Chinni Serial Today May 9th: చిన్ని సీరియల్: చిన్నికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్.. అడ్డుకున్న సత్యంబాబు.. వల్లికి ఇది అవమానమేనా!
Chinni Today Episode చిన్ని ఫంక్షన్‌కి దేవా, వల్లిలు రావడం సత్యంబాబు కావేరి ఫొటో దాచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని ముస్తాబు చేసి కావేరి, సరళ తీసుకొని వస్తారు. చిన్నిని చూసి సత్యంబాబు, బాలరాజు చాలా సంతోషపడతారు. చిన్ని తండ్రిని హగ్ చేసుకుంటుంది. సత్యంబాబు, సరళ సైలెంట్‌గా ఉండిపోతారు. చిన్ని సంతోషంగా నాన్న ఈ లంగావోణీ, నెక్లెస్ అన్నీ మామయ్య తీసుకొచ్చాడు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. మీ మామయ్య మనసు అంత బాగున్నాయని బాలరాజు చెప్తాడు.
చిన్నిని తీసుకొని వెళ్లి బయట కుర్చీలో కూర్చొపెడతారు. కావేరి చిన్నికి గంధం పూసి బొట్టు పెడుతుంది. కార్యక్రమం మొదలు పెడదామని భారతి అంటే ఇంకా ఛీప్‌గెస్ట్ వాళ్లు రాలేదని అంటుంది. ఇంతలో నాగవల్లి వాళ్లు వస్తారు. సరళ బలవంతంగా భర్తని వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి తీసుకెళ్తుంది. బాలరాజు కావేరితో వాళ్లు వచ్చేశారు జాగ్రత్త అని అంటాడు. వెంటనే కావేరి చిన్నితో ఈ ఫంక్షన్ అయ్యే వరకు నన్ను అమ్మా అని తనని నాన్న అని పిలవకు జాగ్రత్త అని మరోసారి జాగ్రత్తలు చెప్తుంది. చిన్ని తాను జాగ్రత్తగా ఉంటాను అంటుంది. నాగవల్లి వస్తూ కావేరిని కోపంగా చూస్తుంది. బాలరాజుని దేవా చూసి ఆటో డ్రైవర్‌ని కూడా పిలిచారా అంటే పిల్లల్ని తీసుకెళ్తారు కదా అందుకే పిలిచామని అంటాడు. ఇక సత్యంబాబు మనసులో వీడు కావేరి ఫొటో చూస్తే నా చెల్లి కావేరి అని తెలిసిపోతుందని కంగారుగా లోపలికి వెళ్తాడు.
దేవేంద్ర వర్మ బాలరాజు దగ్గరకు వెళ్తాడు. బాలరాజు దేవాతో అనవసరమైన మాటలు పక్కన పెట్టి వచ్చిన పని చూసుకొని వెళ్లు అంటాడు. నేను పని చూసుకొనే వెళ్తా అని అంటాడు. సత్యంబాబు కావేరి ఫొటో దగ్గరకు వెళ్లి ఫొటో తీసుకెళ్లి దాచేస్తాడు. సరళ నాగవల్లి దగ్గరున్న స్వీట్స్ బాక్స్ తీసుకోమని కావేరికి చెప్తుంది. కావేరి తీసుకుంటుండగా నాగవల్లి మనసులో నువ్వు తిని చావాల్సిన విషపు స్వీట్ ఇందులోనే ఉందని అనుకుంటుంది. కార్యక్రమం మొదలవుతుంది. దేవా కావాలనే కావేరిని పలకరిస్తాడు. అందరూ చిమిలీ దంచడానికి వెళ్తారు. సరళ వెళ్లి అమ్మా ఉష నువ్వు చిమిలీ తొక్కకూడదమ్మా ముత్తయిదువులు మాత్రమే తొక్కాలి అంటుంది. ఆవిడ వచ్చింది అంటే పెళ్లి అయిందేమో అని దేవా అంటాడు. తనకు ఇంకా కాలేదండీ అని సరళ చెప్తుంది. కావేరి బాధగా పక్కకు తప్పుకుంటుంది. మిగతా వాళ్లు చలిమిడి దంచుతారు. తర్వాత వెళ్లి కావేరి దంచుతుంది. దంచిన చలిమిడి అందరూ చిన్నికి తినిపిస్తారు. తర్వాత చిన్ని అందరికీ తాంబూలం ఇస్తుంది. అందరూ చిన్నిని ఆశీర్వదిస్తారు.
సత్యంబాబు వాళ్లు మండపం మీద గిఫ్ట్‌గా వెండి కంచం ఇస్తారు. తర్వాత నాగవల్లి వాళ్లకి ఇవ్వమని సరళ చెప్తుంది. బంగారం తెచ్చుంటారని అనుకుంటుంది. గిఫ్ట్ ఓపెన్ చేసి ఇవ్వమని నలుగురూ చూస్తారని అంటుంది. నాగవల్లి ఓపెన్ చేస్తుంది. నాగవల్లి చిన్ని కోసం డైమండ్ నెక్లెస్ ఇస్తుంది. సరళ నోరెళ్ల పెడుతుంది. ఖరీదు అడుగుతుంది. పది లక్షలు అనగానే అలా ఉండిపోతుంది. మిగతా అందరూ నోరెళ్ల బెడతారు. సత్యంబాబు నాగవల్లి వాళ్లతో గిఫ్ట్ వెనక్కి తీసుకెళ్లిపోండి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















