Chinni Serial Today October 17th: చిన్ని సీరియల్: మ్యాడీ ఇంటికి వెళ్తాడా? దేవా వార్నింగ్.. మధు, మహిల దీపావళి వేడుకలో ట్విస్ట్!
Chinni Serial Today Episode October 17th మ్యాడీని నాగవల్లి వాళ్లు ఇంటికి రమ్మని చెప్పడం మ్యాడీ రానని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ రెస్టారెంట్‌లో పని చేయడం నాగవల్లి చూస్తుంది. హోం మినిస్టర్ కొడుకు అలా ఓ హెటల్‌లో పని చేయడం చూసి నాగవల్లి తట్టుకోలేకోతుంది. మ్యాడీ దగ్గరకు వెళ్లి చూసి ఏంటి నాన్న ఇది నీ స్టేటస్ ఏంటో తెలుసా.. ఈ సిటిలోనే రిచెస్ట్ రెస్టారెంట్‌ని నీ కాలి దగ్గర పెడతారు.. అలాంటిది నువ్వు ఇక్కడ కష్టపడటం ఏంటి నాన్న అని అంటుంది.
నాగవల్లి మ్యాడీని అలా చూసి చాలా ఏడుస్తుంది. అక్కడే ఉన్న మధుని చూసి ఈ రాక్షసి కూడా ఇక్కడే ఉందా అని అంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని బయట వాడిని చేసేశావ్ కదే ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అని అంటుంది. మీ ఫ్యామిలీ విడిపోవాలని నేను ఏం అనుకోవడం లేదండీ అని అంటుంది. నువ్వు మాట్లాడకు నేను నా కొడుకుతో మాట్లాడటానికి వచ్చా అని అంటుంది నాగవల్లి. మనకి ఇవన్నీ వద్దురా ఇంటికి వచ్చేయ్ నాన్న అని నాగవల్లి మ్యాడీని పిలిస్తే మీరు వరుణ్ బావ పెళ్లిని అంగీకరిస్తేనే నేను వస్తా అంటాడు. అది జరగదు అని నాగవల్లి అంటే అయితే నేను రాను మమ్మీ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్లని వదలను అని అంటాడు. అయితే ఇదే మాట మీ డాడీకి చెప్పు అని నాగవల్లి దేవా ఉన్న కారు చూపిస్తుంది. 
డ్యాడీ వచ్చారా.. డ్యాడీ అని మ్యాడీ పరుగెడతాడు. మధు నాగవల్లికి దండం పెడుతూ మ్యాడీ, వరుణ్ వాళ్లని ఇంటికి రానివ్వమని అంటుంది. నా ఫ్యామిలీని ముక్కలు చేసిన నిన్ను వదలను అని నాగవల్లి వార్నింగ్ ఇస్తుంది. దేవాతో మ్యాడీ డాడీ బాగున్నావా అని అడుగుతాడు. నువ్వు చేసిన పనికి ఎలా బాగుంటానురా అని దేవా అంటాడు. ఇక మ్యాడీని చూసి నీ అవతారం ఏంట్రా హోంమినిస్టర్ కొడుకువి ఇలా కూలి వాడిలా ఏంట్రా అని అడుగుతాడు. డాడీ రోజుకి 500 సంపాదిస్తున్నా బావ వాళ్లని జాగ్రత్తగా చూసుకుంటున్నా అంటాడు. కేరాఫ్ మినిస్టర్ నుంచి కేరాఫ్ ఫ్లాట్ ఫాం మీదకు వచ్చేశావ్ నోరుమూసుకొని అన్నీవదిలేసి ఇంటికి రా అంటాడు. వరుణ్ బావ వాళ్లని వదిలేసి రాను అని మ్యాడీ అంటే నాగవల్లి వెళ్దాం పద అని దేవా అంటాడు.
నాగవల్లి చాలా బతిమాలుతుంది కానీ మ్యాడీ రాను అనేస్తాడు. వీడు మన పరువుతో పాటు ప్రాణాలు కూడా తీసేస్తాడు. చివరి సారి అడుగుతున్నా మ్యాడీ ఇంటికి రా లేదంటే కొడుకు అని కూడా చూడను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అంటాడు. దాంతో మ్యాడీ సారీ డాడీ అంటాడు. నాగవల్లి ఎంత బతిమాలినా మ్యాడీ ఒప్పుకోడు. దాంతో దేవా నాగవల్లి రా అని అరుస్తాడు. దేవా వాళ్లు వెళ్లిపోతారు.
మ్యాడీ చాలా బాధ పడతాడు. వాళ్లు నా మీద ఎంత ప్రేమిస్తున్నా నేను వాళ్ల ప్రేమ నేను పొందలేకపోతున్నా అని ఏడుస్తాడు. మొత్తం తప్పు నాదే మ్యాడీ నేనే వరుణ్ వాళ్ల వైపు ఆలోచించా కానీ మీ తల్లిదండ్రుల వైపు ఆలోచించలేదు ఏడుస్తుంది. 
మధు ఇంటికి వెళ్తూ మధ్యలో దేవాని చూస్తుంది. దేవా అంకుల్ అని కారు వెనక పరుగులు తీస్తుంది. రౌడీలు బాలరాజుని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఇంతలో బాలరాజు చిన్ని చిన్ని అనడంతో బాలరాజు తల మీద రౌడీలు కొడతాడు. వెంటనే దేవాకి విషయం చెప్తాడు. వాడు ఎక్కడో చిన్నిని చూసినట్లు ఉన్నాడురా చిన్ని కోసం వెతకండి అని దేవా చెప్తాడు. రౌడీలు చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు.. మధు కూడా అక్కడే ఉంటుంది. 
రాత్రి మధు వాళ్లు దీపావళి పూజ చేయాలని రెడీ అవుతారు. మధు చక్కగా లంగావోణి కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీ అవుతుంది. తల్లి కావేరి ఫొటో చూసి అది పట్టుకొని ఏడుస్తుంది. ఫొటో పట్టుకొని హగ్ చేసుకొని తల్లిని గుర్తు చేసుకుంటుంది. తర్వాత మహి ఇచ్చిన పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని మహిని గుర్తు చేసుకుంటుంది. మహి ఈ రోజు మీ నాన్నని చూశా కలవాలి అనుకున్నా.. మీ నాన్న ఇక్కడే ఉన్నారు అంటే నువ్వు ఇక్కడే ఉంటావ్ ఎలా అయినా నిన్ను పట్టుకుంటా అంటుంది. 
లోహిత, మధు వరుణ్, మహి అందరూ తులసి కోట దగ్గరకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు. వరుణ్ లోహితకు సాయం చేస్తే మధుకి మహి సాయం చేస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. సుబ్బు లోహిత, మధులతో అక్కాచెళ్లెల్లా మీరు ఇద్దరూ చాలా బాగున్నారు పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి అంటాడు. దానికి లోహిత మనసులో చెల్లి కాదు ఇది నా మేనత్త కూతురు పోలికలు ఎక్కడికి పోతాయి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















