Gruhalakshmi Serial Today January 20th: రాజ్యలక్ష్మీ మారిపోయింది. నంద, తులసి కలిసిపోవడంతో గృహలక్ష్మీకి శుభంకార్డు
Gruhalakshmi Today Episode: అందరూ మారిపోయి హ్యాపీగా ఉండటంతో గృహలక్మీ ఎండింగ్ ఎపిసోడ్ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.
Gruhalakshmi Serial Today Episode: లాస్య కొడుకు లక్కీకి యాక్సిడెంట్ అవుతుంది. ఎవరో తీసుకెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. లక్కీ ఫోన్ నుంచి లాస్యకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయదు. దీంతో వాళ్లు తులసికి ఫోన్ చేస్తారు. తులసి కంగారుపడుతూ హాస్పిటల్‌కు పరుగెత్తుకొస్తుంది. ఇక్కడెవరు నాకు ఫోన్ చేసింది అని కంగారుపడుతూనే అడుగుతుంది. లక్కీని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన మహిళ తానే లక్కీని హాస్పిటల్‌కు తీసుకొచ్చానని.. ఆ బాబుకు మీరేనా పెద్దమ్మ అని అడుగుతుంది. తులసి అవునని చెప్తుంది.
మహిళ: వాళ్లమ్మకు కాల్ చేస్తే కట్ చేశారు. అందుకనే నేను మీకు చేశాను. ఎవరూ పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యం ఏంటి?
తులసి: ఇంతకీ బాబు ఎక్కడండి? ఎలా ఉన్నాడు..?
అని తులసి అడుగుతుండగానే లోపలి నుంచి డాక్టర్ వచ్చి
డాక్టర్: యాక్సిడెంట్ అయిన బాబు తాలూకు ఎవరండి ఇక్కడ?
తులసి: నేనేనండి ఎలా ఉంది బాబుకి.
డాక్టర్: తలకు గట్టి దెబ్బ తగిలింది. రక్తం బాగా పోయింది.
అనగానే తులసి కంగారుపడుతుంది. వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రమాదం అని డాక్టర్ చెప్పగానే తులసి నాది బాబుది ఒకటే గ్రూపు నేను రక్తం ఇస్తాను అంటుంది. దీంతో తులసిని డాక్టర్ లోపలికి రమ్మంటుంది. లోపలికి వెళ్తున్న తులసి.. లక్కీని కాపాడిన వ్యక్తితో మరోసారి లాస్యకు ఫోన్ చేయమని చెప్తుంది. దీంతో ఆమె లాస్యకు మళ్లీ ఫోన్ చేస్తే చిరాకుగా లాస్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆమె లక్కీకి యాక్సిడెంట్ అయినట్లు చెప్తుంది. తులసి హాస్పిటల్ కు వచ్చినట్లు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తులసి బ్లడ్ ఇస్తుంది. ఇంతలో లాస్య వచ్చి డాక్టర్‌ను లక్కీకి ఎలా ఉందని అడుగుతుంది. టైంకి తులసి వచ్చి బ్లడ్ ఇవ్వడంతో సేఫ్ అయ్యాడు అని డాక్టర్ చెప్పడంతో లాస్య రిలీఫ్ అవుతుంది. తర్వాత తులసికి లాస్య థాంక్స్ చెప్తుంది. దీంతో ఒక భార్యగా ఓడిపోయావు, ఒక ఫ్రెండుగా ఓడిపోయావు, కనీసం ఒక తల్లిగానైనా బతుకు లేదంటే చనిపోయివడం బెటర్ అంటూ తలంటుపోసి వెళ్లిపోతుంది తులసి. లోపలికి వెళ్లి లక్కీని పలకరిస్తుంది లాస్య. మరోవైపు రాజ్యలక్ష్మీ బసవయ్యతో నా ఆఖరి అస్త్రం ప్రయోగించబోతున్నాను అంటూ చెబుతూ ఈ విషం విక్రమ్ గాడితో తాగించి.. వాడి చావుకు.. నా కొడుకు పట్టాభిషేకానికి ఒకే ముహూర్తం నిర్ణయించాను అని చెప్పి డోర్ తెరవగానే ఎదురుగా విక్రమ్, దివ్య ఉంటారు. దీంతో బసవయ్య, రాజ్యలక్ష్మీ షాక్ అవుతారు.
