Extra Jabardasth: కర్చీఫ్ తీసే లోపు వెళ్లిపోయావ్, ‘భోళా శంకర్’ సీన్‌పై రష్మికి పంచ్
ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులను అలరించే 'ఎక్స్ ట్రా జబర్దస్త్' కు లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇమాన్యుయల్, బుల్లెట్ భాస్కర్, రాంప్రసాద్ వేసిన పంచులు హైలెట్ గా నిలిచాయి.
ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ప్రతి శుక్రవారం ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతివారం సరికొత్త స్కిట్లతో ఆడియన్స్ ని తమ పంచులతో నవ్విస్తున్నారు కమెడియన్స్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో మరోసారి ఇస్మార్ట్ ఇమ్మానియేల్ స్కిట్ హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారి డైలాగ్ ని ఇమిటేట్ చేయడం ఆకట్టుకుంది.
ఇక లేటెస్ట్ ప్రోమోను పరిశీలిస్తే.. ఇమాన్యుల్ భార్య క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఓ ముద్దు ఇవ్వచ్చు కదా అని అంటుంది. దానికి ఇమాన్యుయల్, "అమ్మో.! నేను పెట్టను. ఈ మధ్య మీ పెళ్ళాలు ముద్దు పెడతామని పిలిచి పెదాలు కొరికి పక్కన పెడుతున్నారట" అని చెప్పడంతో కుష్బూ, కృష్ణ భగవాన్ పగలబడి నవ్వారు. ఆ తర్వాత బాబు, వర్షా భార్యాభర్తలుగా ఎంట్రీ ఇచ్చారు. "ఏవండీ నేను ఒడ్డున పడిన చాపలా ఉంటానా? అని వర్ష బాబుని అడుగుతుంది. దానికి బాబు.. "లేదు కత్తర్ పాపలా ఉంటావు" అని పంచ్ వేయడంతో షోలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.
దాని అనంతరం భాస్కర్ స్కిట్ ని చూపించారు. ‘‘చిరంజీవి సినిమాలో నువ్వు చేసావు’’ అని రష్మితో చెబుతూ.. "నీకోసం సినిమా థియేటర్‌కు వెళ్తే ఇంటర్వెల్ వరకు కనబడలేదు. సరే ఇంటర్వెల్ తర్వాత వస్తావు కదా అని థియేటర్లో వెయిట్ చేస్తే కింద కర్చీప్ పడింది. ఇలా తీసేలోపే మళ్ళీ వెళ్ళిపోయావు" అంటూ రష్మీని ఆటపట్టించడంతో షోలో ఉన్న వాళ్లంతా నవ్వారు. "ఊరు వెళ్తే పిల్లలు ఎప్పుడూ పిల్లలు ఎప్పుడూ? అని అడుగుతున్నారు" అని భాస్కర్ భార్య అడగగా, "బేబీ ఒకటి గుర్తుపెట్టుకో, అరవని కుక్క ఉండదు. విమర్శించని నోరు ఉండదు. ఇవి రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి" అని జైలర్ ఆడియో లాంచ్ లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయగా మధ్యలో కుష్బూ, డైలాగ్ తమిళంలో తప్పు చెప్పావని భాస్కర్ తో అంటుంది. దీంతో భాస్కర్ తెల్లముఖం వేస్తాడు.
ఆ తర్వాత రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా.. "మొన్న పెళ్లి చూపులుకి ఇంటికి ఎవరో వచ్చారట, ఏమైంది? అని అడిగితే, "ఏముంది, ఎప్పటిలాగే సిగరెట్ తాగినా, మందు తాగినా నచ్చదు. అందుకే క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజుల్లో మందు సిగరెట్ అబ్బాయిలకు కామన్ కదా, అని అంటే.. నాకు అలవాటు ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారు’’ అంటూ లేడీ గెటప్ లో ఉన్న రాంప్రసాద్ చెప్పడంతో, ‘‘మీ పంచులు అర్ధమైపోతున్నాయి ముందుగానే’’ అంటూ కృష్ణ భగవాన్ సెటైర్ వేయడంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత, "ఏంటి మీ ఇంట్లో డైలీ మీ అమ్మకు నీకు గొడవ? అని అడిగితే, "మా నాన్న ఎవరో తెలియక గొడవ’’ అని రాంప్రసాద్ చెప్పడంతో నవ్వులు విరిసాయి. అలా ప్రోమో అంతా సరదాగా సాగింది. ప్రోమోని బట్టి చూస్తే రాబోయే ఎపిసోడ్లో ఇమాన్యుల్, బుల్లెట్ భాస్కర్, రాంప్రసాద్ స్కిట్స్ హైలెట్ గా నిలువబోతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : కృష్ణంరాజు, ప్రభాస్‌కు మధ్య తేడా ఇదే - నా దృష్టిలో కింగ్ అంటే ఆ హీరోనే: సీనియర్ నటి తులసి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial