News
News
X

Ennenno Janmalabandham August 16th Update: ఖైలాష్ కి వేద స్ట్రాంగ్ వార్నింగ్, సులోచన మాటలకి ఎమోషనలైన మలబార్ మాలిని

వేద ఖైలాష్ ని విడిపించడానికి వెళ్ళినట్టు యష్ కి చెప్తుంది. కానీ అప్పటికే ఖైలాష్ ని ఎవరో విడిపించుకుని తీసుకుపోయినట్టు పోలీసులు చెప్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

ఖైలాష్ ని విడిపించడానికి పోలిసు స్టేషన్ కి వెళ్లొచ్చిన్నట్టు వేద యష్ కి చెప్తుంది. మొదట కోప్పడినా తర్వాత యష్ మామూలుగా ఉంటాడు. నా మీద మీకు కోపంగా లేదా అని వేద అడిగితే కోపమంటే కారణం చెప్పావ్ కాబట్టి లేదు కానీ ఆ ఖైలాష్ లాంటి వాడికి శిక్ష తప్పడమే కరెక్ట్ గా లేదు. పిచ్చి కుక్క బోన్ లో ఉంటేనే పది మందికి మంచిది, అదొక్కటే ఆలోచిస్తున్నాను అంటాడు. నువ్వు చెప్పకపోతే ఈ విషయం నాకు ఎప్పటికీ తెలియదు కానీ ధైర్యం చేసి విషయం చెప్పావు చూడు అది నాకు నచ్చింది వేద అని యష్ తనని అభినందిస్తాడు. ఆ రోజు ఖైలాష్ చేసిన పని ఎవ్వరూ క్షమించారు కానీ నువ్వు నీ కోసం కన్నా మా అక్క, మా కుటుంబం, మా అందరి సంతోషం కోసం ఆలోచించావ్ చూడు అప్పుడే నువ్వు ఒక మెట్టు పైకి వెళ్లావ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు వేద అని మెచ్చుకుంటాడు. అయిన అ ఖైలాష్ గాడికి హెల్ప్ చేసింది ఎవరు అని యష్ ఆలోచిస్తాడు.  

వీడిని మన ప్లాన్ కోసం రిలీజ్ చేసినట్టు లేదు నా ఓపికను టెస్ట్ చెయ్యడానికి తీసుకొచ్చినట్టు ఉందని మాళవిక అభితో అంటుంది. వాడి ఓవర్ కాన్ఫిడెన్స్ పిచ్చి చూపులు నాకు నచ్చడం లేదు కానీ తప్పదు భరించాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం వాడు భరించలేడు అని అభి అంటుంటే ఖైలాష్ అక్కడికి వస్తాడు. మాళవిక వైపు కసిగా చూస్తూ వెకిలిగా మాట్లాడతాడు. అసలు ఏం కావాలి డైరెక్ట్ గా చెప్పు అని అభి అనేసరికి మందు కావాలి బ్రో అని అంటాడు. అక్కడ ఉంది తీసుకోపో అని చెప్తాడు.

Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

వేద రెడీ అవుతూ ఉంటుంది. తన బ్లౌజ్ హుక్ పట్టక ఇబ్బంది పడుతుంటే ఏమైంది ఏమైనా హెల్ప్ కావాలా అని యష్ అడుగుతాడు. ఏం లేడని యష్ వెళ్లబోతుంటే వేద పిలిచి హెల్ప్ చెయ్యమని అడుగుతుంది. బ్లౌజ్ హుక్ పెట్టమని చూపిస్తే యష్ పెట్టేస్తాడు. ఒక్క హుక్ కోసం ఇన్ని స్టంట్స్ చేసే బదులు డైట్ మీద దృష్టి పెట్టవచ్చు కదా అని అంటాడు. ఈ విషయం మీద ఇద్దరి మధ్య కాసేపు చిలిపి గొడవ జరుగుతుంది. కాంచన కోసం కుంకుమ పువ్వు తీసుకురమ్మని మాలిని రత్నంకి చెప్తుంది. ఇలాంటివి సులోచనకి బాగా తెలుస్తాయి వెళ్ళి అడుగు అని రత్నం చెప్పడంతో మాలిని వెళ్తుంది. కానీ తను ఇంట్లో లేడని శర్మ చెప్తాడు. తర్వాత సులోచన ఇంటికి వేస్తుంది. ఎక్కడివి వెళ్లావ్ అని అడిగితే మన కాంచన కడుపుతో ఉంది కదా కుంకుమ పువ్వు తీసుకురావడానికి వెళ్ళాను. కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే కడుపులో బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుడతాడని సులోచన అనే మాటలు మాలిని విని ఎమోషనల్ అవుతుంది. అది తీసుకుని మాలినికి ఇస్తుంది.