విక్రమ్: నమ్మలేక పోతున్నానమ్మా ఎదురుగా ఉన్నది నా అమ్మ అంటే అసలు నమ్మలేకపోతున్నాను. మా అమ్మ ఒక దేవత అని నమ్మాను. అమ్మా నాకు ఈ ఆస్తి మీద మోజు లేదమ్మా.. ఇన్నాళ్ల అభిమానం, ఆపేక్ష నా మీద కాదా..ఈ ఆస్తి మీదా?
రాజ్యలక్ష్మీ: అది కాదు నాన్నా..
దివ్య: విక్రమ్ చేతిలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసా? ఈ ఆస్థి, హాస్పిటల్ అంతా నీ పేరుమీదకు ట్రాన్సఫర్ చేసి విక్రమ్ సైన్ చేసిన డాక్యుమెంట్స్. మీ మనసులో ఉన్న స్వార్థం నాకు ముందే తెలిసినా అది విక్రమ్‌కు చెప్పకూడదని ఆగాను. ఎందుకు ఆగానో తెలసా? విని తట్టుకోలేడని ఆగాను. మిమ్మల్ని ఒక మంచి అమ్మలాగే జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని ఆగాను. ఈ లోపల మీరే తొందరపడ్డారు. మంచితనం అనే ముసుగు తీసేసి ఒక కసాయితల్లిలా విక్రమ్ ముందు నిలబడ్డారు.
అనగానే విక్రమ్ నేను ఎప్పటికీ మా అమ్మను ఓడిపోనివ్వను అంటూ ఆస్థి పేపర్లు రాజ్యలక్ష్మీ కాళ్ళ దగ్గర పెట్టి రాజ్యలక్ష్మీ చేతిలో పాయిజన్ బాటిల్ తీసుకుని తాగబోతుంటే రాజ్యలక్ష్మీ బాటిల్ లాక్కుని విసిరేసి బోరున ఏడుస్తూ దివ్యకు సారీ చెప్తుంది. మరోవైపు తులసి బ్యాగు తీసుకుని వెళ్లిపోతుంటే ఇంట్లో అందరూ వద్దని వారిస్తుంటారు. ఇంతలో దివ్య, రాజ్యలక్ష్మీ, విక్రమ్ తులసి వాళ్ల ఇంటికి వస్తారు. తులసిని ఎక్కడికి వెళ్తున్నావని దివ్య అడుగుతుంది. ఇక్కడ ఎవ్వరి ముఖం చూడటం ఇష్టం లేక మీ అమ్మ ముంబై వెళ్తుందని నంద చెప్తాడు. దీంతో దివ్య నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. నీకు చెబితే వెళ్లనివ్వవు అని చెప్పలేద అంటూ ఇంతకీ మీరెందుకు వచ్చారు అని తులసి అడుగుతుంది. రాజ్యలక్ష్మీ తన కోడలు తనను మంచి మనిషిగా మార్చిందని చెప్పడంతో తులసి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో లాస్య కూడా అక్కడకు వచ్చి తులసికి సారీ చెప్తుంది. నేను ఎన్ని తప్పులు చేసినా చివరికి నా కొడుకు ప్రాణాలు కాపాడావు అంటూ తులసి కాళ్లపై పడి.. పశ్చాతాప పడటం అంటే చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కదా అక్క అని అడుగుతుంది లాస్య. దీతో నేను చేసిన మొదటి తప్పు నిన్ను నందూను విడదీయడం అది నేను సరిదిద్దుకుంటాను అంటుంది లాస్య. దీంతో అందరూ నందతో కొత్త జీవితం పంచుకోమని చెప్తారు. దీంతో గృహలక్ష్మీ ఇవాళ్టీ ఎపిసోడ్ మాత్రమే కాదు మొత్తం సీరియల్ కే శుభం కార్డు పడింది.
Also Read:‘సరిపోదా శనివారం’ సెట్స్‌లో జాయిన్ అయిన స్టార్ యాక్టర్ - కన్ఫర్మ్ చేసిన మూవీ టీమ్!