Chinni Serial Today May 8th: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!
Chinni Today Episode మేనమామ పెట్టిన చీర నగలు పెట్టుకొని చిన్నిని కావేరి ముస్తాబు చేయడం రాజు, సత్యం చూసి మురిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నికి మంగళ స్నానం చేయించి అందరూ చిన్నిని చూసి మురిసిపోతారు. చిన్ని అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత కావేరి, బాలరాజుల ఆశీర్వాదం తీసుకుంటుంది. భారతి సత్యంబాబుతో నీ మేనకోడలికి ఏం ఇస్తావ్ అని అడుగుతుంది. దాంతో సత్యం ప్రత్యేకంగా ఇచ్చేది ఏముంది ఇదంతా తనదే కదా అంటాడు. దానికి సరళ మొత్తం తనకే అనకు అయ్యా మన పిల్లలకు ఇచ్చిన తర్వాత తనకు ఇస్తామని చెప్పు. పైగా ఈరోజు చాలా గిఫ్ట్‌లు వస్తాయి. నాగవల్లి వాళ్లు కూడా వస్తారు కదా అంటుంది.
కావేరి కంగారు పడుతుంది. సత్యంబాబు కూడా వాళ్లని ఎందుకు పిలిచావే అని తిడతాడు. ఇక తర్వాత సరళ మంగళ హారతి ఇస్తుంది. కట్నం పెట్టమని అంటుంది. సత్యంతో పాటు బాలరాజు కూడా డబ్బులు పెడతాడు. ఆ సంతోషంలో సరళ చేయి కాల్చుకొని హారతి పళ్లెం కింద పడేస్తుంది. అందరూ కంగారు పడతారు. ఇలా జరగడం అశుభం ఏం కాదు కదా అని కావేరి అడుగుతుంది. అలా ఏం ఉండదులే అమ్మా అని భారతి చెప్తుంది. కావేరి మనసులో నా మనసులో ఏదో కీడు శంకిస్తుంది. ఏమైనా జరుగుతుందా ఆ దేవా వాళ్లు కూడా వస్తున్నారు అనుకుంటుంది.
బాలరాజు బయట ఫ్లెక్సీ పెడుతూ ఉంటాడు. రౌడీలు అది చూసి దేవాకి కాల్ చేసి మీ అనుమానం నిజమే సార్ అంటాడు. దానికి దేవేంద్ర వర్మ బాలరాజు ఎందుకు వాళ్ల ఇంటి ఫంక్షన్‌కి అంత హడావుడి చేస్తున్నాడు ఒక వేళ చిన్ని వాడి కూతురు అయితే వాళ్ల పని అయిపోతుందని అంటాడు. ఇక బాలరాజు చిన్ని ఫొటో చూస్తూ నేను మీ అమ్మ, మామయ్య కలిసి ఈ ఫంక్షన్ చేస్తామని కలలో కూడా అనుకోలేదు మీ అమ్మ నాకు ఈ అదృష్టం ఇచ్చిందన అనుకుంటాడు. చిన్ని ఫొటోలు తీసుకొని సంబర పడిపోతాడు. ఇంతలో కావేరి రాజుని పిలవమని ఆఫ్ టికెట్‌కి చెప్తుంది. ఆఫ్ టికెట్ బాలరాజు వస్తాడు.
బాలరాజు కావేరి దగ్గరకు వెళ్లి ఎందుకు పిలిచావ్ అని అడుగుతాడు. నాకు భయం వేస్తుందని కావేరి అంటుంది. బాలరాజు తనకు కాస్త టెన్షన్‌గా ఉందని కానీ మనం ముగ్గురం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. చిన్ని మన ఇద్దరినీ అమ్మానాన్న అని పిలవకుండా జాగ్రత్త పడాలి అని చిన్నికి విషయం గట్టిగా చెప్పమని అంటాడు. చిన్ని వంక ప్రేమగా చూడొద్దని కావేరి బాలరాజుకి కూడా జాగ్రత్తలు చెప్తుంది. ఇక బాలరాజు కావేరికి రెండు చేతులు జోడించి దండం పెట్టి థ్యాంక్స్ చెప్తాడు. తనకు ఫంక్షన్‌లో పనులు చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు.
సత్యంబాబు సరళలకు చిన్ని కోసం వెండి పట్టీలు, బంగారం చైన్ కొంటాడు. అది చిన్నికి అని తెలిసిన సరళ ఇప్పటికే ఫంక్షన్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి అవసరమా అని అంటుంది. దానికి సత్యంబాబు అది నా బాధ్యత అంటాడు. మన పరిస్థితి కూడా చూడాలి కదా అయ్యా అని సరళ అంటుంది. కావేరిని పిలు అంటాడు. కావేరి ఏంటి అని సరళ అంటే ఉష టీచర్‌ని అని అంటాడు. ఇవి తనకు ఇచ్చి చిన్నికి రెడీ చేయమని చెప్తాను అంటాడు. ఇంతలో ఉష వస్తే పిలిచి చీర, బంగారం, వెండి అవన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు బ్రో అని అంటుంది. ఇక వాటిని కావేరి చేతిలో పెట్టి నా మేనకోడలికి మేనమామ ఇస్తున్న కానుక రెడీ చేయమ్మా అని చెప్తారు.
చిన్నిని రెడీ చేసి కావేరి చాలా సంతోషపడుతుంది. చిన్ని కన్నీరు పెట్టుకుంటుంది. ఐలవ్‌యూ అమ్మ అని అంటుంది. చిన్నిని బయటకు తీసుకెళ్తారు. సత్యంబాబు, రాజు చూసి చాలా సంతోషపడతారు. మామయ్య దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటుంది చిన్ని తర్వాత నాన్నని హగ్ చేసుకుంటుంది. చాలా సంతోషపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