వేద, ఖుషి బయటకి వెళ్లేందుకు కారు దగ్గరకి వస్తారు, అప్పుడే అటుగా వెళ్తున్న ఖైలాష్ కారులో నుంచి దిగుతాడు, తనని చూసి ఖుషి చాలా సంతోషిస్తుంది. ఖైలాష్ వచ్చి ఖుషితో మాట్లాడుతూ వేద వైపు చూస్తూ ఉంటాడు. అదేమీ పట్టించుకోకుండా వేద వెళ్లబోతుంటే ఖైలాష్ ఆపుతాడు. ఏంటి నన్ను నా స్టైల్ చూసి కూడా ఏం కామెంట్ చెయ్యకుండా వెళ్లిపోతున్నావ్ అని ఖైలాష్ అడుగుతాడు, బురదలో రాయి వెయ్యడం బుద్ది లేని వాడితో మాట్లాడటం వెస్ట్ అని వేద అంటుంది. నువ్వు రాయి వేసినా ఈ బురద మాత్రం నీ మీద బంగారాన్నే చల్లుతుంది, కొత్త కారు కదా ఒకసారి డ్రైవ్ చేసి చూడు యష్ కారు కన్నా చాలా కంఫర్ట్ గా ఉంటుందని నీచంగా మాట్లాడతాడు. ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్ లో ఉన్న కంఫర్ట్ సరిపోలేదు అనుకుంటా ఇంక పిచ్చి వాగుడు దగ్గరలేదని వేద కోపంగా అంటుంది. అసలు నువ్వు నా గురించి ఏమని అనుకుంటున్నావ్ ఈ ఖైలాష్ అంటే మోస్ట్ వాంటెడ్.. నా అవసరం చాలా మందికి ఉంది నాతో పెట్టుకున్న వాళ్ళు బాగు పడినట్టు చరిత్రలోనే లేదు నీకు కూడా ఇదే జరుగుతుంది. జరిగింది అంతా మర్చిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం నాతో వచ్చేయ్ ఎంజాయ్ చేద్దామని ఖైలాష్ వాగుతాడు. నీలాంటి వాడిని విడిపించాడంటే వాడు ఎంత పనికిమాలినవాడో.. ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించి వదిలేశాను ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేస్తే పడేది చెంప దెబ్బలు కాదు అందరి చెప్పు దెబ్బలు అని వేద వార్నింగ్ ఇస్తుంది. చెంప దెబ్బలు ఒకే నీ చెయ్యి తగులుతుంది కదా వావ్ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అని ఖైలాష్ నీచంగా మాట్లాడతాడు.

Also Read: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

కాంచనకి ఖైలాష్ ఫోన్ చేస్తాడు. బయటకి వచ్చాక నను కలవాలి నాతో మాట్లాడాలి అని అనిపించలేదా అని కాంచన ఏడుస్తూ అడుగుతుంది. మిమ్మల్ని ఎవరు బయటకి తీసుకొచ్చారు అని కాంచన అడిగితే మీకు బాగా కావాల్సిన వాళ్ళే తీసుకొచ్చారు అభిమన్యు అని చెప్పడంతో షాక్ అవుతుంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్తాడు. అసలు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నారని అడుగుతుంది.  రెస్టారెంట్ లో కలుసుకుని మాట్లాడుకుందాం నువ్వేమి కంగారూ పడకు అని ఖైలాష్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

తరువాయి భాగంలో..

యష్, వేద పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. పూజ పూర్తైన తర్వాత వేద ఆశీర్వాదం కోసం యష్ కాళ్ళ మీద పడుతుంది. ఏమని దీవించాలి అని యష్ తన తల్లి మాలినిని అడుగుతాడు. దీర్ఘ సుమంగళి భవ అని చెప్తుంది. యష్ అదే మాట అని వేదని ఆశీర్వదిస్తాడు. దానికి వేద చాలా సంతోషిస్తుంది.

Published at : 16 Aug 2022 07:53 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial August 16th

సంబంధిత కథనాలు

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్