అన్వేషించండి

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తిరుప్పరకుండ్రం మంటలు - హిందూత్వ భావోద్వేగం అంటుకున్నట్లేనా?

Thirupparakundram: తమిళనాడులో ఇప్పటి వరకు ద్రవిడ రాజకీయాలు ఉండగా, ఇప్పుడు బీజేపీ దానిని మతపరమైన రాజకీయాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దానికి తిరుప్పకుండ్రం దీపం వివాదం ఆయుధంగా దొరికింది.

Thirupparakundram fire in Tamil Nadu politics: తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న  తిరుప్పర కుండ్రం   ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. శతాబ్దాలుగా హిందూ-ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ కొండ, ప్రస్తుతం  మతపరమైన రాజకీయాలకు వేదికగా మారింది. 

 దక్షిణ భారత్ 'అయోధ్య'గా మారుతోందా? తిరుప్పర కుండ్రం చుట్టూ ముదురుతున్న రాజకీయం!

 తమిళనాడులో మురుగన్ ఆరు క్షేత్రాల్లో  మొదటిదైన తిరుప్పర కుండ్రం ఇప్పుడు రాజకీయ సెగలతో రగులుతోంది. ఈ కొండపై మురుగన్ ఆలయంతో పాటు శతాబ్దాల నాటి  సికందర్ బాదుషా దర్గా కూడా ఉంది. ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్న ఈ రెండు మతాల మధ్య, ఇటీవలి కాలంలో  కార్తీక దీపం  వెలిగించడం , జంతు బలుల విషయంలో తలెత్తిన వివాదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ప్రాంతాన్ని  దక్షిణ భారత్ అయోధ్య గా అభివర్ణించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయికి చేరింది.

 వివాదానికి మూలం ఏమిటి? 

ఇటీవలి కాలంలో కొండపై ఉన్న దీప స్తంభం  వద్ద కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, దర్గాకు సమీపంలో దీపం వెలిగిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు, దర్గాలో జంతు బలులు ఇవ్వడంపై కూడా హైకోర్టు ఆంక్షలు విధించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కొండ పేరును  సికందర్ మలై ' అని పిలవాలా లేక తిరుప్పర కుండ్రం మలై  అని పిలవాలా అనే అంశంపై కూడా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

 ఏ పార్టీ వైఖరి ఏమిటి? 

 బీజేపీ ఈ అంశాన్ని తన  హిందుత్వ  అజెండాకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. దశాబ్దాలుగా హిందువుల హక్కులను డీఎంకే కాలరాస్తోందని, దర్గా ప్రాంగణంలో దీపం వెలిగించే హక్కు హిందువులకు ఉందని వాదిస్తోంది. ఈ సమస్య ద్వారా తమిళనాడులో హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. అధికార డీఎంకే ప్రభుత్వం దీనిని  సామరస్య సమస్య గా చూస్తోంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని చెబుతూనే, మత విద్వేషాలను రగిలించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. మైనారిటీల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యత అని డీఎంకే సంకేతాలు ఇస్తోంది. ఈ విషయంలో అన్నాడీఎంకే ఆచితూచి స్పందిస్తోంది. ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవించాలని చెబుతూనే, అటు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇటు ముస్లింల మద్దతు కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.

 ఎన్నికలపై ప్రభావం 
వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వివాదం పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పటివరకు  ద్రవిడ రాజకీయాలు కుల వివక్ష, సామాజిక న్యాయం ప్రధానంగా ఉండగా, ఇప్పుడు బీజేపీ దానిని మతపరమైన రాజకీయాల  వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. మురుగన్ అంటే తమిళులకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని  ఆసరాగా చేసుకుని, డీఎంకేను హిందూ వ్యతిరేక  పార్టీగా ముద్ర వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం వర్సెస్ హిందుత్వ సిద్ధాంతం మధ్య జరిగే ఈ పోరులో తిరుప్పర కుండ్రం ఇప్పుడు ఒక కీలక  అంశంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget