Gruhalakshmi December 14th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్ : దివ్యకు పిచ్చి పట్టిందన్న బసవయ్య – రోడ్ల పక్కన అడుక్కు తింటున్న పరంధామయ్య
Gruhalakshmi Serial Today Episode: పరంధామయ్యను కిడ్నాపర్ అనుకుని సెక్యూరిటీ గార్డ్ హాస్పిటల్ నుంచి గెంటివేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ మరింత ఆసక్తిగా జరిగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode: కొద్ది రోజులుగా దివ్యను ఎందుకు ఆయోమయంగా ఉన్నావని విక్రమ్ అడుగుతాడు. దేనికో భయపడుతున్నావని అదేంటో మాకు చెప్పమని అడగ్గానే రాజ్యలక్ష్మీ కూడా లేని ప్రేమను నటిస్తూ అదేంటో చెప్పు దివ్య మేమంతా ఉన్నాం కదా నువ్వు మనసులో భయపడుతూ ఇలా పిచ్చిదానిలా మారిపోతే ఎలా అంటుంది.
బసవయ్య: మొగుడికే చెప్పలేదంటే ఇంక నీకేం చెబుతుంది అక్కాయ్.
విక్రమ్: ఒకవేళ మెంటల్ టెన్షన్ వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నట్లున్నావు. ఉన్నది లేనట్లు బ్రమ పడుతున్నావు. నిన్న తులసి మొక్క విషయంలో ఇలాంటి అనుమానమే వచ్చింది. చెప్తే బాధపడతావని ఆగిపోయాను.
బసవయ్య: ఎందుకైనా మంచిది ఓ మంచి సైకియాట్రిస్ట్ కు చూపిస్తే మంచిదేమో?
దివ్య: అంటే ఏంటి మీ ఉద్దేశ్యం. నాకు పిచ్చి అనా నీకు పిచ్చి మీ ఆవిడకు పిచ్చి
అంటూ నిజంగానే పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంటే విక్రమ్ కూడా మామయ్య చెప్పినదాంట్లో తప్పేముంది అనడంతో వాళ్ల తాతయ్య కూడా దివ్యను రూంలోకి తీసుకెళ్లమని చెప్తాడు. విక్రమ్, దివ్యను తీసుకుని రూంలోకి వెళ్తాడు. బసవయ్య, రాజ్యలక్ష్మీ, ప్రసూనాంబ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటుంటారు. హాస్పిటల్‌లో నంద వాళ్ల నాన్నను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ రూంలోకి వెళ్తాడు. బయట కూర్చున్న పరంధామయ్య తనకు ఎదురుగా కూర్చున్న చిన్న బేబికి చాక్లెట్ ఇవ్వడానికి వెళ్తాడు. పాప ఏడుస్తూ ఉంటుంది. సెక్యూరిటీ చూసి ఎవరు మీరు అంటూ అడగ్గానే పరంధామయ్య తనకు ఏం గుర్తు రావడం లేదని చెప్పడంతో నువ్వు పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చావని కోపంగా పరంధామయ్యను సెక్యూరిటీ గార్డు బయటకు గెంటి వేస్తాడు. దీంతో పరంధామయ్య రోడ్డు పట్టుకుని వెళ్లిపోతాడు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి పరంధామయ్యకు అల్జీమర్ ఉందని చెప్తాడు డాక్టర్. ఇంతలో నందకు తులసి ఫోన్ చేస్తుంది.
నంద: హలో
తులసి: మామయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లారా లేదా? ఒకవేళ మీకు కుదరకపోతే చెప్పండి. ఆఫీసులో నా పని పూర్తి అయ్యింది. ఇంటికి బయలుదేరుతున్నాను. నేను తీసుకెళ్తాను.
నంద: ఒకసారి నేను చెప్పేది కూడా విను తులసి. నేనిప్పుడు హాస్పిటల్ లోనే ఉన్నాను. నీకు నమ్మకం లేకపోతే చెప్పు డాక్టర్ గారితో మాట్లాడిస్తాను.
తులసి: అవసరం లేదు లేండి
నంద: నువ్వు చెప్పాక తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను. బయలుదేరేటప్పుడు మళ్లీ కాల్ చేస్తాను.
అని ఫోన్ పెట్టేసి డాక్టర్ రూంలోకి వెళ్తాడు నంద. నెక్ట్స్ టైం పేసెంట్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరొచ్చి స్టేటస్ చెప్తే చాలు అంటూ నందాకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు డాక్టర్. బయటకు వచ్చిన నందాకు పరంధామయ్య కనిపించకపోవడంతో కంగారుగా అక్కడున్న సెక్యూరిటీ గార్డును తిట్టి, పరంధామయ్య ను వెతుక్కుంటూ బయటకు పరుగెత్తుతాడు నంద. దివ్య రూంలో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది విక్రమ్ అక్కడకు వచ్చి దివ్యను ఓదారుస్తాడు. తులసి మొక్క గురించి, వంట గురించి చెబితే నేను నిన్ను నమ్ముతున్నానని విక్రమ్ చెప్తాడు. ఒకవేళ నాకు నిజంగానే మెంటల్ అయితే నన్ను వదిలేస్తావా? అని దివ్య అడగ్గానే ప్రాణం వదులుకుంటావా? దివ్యను వదులుకుంటావా? అంటే ప్రాణమే వదులుకుంటానని విక్రమ్ చెప్పగానే దివ్య హ్యాపీగా ఫీలవుతుంది.
మరోవైపు నంద రోడ్ల మీద తిరుగుతూ పరంధామయ్యను వెతుకుతారు. తులసి ఇంటికి వచ్చి అనసూయతో నందలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతుంది. ఇంతలో కంగారుగా నంద ఇంటికి పరుగెత్తుకొస్తారు. పరంధామయ్య తప్పిపోయిన విషయం చెబుతాడు. దీంతో తులసి, నంద ఇద్దరు కలిసి పరంధామయ్యను వెతకడానికి వెళ్తారు. ఎంత వెతికినా పరంధామయ్య కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని వెళ్తారు. రోడ్లమీద తిరుతుగున్న పరంధామయ్యకు ఆకలి వేయడంతో పానీపూరి బండి దగ్గరకు వెళ్లి తినడానికి ఏమైనా ఇవ్వమని అడుక్కుంటాడు. మరోవైపు నంద, తులసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.