Nuvvunte Naa Jathaga Serial Today October 9th: నువ్వుంటే నా జతగా: దేవా వర్సెస్ దేవుడమ్మ: మిథున, దేవాలకు 2 రోజుల ఏకాంతం!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 9th దేవాని ఎమ్మెల్యే దేవుడమ్మ పిలిచి తనకు ఎలక్షన్‌లో సాయం చేయమని రెండు కోట్లు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode కాంతం పుట్టింటి నుంచి సత్యమూర్తి ఫ్యామిలీకి పిలుపు వస్తుంది. కాంతం దేవా రావాలి కాని మిథున రాకూడదు అని అంటుంది. అలా అంటావేంటి అని శారద అంటే వాళ్లది పద్ధతిగా మాలా జరిగిన పెళ్లా ఏంటి.. గుడిలో పెళ్లి అయినా రిసెప్షన్ కూడా కాలేదు.. పద్ధతిగా మా వాళ్లని పిలిచి పట్టు బట్ట కాదు కదా కనీసం కాటన్ ముక్క కూడా ఇవ్వలేదు అని అంటుంది.
మిథున నేను రాను ఇంట్లోనే ఉంటాను అంటుంది. శారద వాళ్లు దేవాని తోడుగా ఉండమని చెప్తారు. దేవా వాళ్లతో అసలు నేను ఇంటికి రాను అనేస్తాడు. శారద వాళ్లు బయల్దేరిపోతారు. మిథున మనసులో ఎలా రావో నేను చూస్తా అని అనుకుంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పురుషోత్తానికి అపొజిషన్ దేవుడమ్మ. దేవుడమ్మ రెండో సారి కూడా తానే ఎమ్మెల్యే అవ్వాలని తనకు పురుషోత్తం అడ్డు రాకూడదు అని ప్లాన్ చేస్తుంది. అందుకు దేవాని ఇంటికి పిలిపిస్తుంది. దేవా దేవుడమ్మతో మేడం ఎందుకు అర్జెంటుగా పిలిపించారని అడుగుతాడు. పురుషోత్తం దగ్గర పదేళ్లగా పని చేస్తున్నావ్ కదా ఎంత సంపాదించావ్ అని అడుగుతుంది. నేను డబ్బు కోసం పని చేయడం లేదు అని దేవా అంటాడు.
దేవుడమ్మ దేవాకి రెండు కోట్లు ఇస్తుంది. పురుషోత్తానికి నువ్వు రైట్ హ్యాండ్ అని తెలిసింది..నువ్వు అతని బస్తీ ఓట్లు వేయించి అతన్ని గెలిపించే దమ్ము ఉన్నవాడివని తెలిసింది.. మళ్లీ నేనే ఎమ్మెల్యే అవ్వాలి.. ఈ నియోజక వర్గం నా కంచుకోట అవ్వాలి అందుకు నీ సాయం కావాలి.. అని చెప్తుంది. నువ్వు వాడి దగ్గర నుంచి బయటకు రావాలి.. నాకు అనుకూలంగా పని చేయాలి అంటుంది. దేవా నో చెప్పేస్తాడు. దేవుడమ్మ అరుస్తూ నువ్వు దేవుడమ్మకి నో చెప్తున్నావ్ నాకు నో చెప్తే ఏం అవుతుందో తెలుసా అంటే దేవా ప్రాణం పోతుంది అంతకంటే ఏం చేయలేరు. నేను పురుషోత్తం అన్నకి రైట్ హ్యాండ్ కాదు అతని ప్రాణాన్ని.. నాకు డబ్బు కావాలి అంటే ఇంతకి పదింతలు సంపాదించగలను.. సారీ మేడం అని చెప్పి వెళ్లిపోతాడు. వీడి నిజాయితీని ఎలా కొనాలో నాకు తెలుసు అని దేవుడమ్మ అనుకుంటుంది.
దేవా ఇంటికి వస్తాడు. శారద మిథునతో నువ్వు వచ్చుంటే బాగుండేది అని అంటుంది. నన్ను ఆయన చూసుకుంటారు మీరు హ్యాపీగా వెళ్లండి అని అంటుంది. శారద మిథునని చూసుకోమని దేవాతో చెప్తుంది. సాయంత్రమే ఇంట్లో ఉండు తనని వదిలేయకు కావాలి అంటే రెండు రోజులు ఎక్కడికీ వెళ్లకు అని అంటుంది. నాకు చాలా పనులు ఉన్నాయి నేను ఇంటికి రాను అని అంటాడు. అంత కొంపలు అంటుకునే ముఖ్యమైన పనులు ఏంట్రా అని శారద అంటే మిథున నవ్వుతుంది. ఏమైంది అని దేవా అంటే నీ భయం చూసి నవ్వొస్తుంది.. నన్ను చూసి ఇంటికి రావడానికి భయపడుతున్నావ్ కదా అందుకే కదా గ్యారేజ్‌లో దాక్కుంటాను అంటున్నావ్ అని రెచ్చగొడుతుంది. నేను నీకు భయపడటం లేదు అని చెప్పడానికి అయినా వస్తా అవసరం అయితే ఇంటికి వెళ్లను అని దేవాతో చెప్పిస్తుంది. శారద నవ్వుతూ ఇదే చాకచక్యంతో దేవాని నీ వైపు తిప్పుకో అని అంటుంది.
మిథునకు ఫోన్‌లో మాట్లాడుతూ వెంటనే బయల్దేరుతున్నా అమ్మా అని అంటుంది. కాంతం మిథునని ఏడిపించాలని మిథున దగ్గరకు వెళ్లి నువ్వేం పని చేయవు.. అత్తారింట్లో కూడా చిన్నపాటి దొరసానిలా బతికావ్ కానీ ఇప్పుడు మేం వెళ్లిపోతే అన్ని పనులు నువ్వే చేసుకోవాలని అంటుంది. నువ్వు గ్రేట్ అక్క నువ్వు చాలా మంచిదానివి నేను పనులు చేయడం పక్కన పెట్టు కానీ నువ్వు ఇంటిళ్లపాదిని ఊరు తీసుకెళ్తున్నావ్ కదా.. రెండు రోజులు నేను నా భర్త ఏకాంతంగా గడుపుతాం.. దేవాని నా వైపు తిప్పుకుంటా.. థ్యాంక్స్ అక్కాయ్ అని కాంతాన్ని రెచ్చగొట్టేస్తుంది. ఊరెళ్తున్నా ప్రశాంత లేకుండా చేశావ్ అని కాంతం అనుకుంటుంది.
మిథున అత్త దగ్గరకు వెళ్లి అమ్మ గుడికి రమ్మని చెప్పింది అని అంటుంది. దేవాని పిలిచి మిథునని గుడికి తీసుకెళ్లమని అంటుంది. దేవా కుదరదు అని అంటే సరే అయితే మేం వెళ్లంలే.. ఒంటరిగా ఆటోలో వెళ్లిన కోడలు ఇంటికి వచ్చే వరకు కంగారు ఉంటుంది కదా.. తను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా.. అప్పుడు మీ నాన్న నిన్ను ఏం అంటారో చూసుకో అని అంటుంది. నువ్వు కూడా తనలాగే బ్లాక్ మెయిల్ చేస్తావ్ ఏంటమ్మా అని మిథునని తీసుకెళ్తానని అంటాడు. మిథున దేవాతో నీ మనసులో నా మీద ప్రేమ నిండిపోయింది అందుకే నీ ముఖం మతాబుల్లా వెలిగిపోతుందని అంటుంది. ఇక దేవా పురుషోత్తానికి ఎమ్మెల్యే దేవుడమ్మ గురించి చెప్పాలి అనుకుంటాడు. ఫోన్ చేస్తాడు కానీ వాయిస్ సరిగా వినపడదు.. ఎమ్మెల్యే దేవుడమ్మ పిలిచిందని తనకి సపోర్ట్‌గా నన్ను సాయం చేయమని అందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















