Nindu Noorella Saavasam Serial Today October 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్‌ను కిడ్నాప్ చేసిన రణవీర్ - అమర్ లోకి వెళ్లిన ఆరు ఆత్మ
Nindu Noorella Saavasam serial Today Episode October 9th: రణవీర్ ప్లాన్ ప్రకారం అమర్‌ను కిడ్నాప్ చేస్తాడు. అయితే ఆరు ఆత్మ అమర్‌లోకి వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: బయటకు వెళ్తున్నానని చెప్పి అమర్ వెళ్లబోతుంటే సోపా కాలుకు తగిలి కింద పడబోతాడు. ఇంతలో వెనక నుంచి ఆరు పట్టుకుంటుంది. అమర్ అలాగే కింద పడకుండా ఉండిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మనోహరి మాత్రం భయంతో వణికిపోతుంది.
మను: కింద పడబోయిన అమరేంద్ర గాలిలోనే ఉన్నాడేంటి..? ఆరు పట్టుకుందా..? ఇప్పుడు ఆరు గురించి అందరికీ తెలిసిపోతుందా..?
అమర్ తిరిగి చూడగానే.. అక్కడ భాగీ అమర్ చేయి పట్టుకుని కనిపిస్తుంది.
భాగీ: కాస్త చూసి వెళ్లండి
మనోహరి రలీఫ్ అవుతుంది. అమర్ వెళ్లబోతుంటే..
ఆరు: ఆయనను ఆపు భాగీ కాసేపు కూర్చుని వెళ్లమను
భాగీ: ఆగండి ఒక్క నిమిషం కూర్చుని వెళ్లమని చెప్తున్నారు
అమర్: చెప్తున్నారా..? ఎవరు చెప్తున్నారు..?
రామ్మూర్తి: అంటే నేనే చెప్పమని చెప్పాను అల్లుడు గారు
ఆరు: బయటకు వెళ్లేటప్పుడు ఇలా జరగడం అరిష్టం. కాసేపు కూర్చుని మంచినీళ్లు తాగి వెళ్లమని చెప్పు
భాగీ: కాసేపు ఆగి వాటర్ తాగి వెళ్లమని చెప్తున్నారండి
అమర్: అబ్బా.. ఎవరు చెప్తున్నారు భాగీ
రామ్మూర్తి: నేనే.. నేనే బాబు నేనే చెప్తున్నాను..
అమర్: అయితే మీరే నాకు డైరెక్టుగా చెప్పొచ్చు కదా
రాథోడ్: మిస్సమ్మతో చెప్పిస్తే బాగుంటుందని సార్ అభిప్రాయం
భాగీ: ఆ అవునండి
అమర్: నేను ఎందుకు ఆగాలి
భాగీ: బయటకు వెళ్లేటప్పుడు ఇలా జరగడం అరిష్టం అంట అండి
అమర్: నాకు అలాంటి పట్టింపులు లేవు పద రాథోడ్
ఆరు: భాగీ ఆయన వెళ్లిపోతున్నారు… ఆయన్ని ఆపు
భాగీ: ఆయన ఆగరు అక్కా ఎప్పుడూ ఇంతే
రామ్మూర్తి: అక్కను కంగారు పడొద్దని చెప్పు అమ్మ.. అల్లుడు గారు మిలటరీ ఆఫీసరు ఆయన్ని ఎవరు ఏం చేస్తారు చెప్పు
భాగీ: అవును అక్కా నువ్వు ధైర్యంగా ఉండు ఆయన క్షేమంగా వెళ్లి లాభంగా వస్తారు.
రామ్మూర్తి: అమ్మా భాగీ ఒకసారి మీరంతా కలిసి మన ఇంటికి రావాలమ్మా భోజనం చేసి వెళ్దురు కానీ
భాగీ: అలాగే నాన్న
మను: వీళ్లను చూస్తుంటే.. నాకు పిచ్చి ఎక్కిపోతుంది. ఏ క్షణంలో అమరేంద్రకు నిజం తెలిసిపోతుందోనని నాకు టెన్షన్ గా ఉంది.
అని భయపడుతూ రూంలోకి వెళ్లి రణవీర్‌కు కాల్ చేస్తుంది.
రణవీర్: చెప్పు మనోహరి
మను: ఏంటి చెప్పేది ఇక్కడ జరిగేది చూస్తుంటే.. టెన్షన్‌తో నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి.
రణవీర్: ఏం జరుగుతుంది
మను: భాగీ తనకు కనిపిస్తున్న అరుంధతి ఆత్మను అందిరికీ తెలిసేలా ప్రవర్తిస్తుంది. ఆత్మ విషయం అందరికీ తెలిసిపోయేలా ఉంది. అమర్‌కు కూడా ఎక్కడ తెలిసిపోతుందో అని భయంతో చచ్చిపోతున్నాను..
రణవీర్: కంగారు పడకు మనోహరి అమరేంద్రకు తెలిసేలోగా అమరుడు అయిపోతాడు.
మను: ఏంటి..? ఏమన్నావు రణవీర్
రణవీర్: ఏం లేదులే మనోహరి త్వరగా మన ప్లాన్ ను అమలు చేద్దాం అంటున్నాను..
మను: భాగీకి స్పాట్ పెడదాం అని అనుకున్నాం కదా ఆ చంభా ఏం చేస్తుంది. వెంటనే మన ప్లాన్ ను అమలు చేయమని చెప్పు
రణవీర్: ఏదో ఒక ప్లాన్ అమలు చేద్దాం లే మనోహరి నువ్వేం టెన్షన్ పడకు
మను: ఏదో ప్లాన్ ఏంటి.. మళ్లీ ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా..? ఏం చేయబోతున్నారు
రణవీర్: (మనసులో) అది ముందే చెప్తే నువ్వు అడ్డు పడతావు.. అమరేంద్రను లేపేసి చెప్తాను.
మను: రణవీర్ చెప్పు ఏం చేయబోతున్నారు.. నెక్ట్స్ టార్గెట్ భాగీనే అని కదా అనుకున్నాం.. దాన్నే కదా లేపేయబోతున్నాం.
రణవీర్: ముందు అనుకున్న ప్లానే అమలు చేయబోతున్నాం. నువ్వేం వర్రీ అవ్వకు
మను: త్వరగా ఏదో ఒకటి చేసేయ్ రణవీర్. అమర్‌కు నిజం తెలిసే లోపు అంతా జరిగిపోవాలి.
రణవీర్: అలాగే త్వరలో అంతా ముగిసిపోతుంది
అంటూ రణవీర్ చెప్పగానే.. మనోహరి సరే అంటూ ఫోన్ కట్ చేస్తుంది. అయితే అమర్ చంపాలనుకున్న చంభా, రణవీర్ ఇద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం అమర్‌ను కిడ్నాప్ చేస్తారు. ఒక దగ్గర కట్టేసి చంపేయాలని చూస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆరు ఆత్మ అమర్‌లోకి ప్రవేశించి కట్లు విప్పేసుకుని అందరిని కొడుతుంది. అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది. అది చూసిన మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















