Chinni Serial Today October 9th: చిన్ని సీరియల్: మధు ఇంట్లో లోహిత, వరుణ్, మ్యాడీ! మ్యాడీకి చిన్ని ఎవరో తెలిసిపోతుందా!
Chinni Serial Today Episode October 9th వరుణ్, లోహితల్ని మధు తన ఇంటికి తీసుకెళ్లడం మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోతుందేమో అని లోహిత టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీ లోహిత, వరుణ్‌లను తీసుకురావడానికి వెళ్తారు. మధు మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు తీసుకొచ్చి మ్యాడీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. నాగవల్లికి తన బంధువుల్లోని ఓ అత్తయ్య కాల్ చేస్తుంది. వెటకారంగా మాట్లాడుతుంది. చిన్న విషయం అయితే చాలు రాబంధుల్లా పొడుచుకు తింటారని అనుకుంటుంది. వరస ఫోన్లు వస్తూనే ఉంటాయి..
నాగవల్లి చాలా ఇరిటేట్ అవుతుంది. కోపంగో ఫోన్ విసిరి కొడుతుంది. దేవా వచ్చి ఏమైందని అడిగితే ఏం లేదు అంటుంది. వరుణ్, మ్యాడీల గురించి ఆలోచించకు అని దేవా అంటే ఎలా వదిలేయాలి బావ ఇద్దరినీ కన్న కొడుకుల్లా చూసుకున్నాం అని అంటుంది. ఇంతలో పీఏ వచ్చి మధు, మ్యాడీ కలిసి స్కూటీ మీద వెళ్తున్న ఫొటో చూపిస్తాడు. నాగవల్లి చూపి కోపంగా అంతా దీనివల్లే అని అంటుంది. ఏంటి అని దేవా అడిగితే మధు ఫొటో చూపించి వరుణ్ పెళ్లి చేసిన ఆ మధు మ్యాడీతో తిరుగుతుంది. దీనికి అంత ధైర్యం ఎలా వచ్చింది అని అనుకుంటుంది. దేవా ఫొటో చూసి మ్యాడీతో అంత క్లోజ్‌గా ఉంది ఏంటిఅని అడిగితే మ్యాడీ దాన్ని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాడని నాగవల్లి చెప్తుంది. అయితే మ్యాడీ, వరుణ్ వాళ్లు దీని ఇంట్లోనే ఉండుంటారని అంటాడు. అయ్యుంటుంది అని నాగవల్లి అంటుంది. ఎంక్వైరీ చేసి చెప్తానని పీఏ అంటాడు.
దేవా నాగవల్లితో వాళ్లు కరెక్ట్‌గానే ప్లాన్ చేశారు.. మనమే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం. మనం ఎక్కువ దేని మీద ప్రేమ పెంచుకుంటే మనల్ని ఇబ్బంది పెడతారు అని అంటుంది. వసంత వచ్చి సారీ చెప్తుంది. పిల్లల్ని తీసుకురా అని ప్రమీల అంటే ఏం చేయాలో నాకు తెలుసు అని దేవా మనసులో అనుకుంటాడు. లోహిత వరుణ్‌తో ఇలా ఎంత సేపు బయట ఉంటాం ఏదో ఒకటి చేయ్ అంటే మ్యాడీ బావ వస్తాడు అని వరుణ్ అంటాడు. ఇంతలో మ్యాడీ, మధు వస్తారు. మధుని చూసి లోహిత మనసులో ఇది ఎప్పుడూ మ్యాడీని అంటుకొనే ఉంటుందా అని అనుకుంటుంది.
మధు వరుణ్ వాళ్లతో మీరు ముగ్గురు మా ఇంట్లోనే ఉండాలి అని అంటుంది. మ్యాడీ కూడా అదే సేఫ్ ప్లేస్ అంటాడు. వరుణ్ ఓకే అంటాడు. లోహిత మనసులో మ్యాడీ కూడా అక్కడే ఉంటే మధునే చిన్ని తెలిసిపోతే అని అనుకుంటుంది. మధుతో మ్యాడీ స్కూటీలో వస్తే మధునే చిన్ని అని తెలిసిపోతుందని లోహిత మధుతో వెళ్తా అంటుంది. మ్యాడీ వద్దని ఆటో ఎక్కిస్తాడు. మధు లోహిత వాళ్లని ఇంటికి తీసుకెళ్తుంది. స్వరూప వరుణ్, లోహితలు హారతి ఇచ్చి లోపలికి పిలుస్తుంది. లోహిత మనసులో నేను అనుకున్నది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అనుకుంటుంది. స్వరూప లోహితతో జీవితంలో చాలా జరుగుతాయి ఏది ఏమైనా నువ్వు భర్త అడుగు జాడల్లో నడిస్తే సంసారం బాగుంటుందని అంటుంది. సుబ్బు వాళ్లతో ఇది మీ ఇళ్లు అనుకోండి.. మీకు మీ ఇంట్లోలా సౌకర్యాలు లేకపోయినా ప్రేమ ఉంటుందని అంటారు. వరుణ్ ఆయనతో మిమల్ని చూస్తుంటే మా మామయ్య, అత్తయ్య గుర్తస్తున్నారు అని ఆశీర్వాదం తీసుకుందామని అంటే లోహిత రాదు.. వరుణ్, మ్యాడీ చెప్పడంతో అయిష్టంగా దీవెన తీసుకుంటుంది.
మధు వరుణ్, లోహితలకు గది చూపిస్తుంది. వరుణ్‌తో నాకు తెలుసు మా ఇళ్లు చాలా చిన్నది మీకు ఇబ్బంది అని తెలుసు కానీ కొంచెం అడ్జెస్ట్ అవ్వండి అంటుంది. ఇక మ్యాడీ మధు ఒకర్ని ఒకరు గుద్దుకుంటారు. కొమ్ములు వస్తాయి అని మధు భయపెడుతుంది. దాంతో మ్యాడీ ఏదో ఒకటి చేయ్ మధు అంటే ఇంకో రెండు సార్లు ఢీకొట్టుకోవాలని మధు చెప్పి ఢీ కొడుతుంది. లోహిత చూసి ఏదో ఒకటి చేయకపోతే కష్టం మధు మ్యాడీని గద్దలా తన్నుకుపోతుందని అనుకుంటుంది. ఇక మధు మ్యాడీకి గది చూపిస్తుంది. అదే గదిలో మధు చిన్ననాటి ఫొటోలు కూడా ఉంటాయి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















