Illu Illalu Pillalu Serial Today December 25th:ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్యని పెళ్లిని విశ్వ గుడిలో పెళ్లి చేసుకుంటాడా! రామరాజు ఇంట్లో పెద్ద గొడవ!
Illu Illalu Pillalu Serial Today Episode December 25th విశ్వ అమూల్యని పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్లడం అమూల్య అన్నలు, నర్మద, ప్రేమ అక్కడి వెళ్లి గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం విశ్వకి ఇచ్చిన ప్లాన్ వల్ల ప్రేమ, ధీరజ్‌ల మధ్య ఏం జరిగిందో వల్లీకి ఊహించి చెప్తుంది. గొడవ తర్వాత ప్రేమ ధీరజ్‌తో మాట్లాడాలని చూస్తే ధీరజ్ ప్రేమ మీద అరుస్తాడు. రెండు కుటుంబాలను కలపాలి అన్న నీ ఆలోచన నుంచే ఇది మొదలైంది అని అంటాడు.
ప్రేమ ధీరజ్‌తో ఏం మాట్లాడుతున్నావ్‌రా అంటే గత కొన్ని రోజులుగా నువ్వు మీ కుటుంబం మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నావు. రెండు కుటుంబాలు కలవాలి అన్నావు.. ఇప్పుడు మీ అన్నయ్య మా చెల్లిని ట్రాప్ చేయడం కూడా నీ ఆలోచనలోని భాగమే అని అంటాడు. ప్రేమ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావ్‌రా మతి ఉందా అని ప్రేమ అడిగితే నీ మనసులో మాటలే మాట్లాడుతున్నా.. రెండు కుటుంబాలను కలపాలి అనే మీ అన్నయ్య, చెల్లిని కలపాలి అనుకుంటున్నావ్.. మీ అన్నయ్య ఇందాక మా చెల్లితో మాట్లాడి వెంటనే నీతో మాట్లాడాడు. అంటే అర్థం కావడం లేదా నువ్వే తెర వెనక నడుపుతున్నావని అని అంటాడు.
ప్రేమ ధీరజ్‌తో బుద్ధి లేదురా నీకు మా అన్నయ్యా అమూల్యని ట్రాప్ చేయడం కాదు.. అమూల్యనే మా అన్నయ్యని ప్రేమిస్తుందని అంటుంది. మా అన్నయ్య అమూల్యని ప్రేమించడం లేదు.. అప్పటికీ మా అన్నయ్య కూడా చెప్తున్నాడు.. రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుందని.. దానికి అమూల్య చచ్చిపోతా అంటుందంట. మీ చెల్లి దగ్గర తప్పు పెట్టుకొని మా అన్నయ్యని అంటావా అని అడుగుతుంది. మా చెల్లి మీద తోసేస్తున్నావా.. మా చెల్లి అబ్బాయిల్ని చూడదు.. అందులోనూ మీ అన్నయ్య అంటే దానికి చిరాకు. అలాంటిది అది మీ అన్నయ్య వెంట పడుతుందా.. మీ అన్నయ్యని కాపాడటానికి బాగానే ప్రయత్నిస్తున్నావ్.. సూపర్ నువ్వు అని అంటాడు. మా చెల్లి వాడి వెంట పడిందా.. తేల్చుతా అమూల్యతో మాట్లాడిన తర్వాత తేల్చుతా నీ సంగతి మీ అన్నయ్య సంగతి అని ధీరజ్ ఇంటికి వెళ్తాడు.
వల్లీ తనకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మానాన్నలతో కలిసి డ్యాన్స్‌లు చేస్తుంది. శత్రువుల కళ్లలో నీళ్లు వస్తే భలే సంతోషంగా ఉంటుందని పొంగిపోతుంది. మొగుడు పెళ్లాల మధ్య ఫుల్లుగా గొడవ అయింది కదా రేపటి నుంచి ఆ పొట్టి ప్రేమ ఏడిస్తే ఫుల్ పండగే అని అంటుంది. నా అసలు సిసలైన శత్రువు నర్మద తను అమూల్య వాళ్లని చూసింది కదా ఏమైందో చెప్పు అని అడుగుతుంది. భాగ్యం మళ్లీ చెప్పడం మొదలు పెడుతుంది.
