు. తులసి వాళ్ల అమ్మను తలుచుకుని బాధపడుతుంది. తర్వాత బయటికి వెళ్తుంది. నందగోపాల్ కూడా రెడీ అయ్యి హాల్ లోకి రాగానే తులసి రెడీ అయ్యి ఇప్పుడే బయటి వెళ్లిందని చెప్తారు వాళ్ల అమ్మా నాన్న, నంద కంగారుగా బయటికి వెళ్లి తులసిని పద వెళ్దాం అని అడగగానే తులసి వేరే కారులో ఆఫీసుకు వెళ్తుంది. దీంతో నంద బాధగా తన కారులో వెళ్తాడు. లాస్య, తులసి ఆఫీసులో ఉద్యోగికి ఫోన్ చేసి తులసి వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం నందగోపాల్ అని ఆఫీసులో అందరికీ చెప్పమని చెప్తుంది. ఆ ఉద్యోగి అలాగేనని చెప్తాడు.
విక్రమ్, సంజయ్ ఇద్దరూ హాల్‌లో చెస్ ఆడుతూ ఉంటారు. ఇంతలో రాజ్యలక్ష్మీ నవ్వుతూ అక్కడికి వస్తుంది.
విక్రమ్: ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్
రాజ్యలక్ష్మీ: ఏం లేదు నాన్నా.. మీ ఇద్దరూ కలిసి ఇలా ఆడుకోవడం చూసి ఎంత కాలం అయ్యిందో.. ముచ్చటేస్తుంది. అప్పుడప్పుడు ఇలా సరదాగా ఉంటేనే ఆపేక్ష, ఆప్యాయతలు మనసులోంచి బయటికి వస్తాయి. బంధాలు బలపడుతూ ఉంటాయి. ఒకరికొకరు దగ్గరవుతూ ఉంటారు.
బసవయ్య: మంచి మాట చెప్పావ్ అక్కాయ్. డబ్బు శాశ్వతం కాదు బంధాలు శాశ్వతం.
రాజ్యలక్ష్మీ: కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి.
అంటూ విక్రమ్, సంజయ్‌లకు ఫ్రూట్స్ తినిపిస్తుంది రాజ్యలక్ష్మీ. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న దివ్య ఇంత పెద్ద నాటకం ఆడుతుందంటే ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. హాస్సిటల్ అడ్మిషన్ పనులు దివ్య కాకుండా ఇకనుంచి సంజయ్ చూసుకుంటాడని రాజ్యలక్ష్మీ, విక్రమ్‌తో చెబుతుంది. విక్రమ్ కూడా సరే అంటాడు. అయితే దివ్య కలగజేసుకుని సంజయ్ చేస్తున్న దీక్ష పూర్తి కాకుండా బయటికి వెళ్లోద్దని.. అత్తయ్య ఆరోగ్యం కోసం నేను ఎంత కష్టమైనా పడతానని దివ్య చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.