Illu Illalu Pillalu Serial Today October 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్యని విశ్వ బుట్టలో వేసేశాడా! రాత్రి ఏం జరిగింది! ప్రేమ కోపం తగ్గిందా!
Illu Illalu Pillalu Serial Today Episode October 17th అమూల్య మనసు మార్చేలా విశ్వ అత్తతో మాట్లాడటం అది అమూల్య వినేలా శ్రీవల్లి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు నర్మదతో నాలో నువ్వు మీ నాన్నని చూసుకుంటున్నా అని చెప్పావ్.. నేను కానీ మీ అత్తయ్య కానీ నీకు ఏమైనా లోటు చేశామా.. మరి ఎలా మీ నాన్న నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు.. బాధలు పడుతున్నావ్ అని అంటాడు అని అడుగుతాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మిమల్ని ఇంట్లోకి రానిచ్చాను.. మీ నాన్న నిన్ను వదిలేసినట్లు నేను వాడిని వదిలేయలేదే.. నాకు ఇష్టం లేకపోయినా సరే నేను నిన్ను ప్రేమగా చూసుకున్నా కదా అని అంటాడు.
సాగర్ కలుగజేసుకొని కూతురి మీద ప్రేమతో అలా అనేశారు.. చిన్న విషయం వదిలేయండి అని అంటాడు. దానికి రామరాజు ఇది చిన్న విషయమా నా కోడల్ని నేను సరిగా చూసుకోవడం లేదు అనేది చిన్న విషయమా.. నా కొడుకుని ఇల్లరికం పంపమని చెప్పడం చిన్న విషయమా.. మీరు పుట్టుకముందు వరకు నేను అనాథనిరా.. నా పిల్లలే నా సర్వస్వం.. నాకు ఓ కుటుంబం ఏర్పడింది అలాంటిది నా కుటుంబాన్ని ఎలా వదిలేస్తా అని అంటాడు. సాగర్ తండ్రితో మా మామయ్యగారి ఉద్దేశం అది కాదు మీరు ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నారు.. అని అంటాడు. ఏంట్రా నేను ఊహించుకుంటున్నానా.. నీ మాటలు వల్ల నాకు అర్థమైందిరా నువ్వే ఇల్లరికం వెళ్లాలి అనుకుంటున్నావా.. అని నిలదీస్తాడు. 
నర్మద మామయ్యని అడ్డుకొని అలా ఏం లేదని అంటుంది. వల్లి మధ్యలో దూరితే ఏయ్ మధ్యలో దూరకు అని నర్మద అరుస్తుంది. ఇక మామయ్యతో మామయ్య నేను మా నాన్న ముందు అయినా చెప్తా నేను నా కన్నవాళ్లకి మాత్రమే దూరంగా ఉన్నా వాళ్ల ప్రేమకి కాదు.. మా నాన్న ఆ మాట అనడం నాకు ఇష్టం లేదు.. మా నాన్న తరఫున నేను సారీ చెప్తున్నా అని అంటుంది. రామరాజు సైలెంట్‌గా వెళ్లిపోతాడు. భూకంపం సృష్టిద్దాం అనుకుంటే ఇలా అయిందేంటని వల్లి ఏడుస్తుంది.
వల్లీకి రాత్రి విశ్వ కాల్ చేసి అమూల్యని బయటకు తీసుకురమ్మని అంటాడు. వల్లీ బిత్తరపోతుంది. అర్ధరాత్రి ఆడపిల్లని బయటకు తీసుకొస్తే నా పని అయిపోతుంది అని వల్లీ అంటే మంచి ప్లాన్ వేశా తీసుకురా అని విశ్వ అంటాడు. వల్లీ సరే అంటుంది. అమూల్య చదువుకుంటూ ఉంటే వల్లీ వెళ్లి బయట తిరిగి వద్దాం రా అని పిలుస్తుంది. అమూల్య వల్లీ ఇద్దరూ బయట తిరుగుతారు. విశ్వ అమూల్యని చూసి అత్తతో అత్త పోలీస్ కేసులు వద్దు అత్త అని అంటాడు. నిన్ను ఇంతలా కొట్టినా వాళ్ల మీద ఎలా కేసు పెట్టుకుండా ఉండాలిరా అని అంటుంది. వద్దు అత్త నేను అమూల్యతో మాట్లాడాలి అనుకున్నా అందుకు నా మనసులో ఏం ఉందో వాళ్లకి తెలీదు కదా అందుకే ధీరజ్ కొట్టాడు. ఇప్పుడు కేసులు అవి ఇవీ వద్దు ఎంతైనా వాళ్లు నా మేనత్త పిల్లలే కదా అని అంటాడు. 
వల్లీ అమూల్యతో ఈ బండోడు చెడ్డొడే అనుకున్నా వాడిలో మంచోడు ఉన్నాడు.. అమూల్య ఆలోచనలో పడుతుంది. విశ్వ భద్రావతితో ఇప్పుడు ఆలోచనలో పడింది త్వరలోనే మన ట్రాప్‌లో పడిపోతుందని అని అంటాడు.
ప్రేమ లాకెట్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి ఆ లాకెట్ నువ్వు నాకు గుడిలో ఇచ్చింది కదా చూస్తా ఇవ్వు అని అంటాడు. ప్రేమ ఇవ్వదు. ధీరజ్ తనతో మాట్లాడమని ప్రేమని బతిమాలుతాడు. ఎంత బతిమాలినా ప్రేమ మాట్లాడదు దాంతో ధీరజ్ చాప వేసుకొని పడుకుంటాడు. ఆకలి వేయడంతో ధీరజ్‌కి నిద్ర పట్టదు.. అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ప్రేమ చూసి అన్నం తీసుకొచ్చి ఇస్తుంది. ధీరజ్ చేతికి గాయం కావడంతో తినలేకపోతాడు. ప్రేమనే తినిపిస్తుంది. ఇక ధీరజ్ ప్రేమతో డెలివరీ బాయ్ జాబ్ మానేశా అని క్యాబ్ డ్రైవర్‌గా జాయిన్ అయ్యానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















