Brahmamudi December 14th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : స్వప్నను గెంటేసేందుకు రుద్రాణి కొత్త ప్లాన్ – కావ్యపై రివెంజ్ తీర్చుకున్న రాజ్
Brahmamudi Serial Today Episode: డీఎన్ఏ టెస్టుకు వెళ్లడానికి ముందే ఇంట్లో వాళ్లందరు స్వప్నను బయటకు గెంటి వేయాలని రుద్రాణి కొత్త ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Telugu Serial Today Episode: ఇంట్లో అందరూ పూజ చేసిన తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటారు. అయితే మగవాళ్లు ఎందుకు ఉపవాసం ఉండాలని అడవాళ్లు మాత్రమే ఉపవాసం ఉండాలని సుభాష్ అనడంతో.. అందరూ అవునని మగవాళ్లు టిఫిన్ చేయడానికి వెళ్తారు. అయితే కావ్య మాత్రం రాజ్ తనతో కలిసి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటానన్నాడని రాజ్‌ను ఇరికిస్తుంది. రాజ్ ఆయోమయంగా చూస్తుండి పోతాడు.
రాజ్: ఇప్పుడే ఆకలేస్తుంది. సాయంత్రం వరకు ఎలా తట్టుకునేది రాక్షసి ఇలా ఇరికించేసిందేంటి?
అని మనసులో అనుకుంటాడు రాజ్.. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న సుభాష్ టిఫిన్ బాగుంది కావ్య చేసిందా? అని అడుగుతాడు.
సుభాష్: ఏ రాజ్ నువ్వ వచ్చేసెయ్ ఉపవాసాలు మనకు పడవు పెసరట్టు చాలా బాగుంది.
కావ్య: అయ్యోయ్యో మావయ్యగారు అపచారం. ఉపవాసం ఉంటానని మాట తప్పితే ఏమైనా ఉందా?
అపర్ణ: నువ్వు ప్రపంచంలోనే లేని ఆచారాలు తెచ్చి వాడి నెత్తినే రుద్దు
అనగానే అదేం లేదమ్మా కళావతి చేస్తున్న పూజలు సక్సెస్ కావాలని నేను ఉపవాసం ఉంటున్నాను. మీరేం వర్రీ కాకండి. అంటూ బాధగా లేచి లోపలికి వెళ్లిపోతాడు. స్వప్న కూడా ఉపవాసం ఉందని తెలిసి నువ్వేం ఉపవాసం ఉండొద్దని తినమని చెప్తారు. దీంతో స్వప్న వెళ్లి టిఫిన్ చేస్తుంది.
రాజ్ దొంగ చాటుగా వెళ్లి బెడ్ రూంలో ముసుగు కప్పుకుని ఫ్రూట్స్ తింటుంటాడు. కావ్య లోపలకి వచ్చి రాజ్ ను చూసి షాక్ అవుతుంది.
కావ్య: ఏంటివన్నీ
రాజ్: ఫ్రూట్స్
కావ్య: ఇదేనా ఉపవాసం చేయడం అంటే..
రాజ్: నేను ఉపవాసం చేస్తా అనలేదు. నువ్వు బలవంతంగా కమిట్ చేయించావ్.
కావ్య: ఈవినింగ్ వరకు ఓపిక పడితే ఏమౌతుంది.
రాజ్: ఆకలేసి కళ్లు తిరిగి షోష వచ్చి చక్కెర తక్కువై గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి.. కళ్లకు చీకట్లొచ్చి నేనే పోతాను. అయినా నాకు నీమీద చాలా కోపంగా ఉంది.
అనగానే ఈ ఒక్కరోజైనా మనం ఉపవాసం చేస్తే ఆ దేవుడు కరుణించి మనల్ని కలుపుతాడనుకుంటే మీరిలా చేస్తున్నారేంటి అంటూ కోపంగా బయటకు వెళ్తుంది కావ్య. రాహుల్, రుద్రాణి సీరియస్‌గా మాట్లాడుకుంటుంటారు.
రాహుల్: ఆ స్వప్నను చూస్తుంటే పిచ్చి కోపం వస్తుంది మమ్మీ. అదే మనకు వారసుణ్ణి ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. దాని ఓవరాక్షన్ చూస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాను.
రుద్రాణి: ఈ ఆలోచించేదేదే ఆ స్వప్నను తల్లిని చేసే ముందు ఆలోచించి ఉంటే ఈ పాటికి అది ఇంటి నుంచి వెళ్లిపోయుండేది. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడొచ్చి చేయి కాలుతుంది. ఒళ్లు మండుతుంది అని ఏడిస్తే ఏం లాభం.
రాహుల్: సొలూష్యన్ చెప్పకుండా ఈ సొల్లు ఎందుకు మమ్మీ.
అనగానే రుద్రాణి, స్వప్నను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది. దీంతో రాహుల్ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రూంలో రాజ్ ఆకలితో బాధపడుతూ కావ్యను తిట్టుకుంటుంటాడు. ఇంతలో రాజ్‌కు శ్వేత ఫోన్ చేస్తుంది. తాను కూడా గుడికి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. శ్వేతను ఎవరైనా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంగా ఆలోచిస్తుంటాడు రాజ్.
అందరూ గుడికి వెళ్తారు. అక్కడికి అనామిక వాళ్లు ఫ్యామిలీతో రావడం చూసి షాక్ అవుతారు. తర్వాత అప్పు వాళ్ల నాన్న మూర్తి రావడం చూసి ఇంకా సర్‌ఫ్రైజ్ అవుతారు. అందరూ మాట్లాడుకుంటూ గుడిలోకి వెళ్తారు. అయితే అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనామిక వాళ్ల అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. కావ్య అప్పుడే లోపలికి రాదని 108 ప్రదిక్షణలు చేస్తానని మొక్కుకుందని రాజ్ చెప్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. ఇలా ఇరికించారా శ్రీవారు అంటూ మనసులో అనుకుంటుంది కావ్య. రాజ్, కావ్యను తీసుకుని ప్రదిక్షణలు చేయడానికి లోపలికి వెళ్తాడు.
రుద్రాణి: అరుణ్ రాలేదేంట్రా
రాహుల్: వస్తాడు మమ్మీ..
రుద్రాణి: వస్తాడు కాదు. రావాలి అంత మనం అనుకున్నట్లే జరగాలి. ఆ స్వప్న డీఎన్‌ఏ టెస్ట్ కు వెళ్లకముందే అంతా కలిపి పుట్టింటికి తరిమేయాలి.
రాహుల్: దాని ప్రియుణ్ని ఇక్కడికి పిలిపించుకుందని అంతా అనుకునేలా అరుణ్ నమ్మిస్తాడులే మమ్మీ.
అంటూ అరుణ్‌కు ఫోన్ చేస్తాడు రాహుల్. అరుణ్ ఫోన్ ఎత్తి ఇక్కడే గుడి ముందే ఉన్నానని చెప్తాడు. అయితే నువ్వు ముందు స్వప్నకు మాత్రమే కనిపించాలని చెప్తాడు రాహుల్. నాకు అంత తెలుసు సార్ మీరేం వర్రీ కాకండి అని చెప్తాడు అరుణ్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.