Devatha August 16th Update: సంతోషంలో రుక్మిణి, దేవి - పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్
దేవి నాన్న కోసం బాధపడటం చూసి ఆదిత్య అల్లాడిపోతాడు. తన బాధ తగ్గించేందుకు అనాథ ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఈరోజూ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దేవి, రాధ సంతోషంగా ఇంటికి వస్తారు. నీకోసం స్కూల్ కి వచ్చాను వెళ్లిపోయారని చెప్పారు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎక్కడివి వెళ్లావమ్మ అని లేని ప్రేమని నటిస్తూ మాట్లాడతాడు మాధవ. నేను ఎక్కడికి పోలేదు నాయనా ఆఫీసర్ సారు నన్ను అమ్మని ఓ చోటుకి తీసుకెళ్ళాడు అనేసరికి మాధవ టెన్షన్ గా ఎక్కడికి అని అడుగుతాడు. మా నాయన కనిపించడం లేదని పరేషన్ అవుతున్నా కదా అందుకే ఆఫీసర్ సారు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడ చాలా మంది నాలెక్క చిన్న చిన్న పోరీలు ఉన్నారు పాపం వాళ్ళకి నాన్న, అమ్మ ఎవరో తెలియదు కానీ వాళ్ళందరూ నాలాగా బాధపడటం లేదు చాలా సంతోషంగా ఉన్నారని దేవి అనడంతో ఏంటి రాధ దేవిని అలాంటి చోటుకి తీసుకెళ్తే తను ఇంక బాధపడుతుంది కదా, ఎందుకు తీసుకెల్లావ్ అని మాధవ కోపంగా అడుగుతాడు. నేనేమీ బాధపడటం లేదు వాళ్ళంతా నాయన, అమ్మ లేకపోయినా బాగున్నారు అసువంటిది మా నాయన నాదగ్గరకి రాకపోతే ఏమి, నన్ను చూడకపోతే ఏంది అమ్మ ఉన్నది కదా నేను ఇంక ఎంత సంతోషంగా ఉండాలి, అందుకే నేను మా నాయన గురించి ఇంకేమీ అడగను మా అమ్మతో సంతోషంగా ఉంటాను అని దేవి సంబరంగా చెప్తుంది.
‘నాయన నాయన అని నా బిడ్డ బాధపడుతుంటే గా ఆఫీసర్ సారు చూశాడు నా బిడ్డని మంచిగా చేసిండు నా బిడ్డకి ఆ సారు ఉన్నాడు, నా బిడ్డకి కష్టం వస్తే ఏదైనా చేస్తాడ’ని రాధ చెప్తుంటే అది విని మాధవ రగిలిపోతాడు. నాన్న నాన్న అంటూ నువ్వు రాధని ఇబ్బంది పెడితేనే కదా నాకు లాభం నాన్న అవసరం లేదని నువ్వు రిలాక్స్ అవుతుంటే ఎలా నువ్వు నాన్న గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే రాధ అల్లాడిపోవాలి అప్పుడే కదా నీకు సమాధానం చెప్పలేక నాతో పెళ్ళికి ఒప్పుకునేది, అటువంటిది నువ్వు ఇప్పుడు నాన్న వద్దు అంటే ఎలా? ఎలాగైనా కొత్త ప్లాన్ వెయ్యాల్సిందే అని మాధవ అనుకుంటాడు. ఆదిత్య మాధవ మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి సమస్య లేకుండా చేశాను కానీ ఆ మాధవగాడు ఏదైనా కొత్త ప్లాన్ వేయడానికి ఆలోచిస్తాడు, అసలు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తాడు. అప్పుడే అక్కడికి సత్య వస్తుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావ్, నువ్వు ఇలా నీలో నువ్వే బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ఇలా బాధపడితే నీ ఆరోగ్యానికి మంచిది కాదని సత్య అంటుంది.
Also Read: ఖైలాష్ కి వేద స్ట్రాంగ్ వార్నింగ్, సులోచన మాటలకి ఎమోషనలైన మలబార్ మాలిని
రుక్మిణి తన బాధని తల్లి భాగ్యమ్మతో పంచుకుంటుంది. ఆ మాధవగాడు మాటలు విని తన నాయన గలిజ్ గాడని అనుకుంటుంది భాగ్యమ్మ బాధపడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సడెన్ గా దేవి లేచి కూర్చుంటుంది. వాళ్ళ మాటలు విన్నదేమో అని టెన్షన్ పడతారు కానీ వినలేదని తెలిసి ఊపిరి పీల్చుకుంటారు. బిడ్డ ఎక్కడ విన్నదో అని ప్రాణం పోయిందని రుక్మిణి టెన్షన్ పడుతుంది. వింటే ఏమైంది నిజం తెలిసేది ఇన్ని దినాలు నిజం దాచి ఆ మాధవ గాడికి తోక తెచ్చావ్ ఆ తోక ఎప్పుడు తెగుతదా అని ఎదురు చూస్తున్నావ్.. వాడి పీడ ఎప్పుడు విరగడా అవుతుందా తల్లి మొక్కు ఎప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్న అని భాగ్యమ్మ అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. నేను అదే ఎదురు చూస్తున్న ఆ మాధవ సారు ఆ మాటలు చెప్పకపోయి ఉంటే నా బిడ్డ మంచిగా వాళ్ళ నాయన దగ్గర ఉండేదని రుక్మిణి అనుకుంటుంది.
దేవి మనసులో నేను వేసిన చెత్తాని నువ్వు ఆదిత్య మొత్తం క్లీన్ చేశారు కదా అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? మీరు క్లీన్ చేశారని నేను ఊరుకుంటానా మళ్ళీ చేస్తాను నీ కళ్ల ముందే ఏం చేస్తానో చూడు అని మాధవ అంటాడు. చూడు నా బిడ్డ జోలికి వస్తే బాగోదు అని రుక్మిణి వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఆదిత్య, నువు ఆవేశపడ్డారు వద్దు నా గురించి తెలిసి కూడా ఇలా చేయొద్దు ఇప్పుడు చూడు నీ కళ్ల ముందే ఏం చేస్తానో అని మాధవ ఎవరికో ఫోనే చేస్తాడు. మళ్ళీ ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని రుక్మిణి టెన్షన్ గా ఆలోచిస్తుంది.
Also Read: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
మాధవ ఇంటికి ఊరి రైతులు వస్తారు. మీ సమస్య ఏంటని మాధవ అడుగుతాడు. చేతికొచ్చిన పంట వరదల కారణంగా నష్టపోయాము, ప్రభుత్వం నుంచి సాయం వచ్చింది కానీ సగం మందికే వచ్చింది మాదాకా రాలేదు ఇది అయ్యగారికి చెప్పి ఆఫీసర్ సారుని కలిసి ఈ కాగితాలు ఇద్దామని వచ్చామని చెప్తారు. దానికి మీరంతా అక్కడికి వెళ్ళడం ఎందుకు ఆ ఆఫీసర్ ని పిలిపించి నేనే మాట్లాడతాను అని రైతులకి చెప్తాడు. సరే అని రైతులు ఆ కాగితాలు ఇచ్చి వెళ్లిపోతారు.