Podharillu Serial Today December25th: మహాను ప్రేమిస్తున్నానని చక్రి చెప్పడంతో మాధవ్ రియాక్షన్ ఏంటి..? పెళ్లి చెడగొట్టడానికి కేశవ్,చిన్నా ఏం చేస్తామన్నారు..?
Podharillu Serial Today Episode December 25th: మహాకు ఇష్టం లేని పెళ్లిచేస్తున్నారని...అందుకే ఆ పెళ్లి చెడగొట్టాలని చెప్పిన చక్రిపై మాధవ్ మండిపడతాడు.అలాగే మహాను ప్రేమిస్తున్నాడని తెలిసి కంగారుపడతాడు.

Podharillu Serial Today Episode: పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే కులదైవం గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించాలని ప్రతాప్ భావిస్తాడు. పనుల బిజీ వల్ల తాను రాలేకపోతున్నానని....మహాను తీసుకెళ్లి పూజలు చేయించాలని కోడలు నిహారికను పురమాయిస్తాడు. దీంతో మహా, నిహారిక ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరతారు..
చిన్న చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ తల్లిదండ్రులను తీసుకురమ్మని చెప్పడంతో...చిన్నా బయపడుతూనే వాళ్ల అన్నయ్య మాధవ్‌ను తీసుకుని వస్తాడు. ఏం జరిగిందో చెప్పరా అని ఎన్నిసార్లు అడిగినా ఏం లేదు పిన్సిపల్ నిన్ను ఒకసారి తీసుకుని రమ్మన్నారని చెబుతూ ఉంటాడు. తీరా ప్రిన్సిపల్ రూంకు వెళ్లి అడగ్గా....మీ తమ్ముడు క్రికెట్ ఆడుతూ గొడవపడి ఓ కుర్రాడిని బ్యాట్‌తో కొట్టాడని చెబుతాడు. ఈ మాటలకు మాధవ్ అదిరిపడతాడు. ఇలా రౌడీయిజం చేసే వాళ్లను పంపించేస్తామని..అందుకే మీవాడిని డీబార్ చేస్తున్నామని చెబుతాడు. దీంతో మాధవ్ ప్రిన్సిపల్‌ను బ్రతిమలాడుతాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇస్తాడు. మళ్లీ ఇలా జరిగితే సహించేది లేదని ప్రిన్సిపల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిచేస్తాడు.
గుడికి వెళ్లిన మహా,నిహారికను పూజారి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసిరమ్మని చెప్పగా...తనకు ఓపిక లేదని చెప్పి మహా వెళ్లి చక్రి పక్కన కూర్చుంటుంది. అతను ఆమె పెళ్లి చెడగొట్టేలా మహాకు లేనిపోనివి అన్నీ గుర్తుచేస్తూ రెచ్చగొడుతుంటాడు. మీరు పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిపోతే మీ ఆశలన్నీ చచ్చిపోతాయని అంటాడు. మా ఇంట్లో వాళ్లే నా గురించి పట్టించుకోవడంలేదని...నువ్వు మాత్రం ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావని నిలదీస్తుంది.ఎందుకో మిమ్మల్ని చూస్తే బాగా బాధపడుతున్నట్లు అనిపించి చెప్పానని అంటాడు. మీరు కెనడా వెళ్లిపోతే పంజరంలో చిలకలా బతకాలని చెబుతాడు.ఈలోగా నిహారిక పూజ చేయించడానికి మహాను పిలవడంతో లేచి వెళ్లిపోతుంది.
చక్రి వాళ్ల అన్నయ్య మాదవ్‌కు ఫోన్ చేసి మాట్లాడతాడు. తాను పనిచేస్తున్న ఇంట్లోఅమ్మయికి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని...పాపం ఆ అమ్మాయి రోజూ బాధపడుతోందని చెబుతాడు. మనం ఏదో ఒకటిచేసి ఆ పెళ్లి ఆపేయాలని చెబుతాడు. చక్రి మాటలకు మాధవ్ కంగారుపడతాడు. నీకు ఇలాంటి పనులు అవసరం లేదని హెచ్చరిస్తాడు. ఆడపిల్ల పెళ్లి ఆపితే పాపం చుట్టుకుంటుందని కోప్పడతాడు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందని కూడా చెబుతాడు. నువ్వు లేనిపోని గొడవల్లో ఇరుక్కోవద్దని హెచ్చరిస్తాడు. నువ్వు వెంటనే పని వదిలేసి వచ్చేయమని చెప్పడంతో...నువ్వు ఎప్పుడూ ఇంతే భయపడుతుంటావని నేను కేశవ్‌కు ఫోన్ చేసి హెల్ఫ్ చేయమని అడుగతానంటాడు. ఇంతలో కేశవ్ ఇంటికిరాగా...మాధవ్ నిలదీస్తాడు. పాపం వాడు ఏదో మంచి చేద్దామనుకుంటున్నాడు కాబట్టి అందరం కలిసి హెల్ఫ్ చేద్దామని కేశవ్ అనడంతో మాదవ్ వాడిపైనా మండిపడతాడు. పెళ్లి కుదిరిన అమ్మాయిని వాడు లవ్ చేయడం....దానికి మీరంతా సాయం చేస్తామని చెప్పడం ఏంటని మండిపడతాడు. మళ్లీ ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావన వస్తే సహించేది లేదని హెచ్చరిస్తాడు.
కెనడా వెళ్లేందుకు వీసాకు అప్లయి చేయడం కోసం భూషణ్ డాక్యుమెంట్లు తీసుకుని మహా వాళ్ల ఇంటికి వస్తాడు. వాటిపై సంతకాలు పెట్టమని ప్రతాప్ కోరడంతో మహా చేసేది లేక సంతకాలు పెడుతుంది.





















