Nuvvunte Naa Jathaga Serial Today October 17th: నువ్వుంటే నా జతగా: దేవా ఆడపిల్ల గెటప్.. మిథున చేసిన పనికి నవ్వులు, ఆస్తి కోసం కొత్త ట్విస్ట్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 17th దేవాని మిథున ఆడపిల్లలా రెడీ చేయి అందరి ముందుకి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున ఇంటి ముందు ముగ్గు చూసి సత్యమూర్తి, శారదలు మురిసిపోతారు. మిథున తమ కాపురం బాగుండాలని అత్తామామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నోట్లో బ్రెష్ పెట్టుకొని కాంతం కూడా ఆశీర్వాదం అడిగితే పాచి ముఖంతో ఆశీర్వాదం ఏంటి అని శారద చివాట్లు పెడుతుంది. 
సత్యమూర్తి సంతోషంగా ముగ్గురు కోడళ్లు రావడంతో ఇళ్లు కలకల్లాడిపోతుందని అంటాడు. మీకు ఓ కూతురు ఉండుంటే బాగుండేదని మిథున అంటుంది. దానికి శారద దేవా కడుపులో ఉన్నప్పుడు కచ్చితంగా అమ్మాయి పడుతుందని అనుకున్నాం కానీ దేవా పుట్టాడని బహుశా నీ లాంటి మంచి కోడలి కోసమే మాకు దేవుడు కొడుకుని ఇచ్చినట్లు ఉన్నాడు అని శారద అంటుంది. 
ఆనంద్ ప్రమోదినితో పది లక్షలు పోవడం గురించి చెప్పడంతో ప్రమోదిని షాక్ అయిపోతుంది. ఆ పదిలక్షలు ఎలా పోయావో తెలీదు నాదే బాధ్యత కాబట్టి భయంతో నా ప్రాణం పోయుండేది.. నా జీవితం మొత్తం సంపాదించినా అంత పోగు చేయలేను కానీ మా బాస్ చాలా మంచోడు ఏం అనకుండా వదిలేశాడు అని అంటాడు. పది లక్షలు పోతే ఎలా వదిలేశారు.. మీరు దొంగిలించలేదు కానీ పోయావి.. సత్యమూర్తి గారి కొడుకు అనే నమ్మకంతో మిమల్ని జాయిన్ చేసుకున్నారు ఓకే కానీ పదిలక్షలు పోతే పోలీస్ స్టేషన్‌లో చెప్పకుండా వదిలేయడం ఏంటి.. నాకు ఎందుకో భయంగా ఏదో తేడాగా ఉందని అనిపిస్తుందని అంటుంది. ఇప్పుడేం కాలేదు కదా వదిలేయ్ అని ఆనంద్ అంటాడు.
దేవా పడుకొని ఉంటే మిథున దేవాని చూసి కూతురిగా పుట్టాలి అనుకున్న అత్త మాటలు గుర్తు చేసుకొని ఈ రౌడీ బాయ్ ఆడపిల్ల అయితే బాగున్నా ఆడపిల్లాలా చేసేద్దాం అని దేవాకి పిలకలు వేసి బొట్టు పెట్టి.. ఆడపిల్లలా రెడీ చేస్తుంది. దేవాని చూసి ఆడపిల్లలా అందంగా ఉన్నాడు అని అనుకుంటుంది. 
దేవా నిద్ర లేచి హాల్‌లోకి వెళ్తాడు. హాల్‌లో రంగం, కాంతం, సత్యమూర్తి వాళ్లు ఉంటారు. దేవాని చూసి శారద నవ్వుతుంది. దేవా గెటప్ చూసి అందరూ నవ్వుతారు. ఏమైందా అని దేవా అని అందరికీ అడుగుతాడు. ఈ రోజు నువ్వు వింతగా కనిపిస్తున్నావ్ అని అంటుంది. ఇక కాంతం అద్దం చూపిస్తుంది. దేవా తన గెటప్ చూసి బిత్తరపోతాడు. ఇంతలో రంగం దేవాని ముద్దు పెట్టి ఆడపిల్లలా సూపర్‌గా ఉన్నావ్‌రా ముద్దుచ్చేస్తున్నావ్ అని అంటాడు. ఇలా ఎవరు రెడీ చేశారా అని దేవా అనుకొని అక్కడే నవ్వుతున్న మిథునని చూసి దేవా వెంట పడతాడు. చివరకు సత్యమూర్తి దేవాని ఆపుతాడు. ఏంటి నాన్న పడుకొని ఉంటే ఇలా రెడీ చేసింది చూడు అంటాడు. ఇక శారద దేవాతో అందరం ఇలా సంతోషంగా నవ్వుకొని చాలా రోజులు అయిందని అని అంటుంది. దేవా గదిలోకి వెళ్లి గెటప్ తీస్తుంటే మిథున దేవా దగ్గరకు వెళ్లి దేవి దేవి అని ఉడికిస్తుంది. దాంతో దేవా మిథున చెవి మెలేస్తాడు. ఇద్దరూ గదిలో కూడా ఒకర్ని ఒకరు ఆటపట్టించుకుంటారు. 
హరివర్ధన్ దగ్గరకు లాయర్ వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని హరివర్ధన్ అంటే నేను పిలిచాను అని త్రిపుర చెప్తుంది. ఎందుకు అని హరివర్ధన్ అడిగితే మిథున వాటా మీ కొడకు పేరు మీద రాయించడానికి పిలిచాను అంటుంది. డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని అంటుంది. ఏం చేస్తున్నావ్ మిథున అని లలిత అడుగుతుంది. ఆస్తి కోసం దేవా ఆడుతున్నా నాటకం ఆపాలని మామయ్యకి నచ్చదు అని తెలిసి కూడా మన ఇంటి పరువు కోసం నేను ఒకడుముందుకు వేశా అంటుంది.
హరివర్దన్ లాయర్‌ని వెళ్లిపోమని అంటాడు. లలిత డాక్యుమెంట్స్ చింపేస్తుంది. మా కూతుర్ని మా నుంచి మేం దూరం చేసుకోలేం అని లలిత అంటుంది. మిథున పేరు మీద ఉన్న ఆస్తి నా పేరున రాస్తే మిథున శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తుంది. మిథున పేరు మీద ఆస్తి లేదు అని ఆ రౌడీకి తెలిస్తే వాడే మిథునని మన ఇంటికి పంపేస్తాడు అని రాహుల్ అంటాడు. ప్రాణం పోయినా అక్క ఇంటికి రాదు.. బావ ఆస్తి కోసం ఆశ పడడు అని అలంకృత అంటుంది. త్రిపుర అలంకృత మీద అరిస్తే హరివర్దన్ ఇంట్లో అందరి మీద అరుస్తాడు. మిథున పేరు మీద ఉన్న ఆస్తి మీరు ఎందుకు ఆయన పేరు మీద రాయడం లేదు.. ఎందుకు జాగ్రత్త పడటం లేదు.. అంటే రౌడీని అల్లుడిగా అంగీకరిస్తారా అని అంటుంది. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు మరోసారి ఇలాంటి ప్రస్తావన తీసుకురావొద్దని వార్నింగ్ ఇచ్చి హరివర్ధన్ వెళ్లిపోతాడు. 
దేవా ఏమైపోయాడో అని పురుషోత్తం తెగ టెన్షన్ పడతాడు. ఇంతలో దేవా వస్తాడు. పురుషోత్తం దేవుడమ్మ గురించి అడుగుతాడు. ఈ దేవా పురుషోత్తం అన్న కోసం ప్రాణం అయినా ఇస్తాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















