Chinni Serial Today December 25th: చిన్ని సీరియల్: అదిరిపోయే లుక్‌లో మ్యాడీ, శ్రేయ! దేవాని వణికించేసిన లెటర్..నిజంగా చిన్నినే రాసిందా!
Chinni Serial Today Episode December 25th నిశ్చితార్థం వేడుక దగ్గరకు చిన్ని రాసినట్లు దేవాకి బెదిరింపు లెటర్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధుతో నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. మన ఫ్రెండ్ ఒకరు చెప్పారు అందుకే వచ్చానని అంటుంది. డాడీ వాళ్లు చెప్పినా వినకుండా నిశ్చితార్థం ఏర్పాటు చేశారని చెప్తాడు. దాంతో మన సంకల్పం గొప్పది అయితే అనుకున్నది జరుగుతుందని మధు అంటుంది. ఇంతలో ఆఫ్ టికెట్ ఫోన్ చేస్తే మాట్లాడటానికి పక్కకి వెళ్తుంది.
లోహిత మధుతో అదృష్టం అంటే నీదో నిశ్చితార్థం ఫొటోలు చూసి ఏడుస్తావంటే లైవ్‌లోనే ఏడ్చే అదృష్టం దొరికింది నీకు. నీ కలలు అన్నీ కన్నీరు అయి గోదారిలో కలిసిపోతాయి పాపం అని అంటుంది. లోహిత వెళ్లిపోయిన తర్వాత మధు ఆఫ్ టికెట్‌తో మాట్లాడుతుంది. ఆఫ్ టికెట్ నాలుగైదు రోజుల్లో నాన్న దొరుకుతారు.. అప్పటి వరకు దేవాతో మాట్లాడకు అని చెప్తాడు. కానీ మధు దేవా ఇంట్లోనే ఉన్నాను మాట్లాడుతాను అని అంటుంది. ఆఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. నన్ను క్షమించి ఆఫ్ టికెట్ నేను మాట్లాడుతా అని అంటుంది. ఏం చేయాలి అని ఆఫ్ టికెట్ టెన్షన్ పడతాడు.
నాగవల్లి ప్రమీలకు నిశ్చితార్థం రింగులు చూపిస్తుంది. లోహిత చూసి సూపర్ ఆంటీ మీ సెలక్షన్ సూపర్ అంటుంది. నా సెలక్షన్ బాగుంటుంది కానీ నేను నిన్ను సెలక్ట్ చేయలేదు అంటుంది. ఇక నాగవల్లి మధుకి కూడా రింగులు చూపిస్తుంది. మధుకి చూపించడం ఎందుకు ఆంటీ తనకు నచ్చలేదు అంటే మార్చేస్తారా అని లోహిత అడుగుతుంది. తప్పకుండా మార్చేస్తా తను మ్యాడీ బెస్ట్ ఫ్రెండ్ కదా తనకు నచ్చితే మ్యాడీకి నచ్చుతుందని నాగవల్లి అంటుంది. అలా ఏం లేదు మీకు నచ్చితే మ్యాడీకి నచ్చుతుందని మధు అంటే అలా ఎలా అవుతుంది మాకు శ్రేయ ఇష్టం వాడికి శ్రేయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. ఒకప్పుడు వాడికి చిన్ని ఇష్టం మాకు ఇష్టం లేదు ఇప్పుడు వాడికి ఇష్టం లేదు అనుకో అని మధుని బాధ పెడుతుంది. మధు రింగులు నచ్చాయని అంటుంది. నీ నిశ్చితార్థానికి కూడా ఇలాంటి రింగులే చేయించుకోవాలి అనుకుంటున్నావ్ అన్నమాట.. నీ ఈ రింగులు నచ్చితే ఇంకెవరూ ఈ నిశ్చితార్థం ఆపలేరు అని నాగవల్లి అంటుంది.
నిశ్చితార్థం వేడుక దగ్గరకు ఓ వ్యక్తి బొకే తీసుకొని వస్తాడు. మ్యాడీని నేనే తీసుకొస్తా అని శ్రేయ అంటే నువ్వు ఎందుకు అని ప్రమీల అడిగితే ఈ రోజు నుంచి బావ మీద పూర్తి రైట్స్ నావే అని అంటుంది. దానికి నాగవల్లి కరెక్ట్‌గా చెప్పావు కోడలు పిల్లా వెళ్లి మీ బావని తీసుకురా అని అంటుంది. జీకే రావు పంపారు అని దేవాకి రాజేశ్ అనే వ్యక్తి బొకే ఇస్తాడు. నిశ్చితార్థం జంటకు ఇవ్వకుండా బావకి ఇవ్వడం ఏంటి అని నాగవల్లి అనుకుంటుంది.
శ్రేయ, మ్యాడీ జంటగా వస్తారు. ఇద్దరూ చేతులు పట్టుకొని రావడం చూసి అందరూ చాలా సంతోషపడతారు. మధు మాత్రం బాధ పడుతుంది. మధు వినేలా నాగవల్లి ఇద్దరినీ అలా చూస్తుంటే బాగా దిష్టి తగిలేలా ఉంది ముందు నువ్వే దిష్టి తీయాలి అని అంటుంది. అందరూ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు. మధుతో నువ్వు కంగ్రాట్స్ చెప్పవా అని నాగవల్లి అంటుంది.
దేవా బొకే తీసుకుంటాడు. బొకేలో ఓ లెటర్ ఉంటుంది. ఇదేంటి అని దేవా అనుకుంటాడు. చిన్ని రాసినట్లు ఆ లెటర్ ఉంటుంది. నీకు పెళ్లి కాకముందు నుంచి నీ పాపపు చరిత్ర తెలుసుకున్నా.. పెళ్లి అయిన తర్వాత నీ నేర చరిత్ర తెలుసుకున్నా.. నీ మొదటి భార్యని నువ్వు ఎంత దారుణంగా చంపావో కూడా తెలుసుకున్నా.. మా అమ్మని చంపింది.. మా నాన్నని బంధించింది నువ్వే అని తెలుసుకున్నా. ఇన్ని తెలుసుకున్న నేను నిన్ను వదిలేయడానికి కారణం నీ పాపం పండకపోవడం.. ఇప్పుడు నీ పాపం పండింది.. నేను ఇప్పుడు నీ ఇంట్లోనే తిరుగుతున్నా నువ్వు గుర్తించలేనంత దగ్గరగా వచ్చాను.. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు.. ఇట్లు నీ చిన్ని అని చిన్ని రాసినట్లు లెటర్ ఉంటుంది.
దేవా చాలా కంగారు పడి చెమటలు పట్టేస్తాడు. దేవాని నాగవల్లి కనిపెడుతుంది. చిన్ని ఇక్కడే ఈ ఫంక్షన్‌లోనే ఉందని దేవా మొత్తం వెతుకుతాడు. వీళ్లతో చిన్నిని ఎలా గుర్తు పట్టాలి అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తియిపోతుంది.





