నర్మద ఆటోలో విశ్వ, అమూల్యల్ని ఫాలో అవుతుంది. ఇద్దరూ కలిసి ఓ గుడికి వస్తారు. నర్మద కూడా వస్తుంది. గుడికి ఎందుకు తీసుకొచ్చావ్ విశ్వ అని అమూల్య అడిగితే మనం పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. ఇప్పుడు ఎందుకు అని అమూల్య అంటే మీ పెద్దన్నయ్యకి మన విషయం తెలిసిపోయింది ఆయన మీ నాన్నకి చెప్తే మనల్ని విడదీస్తారు అందుకే పెళ్లి చేసుకుందామని అంటాడు. ఎవరికీ తెలీకుండా పెళ్లి ఏంటి అని అమూల్య ఒప్పుకోదు. మీ వాళ్లు నన్ను చంపేస్తారు అని విశ్వ అమూల్యని బలవంతం చేస్తాడు. పెళ్లి వద్దు అంటే ఇప్పుడు నేను చచ్చిపోతా అని అంటాడు.
విశ్వ అమూల్య చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటే నర్మద వచ్చి రేయ్ అని అంటుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. నర్మద విశ్వని లాగి పెట్టి కొడుతుంది. అమూల్యని ట్రాప్ చేస్తావా అని కొడుతుంది. ఇంతలో ప్రేమ వచ్చి ఎందుకు మా అన్నయ్యని కొడతావు అని అంటుంది. వీడు అమూల్యని ట్రాప్ చేశాడని అంటుంది. ప్రేమ నర్మదతో ఇంకోసారి మా అన్నయ్యని కొడితే బాగోదు అక్క అని అంటుంది. నర్మద షాక్ అయిపోతుంది. ఏం అన్నావ్ ప్రేమ అంటే నువ్వు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే చేయి చేసుకోకుండా మాట్లాడు మా అన్నయ్య మీద ఇంకొక్క దెబ్బ పడితే అస్సలు బాగోదు అని అంటుంది.
మీ అన్నయ్య ఏదో పెద్ద ప్లాన్‌తో అమూల్యని ట్రాప్ చేశాడు.. తనని పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకొచ్చాడు.. మన ఇంటి ఆడపడుచుని మోసం చేస్తున్నావాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావా ఏంటి ప్రేమ ఇది అని అడుగుతుంది. ఇంతలో ధీరజ్, సాగర్ గుడికి వస్తారు. ఇద్దరూ ఆవేశంగా విశ్వ మీదకు వస్తారు. ఇంతలో చందు వచ్చి ఇద్దరు తమ్ముళ్లని ఆపుతాడు. మన చెల్లిని వాడు ట్రాప్ చేశాడని తెలీకుండా ఆపుతారేంట్రా అని చందుని అడిగితే ఈ విషయం నాకు ముందే తెలుసురా అని చందు అంటాడు. అందరూ షాక్ అయిపోతారు.
ధీరజ్ చందు కాలర్ పట్టుకొని నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదురా అని నిలదీస్తాడు. సాగర్ కూడా అన్నని నిలదీస్తాడు. మీకు చెప్తే చెల్లి చచ్చిపోతుందిరా అని అంటాడు. వాడు తాళి కట్టినా జరిగేది అదే కదరా అని ముగ్గురు అన్నదమ్ములు కొట్టుకుంటారు. నా ప్లాన్ వర్కౌట్ అయింది అని విశ్వ హ్యాపీగా ఫీలవుతాడు. ఇంట్లో పంచాయితీ మొదలవుతుంది.
రామరాజు ఏం మాట్లాడకుండా కన్నీరు పెట్టుకొని కూర్చొంటాడు. వేదవతి కూతురిని కొట్టి నీకు చదువుకోమని అంటే ప్రేమలు కావాలా.. ఆ రోజు నేను బండి మీద చూశాను అంటే సేమ్ డ్రస్ ఉంటుందని నన్ను వెర్నిబాగులదాన్ని చేశావని ఏడుస్తుంది. కన్నవాళ్లని ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదే అని ఏడుస్తుంది. రామరాజు ఏడుస్తూ ఏదైనా పాపం చేస్తే గుండెల మీద తన్నే పిల్లలు పుడతారు అంటారు. నేనేం పాపం చేశాను అమ్మా మీరు పుట్టారు.. ఏం లోపం చేశానమ్మా.. నేను మిమల్ని సరిగా చూసుకోవడం లేదా అని ఏడుస్తాడు. ఈ నాన్నని మోసం చేయడానికి నీకు కూడా మనసు ఎలా వచ్చిందమ్మా.. వాడిని నువ్వు ప్రేమించే ముందు ఈ నాన్న నీకు ఒక్క సారి కూడా గుర్తు రాలేదా అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















