Ammayi garu Serial Today October 16th: అమ్మాయిగారు సీరియల్: విరూపాక్షికి గిఫ్ట్ తీసుకొచ్చిన సూర్య! కోమలి రిస్క్‌లో పడిందా!
Ammayi garu Serial Today Episode October 16th రాజు, రూపలు కోమలికి కాబోయే అత్తమామల్ని చూసి వాళ్లని ఫాలో అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక దీపక్‌తో సూర్యప్రతాప్‌లో మార్పు వస్తుందని.. అందుకే రాఘవ కోలుకున్నాడు అనగానే హాస్పిటల్‌కి హడావుడిగా వచ్చేశాడు. ఇక రూప ఎదురుగానే మనం రాఘవని కొట్టాం కాబట్టి రూప కూడా మనల్ని వదలను వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచాలని చెప్తుంది.
రాజు, రూపలు కారులో వెళ్తూ ఈ రోజుతో నాన్నకి నిజం తెలుస్తుంది. అమ్మ కష్టాలు పోతాయి అనుకుంటే చేతి వరకు వచ్చిన అవకాశం చేజారిపోయిందని అంటుంది. ఏం కాదు అని రాజు ధైర్యం చెప్తాడు. రాజు రూపలు వెళ్తూ కోమలికి కాబోయే అత్తమామల్ని చూస్తారు. కోమలి అత్తామామలు అని అనుకొని వాళ్లని ఫాలో అవుతారు. చాలా దూరం ఫాలో అయిన తర్వాత మిస్ అయిపోతారు. రూప, రాజు మొత్తం వెతుకుతారు.
దీపక్ తల్లితో మనలో వాళ్లకి ఎవరు దొరికినా మనకు చుక్కలు చూపిస్తారు అని అంటాడు. కోమలితో ఇప్పుడున్న పరిస్థితిలో మా కన్నా నువ్వే ఎక్కువ రిస్క్‌లో ఉన్నావ్.. మేం దొరకాలి అంటే కేవలం రాఘవ మాత్రమే కళ్లు తెరవాలి.. రూప మీ అత్తమామల్ని చూసేశారు కాబట్టి నువ్వు కూడా రిస్క్‌లో పడతావ్ అంటాడు. నేను రిస్క్‌లో పడతాను అంటే మీరు కూడా రిస్క్‌లో పడతారు కదా కాబట్టి నన్ను మీరే రక్షించాలి అని అంటుంది. విజయాంబిక కోమలితో రాజు నీ వెనక తిరిగితే మనకు ఏం ప్రాబ్లమ్ రాదు అని అంటుంది. దానికి కోమలి రేపటి నుంచి నేనేంటో చూపిస్తా నా కొంగు పట్టుకొని రాజు తిరిగితే నా గదిలో ఉండేలా.. ఎక్కడికి వెళ్లినా నన్ను తీసుకెళ్లేలా చేస్తానని తన ప్లాన్ చెప్తుంది.
రాజు, రూపలు మొత్తం వెతుకుతారు కానీ ఫలితం ఉండదు. ఇక అదే రూట్‌లో విరూపాక్షి వచ్చి రాజు, రూపల్ని చూసి కారు ఆపిస్తుంది. రాజు వాళ్ల దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎందుకు ఉన్నారు.. ఏమైంది అని అడుతుంది. రాజు విరూపాక్షితో కోమలి అత్తమామలు కనిపించినట్లే కనిపించి మిస్ అయిపోయారని చెప్తారు. మనం ఇంకెంత కాలం ఇలా బాధ పడాలి అమ్మా అని రూప బాధ పడుతూ హాస్పిటల్‌లో జరిగిన విషయం మొత్తం విరూపాక్షికి చెప్తుంది. విరూపాక్షి షాక్ అయిపోతుంది. విరూపాక్షి ఏడుస్తూ ఆ విజయాంబికకు నేనేం అన్యాయం చేశాను.. నా మీద ఎందుకు ఇంత పగ పెట్టుకుంది. ఇంత చేసినా విజయాంబికకు సూర్య ఏం అనలేదా అని విరూపాక్షి అంటుంది. దాంతో కొట్టలేదు కానీ రాఘవ దగ్గరకు ఇంకెప్పుడు రావొద్దని చెప్పారని రూప చెప్తుంది. టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని అనుకుంటారు.
బంటీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మందారంతో పిన్ని అమ్మవాళ్లు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడే రూప వాళ్లు వస్తారు. విజయాంబికను విరూపాక్షి కోపంగా చూసి విజయాంబిక దగ్గరకు వెళ్లి నీ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది.. చూస్తూ ఉండు నీ పని అయిపోతుంది అని అంటుంది. దానికి విజయాంబిక నీ ఆశాకిరణాన్ని ఆపేసినా కూడా నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావ్ అని అంటుంది. దానికి విరూపాక్షి విజయాంబికతో నా ఆశాకిరణం రాఘవ కాదు విజయాంబిక సూర్య అని అంటుంది.
ఇంతలో సూర్య ఇంటికి వస్తాడు. సూర్య చేతిలో కవర్ చూసిన బంటీ ఏంటి అది అని అడుగుతాడు. గిఫ్ట్ తీసుకొచ్చావా అని అడుగుతాడు. విజయాంబిక షాక్ అయితే విరూపాక్షి మనసులో కొంపతీసి సూర్య నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడా అని అనుకుంటుంది. తాతయ్య ఇది అమ్మమ్మ కోసం తీసుకొచ్చిన గిఫ్టే కదా అని బంటీ అడుగుతాడు. అవును అని సూర్యప్రతాప్ చెప్పడంతో అందరూ చాలా సంతోషిస్తారు. విజయాంబిక అయితే కళ్లతో నిప్పులు పోసుకుంటుంది. సూర్యప్రతాప్ మనసులో ఈ చీర పంతులు గారు ఇచ్చారు అంటే బంటీ ఇంత హ్యాపీగా ఉండడు.. ఈ చీర అమ్మవారి కానుక కాబట్టి ఎవరికి దక్కాలో అమ్మవారే చూసుకుంటుంది అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















