అన్వేషించండి

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ సెట్స్‌లో జాయిన్ అయిన స్టార్ యాక్టర్ - కన్ఫర్మ్ చేసిన మూవీ టీమ్!

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సెట్స్‌లో ఎస్‌జే సూర్య జాయిన్ అయ్యారు.

SJ Suryah: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సూపర్ హీరో సినిమా ‘సరిపోదా శనివారం’. ఇంతకు ముందు నానితోనే ‘అంటే సుందరానికి’ తీసిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా అనుకున్నంత రిజల్ట్ అందించలేకపోయినా వివేక్ ఆత్రేయని, తన కథని నాని నమ్మి మళ్లీ ‘సరిపోదా శనివారం’ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ‘సరిపోదా శనివారం’ షూటింగ్ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పుడు సెట్స్‌లో వెర్సటైల్ స్టార్ యాక్టర్ ఎస్‌జే సూర్య జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఎస్‌జే సూర్య గత కొంతకాలంగా బ్లాక్‌బస్టర్లు అందుకుంటున్నారు. ‘జిగర్తాండా డబుల్ఎక్స్’, ‘మార్క్ ఆంటోని’, ‘డాన్’, ‘మానాడు’ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఏ సినిమాలో ఎస్‌జే సూర్య నటించినా హీరోతో సంబంధం లేకుండా అవి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాయని తమిళనాట మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ సినిమాల్లో కూడా ఎస్‌జే సూర్య నటిస్తున్నారు.

ఎస్‌జే సూర్య ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని దర్శకుడిగా ప్రారంభించారు. ‘వాలి’, ‘ఖుషి’ వంటి కల్ట్ సినిమాలకు ఆయనే డైరెక్టర్. కానీ నటన పైన ఉన్న మక్కువతో దర్శకత్వాన్ని పక్కనబెట్టారు. ప్రస్తుతం ఎస్‌జే సూర్యకు నటుడిగా మంచి డిమాండ్ ఉంది. ‘సరిపోదా శనివారం’లో విలన్‌గా నటించడానికి కూడా ఎస్‌జే సూర్య భారీ పారితోషికం డిమాండ్ చేశాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాకు ఆయన రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోనున్నాడని తెలుస్తోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరిద్దరూ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’లో జోడిగా కనిపించారు. తెలుగులో ఆమెకు అదే మొదటి సినిమా. ఎస్‌జే సూర్యతో కూడా ప్రియాంకకు ఇది రెండో సినిమానే. శివకార్తికేయన్  హీరోగా, ఎస్‌జే సూర్య ప్రిన్సిపల్‌గా నటించిన‘డాన్’లో కూడా ప్రియాంకనే హీరోయిన్. మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ‘సరిపోదా శనివారం’ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నాని ఇటీవలే స్వయంగా వెల్లడించారు.‘దసరా’, ‘హాయ్ నాన్న’ సక్సెస్‌ల తర్వాత ‘సరిపోదా శనివారం’తో నాని హ్యాట్రిక్ కొట్టే అవకాశం పుష్కలంగా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా ఐదు భాషల్లో విడుదల చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Sonia Gandhi Biopic: సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
Naga Vamsi Rishab Shetty : కాంతార హీరోతో నాగవంశీ కొత్త మూవీ - క్రేజీ టైటిల్ ఫిక్స్... జానర్ ఏంటో తెలుసా?
కాంతార హీరోతో నాగవంశీ కొత్త మూవీ - క్రేజీ టైటిల్ ఫిక్స్... జానర్ ఏంటో తెలుసా?
Samantha Ruth Prabhu : బిడ్డ పుట్టిన తర్వాత సమంత రీఎంట్రీ! - ఆ మూవీకి ఓకే చెప్పారా... రేసులో మరో వెబ్ సిరీస్?
బిడ్డ పుట్టిన తర్వాత సమంత రీఎంట్రీ! - ఆ మూవీకి ఓకే చెప్పారా... రేసులో మరో వెబ్ సిరీస్?
Chiranjeevi Kaaka : మళ్లీ ఆటో జానీ వచ్చేస్తున్నాడు - సంక్రాంతికి మాస్ జాతర కన్ఫర్మ్ 'కాకా'!
మళ్లీ ఆటో జానీ వచ్చేస్తున్నాడు - సంక్రాంతికి మాస్ జాతర కన్ఫర్మ్ 'కాకా'!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget