Chinni Serial Today May 7th: చిన్ని సీరియల్: సత్యం ఇంట్లో సందడి సందడి.. చిన్ని ఫంక్షన్‌లో రాజు, కావేరిలను క్లోజ్ చేయడానికి దేవా ప్లాన్స్!
Chinni Today Episode చిన్ని ఫంక్షన్‌లో దేవా కావేరిని స్వీట్ ఇచ్చి చంపాలని బాలరాజుని డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్లాన్స్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్ర వర్మ మరదలు నాగవల్లితో సత్యంబాబు పిల్లల్ని మాత్రమే బాలరాజు స్కూల్‌కి తీసుకెళ్తున్నాడని.. ఉష టీచర్ సత్యంబాబు ఇంటి మీదే అద్దెకు ఉందని.. సత్యంబాబు చెల్లికి చిన్ని అనే కూతురు ఉందని తను ఎక్కడుందో తెలుసుకోవాలని ఉష ఆ ఇంట్లో ఉండటానికి రాజు ఆ ఇంట్లో పిల్లలకు మాత్రమే బాలరాజు తీసుకెళ్లడానికి ఏమైనా కారణం ఉందా అని తెలుసుకోవాలని తన ప్లాన్ చెప్తాడు.
చిన్నికి ఫంక్షన్ కోసం కావేరి చిన్నికి గోరింటాకు పెడుతుంది. సత్యంబాబు డెకరేషన్ చేస్తాడు. సరళ, లోహిత, భారతిలు పువ్వులు కడతారు. బాలరాజు సరుకులు తీసుకొస్తారు. ఇక సత్యంబాబుతో బాలరాజు ఫంక్షన్ గురించి మాట్లాడుతాడు. సరళ ఉషతో ఉష నువ్వు చిన్నిని సొంత కూతురిలా చూసుకుంటున్నావ్ పోనీ తనని దత్తత తీసుకో అంటాడు. మా బ్రో ఒప్పుకుంటే రేపే తీసుకుంటా అని ఉష అలియాస్ కావేరి అంటుంది. సరళ నవ్వుతూ అది ఈ జన్మలో జరగదులే మా ఆయనకు మేనకోడలు అంటే ప్రాణం అని అంటుంది. అందరూ నవ్వుకుంటారు.
చందు అందరి కోసం అన్నం కలుపుకొని తీసుకొచ్చి ముద్దలు పెడతాడు. కావేరికి పెట్టి అత్త ఈ మేనల్లుడి ముద్దు ఎలా ఉంది అంటాడు. మేనల్లుడు ఏంట్రా అని సరళ అంటే మేనత్త కాని మేనత్త అంటాడు. ఇక తర్వాత బాలరాజుకి ముద్ద పెడితే బాలరాజు వద్దు అని నాకు పెడితే మీ నాన్నకి కోపం వస్తుందని అంటాడు. దానికి చందు ఏం కాదు మా నాన్నకి ఎవరైనా తప్పు చేస్తే కోపం వస్తుంది కానీ అన్నం పెడితే కోపం రాదు మామయ్య పైగా నువ్వు మా మేనత్త భర్తవి మా ఇంటి అల్లుడివి నీకు పెట్టకుండా మేం ఎలా తింటామని అందరికీ చందు అన్నం తినిపిస్తాడు. అందరూ సందడిగా ఉంటారు.
కావేరి ఇంటి ముందు రంగుల ముగ్గు పెడుతుంటే బాలరాజు చూసి బ్యూటీఫుల్ అంటాడు. కావేరి కోపంగా చూస్తే నేను చెప్పింది ముగ్గు గురించి అంటాడు. ఇంతలో కావేరి కంట్లో రంగు పడుతుంది. కావేరి నేను చూస్తా అని బాలరాజు కావేరి కన్ను ఊదుతాడు. తర్వాత కావేరి కొంగుతో కంటికి ఆవిరి పెడతాడు. ఆ సీన్ చూసిన సత్యంబాబు కావేరికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోవాలి అనుకుంటున్నాడు అది జరగనివ్వను అనుకుంటాడు. ఇక బాలరాజు సత్యంబాబు దగ్గరకు వెళ్లి తనకు సరళకు బట్టలు ఇస్తాడు. సత్యం వద్దు అనేస్తాడు. ఇదంతా మేనమామ చేతుల మీద జరగాలి మొత్తం నేనే చేసుకుంటా నువ్వేం మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. భారతి, కావేరి సత్యంబాబుకి నచ్చచెప్తారు. బాలరాజు, కావేరి చాలా సంతోషపడతారు.
భారతి మంగళస్నానానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక బాలరాజు కావేరితో చిన్నికి జాగ్రత్తగా ఉండమని చెప్పు పొరపాటున సంతోషంలో నిన్ను అమ్మా అని పిలిచేస్తుందని అంటాడు. కావేరి సరే అంటుంది. ఇక దేవా డ్రగ్స్ ప్యాకెట్స్ తన మననుషులకు ఇచ్చి వాటిని బాలరాజు ఆటోలో పెట్టమని చెప్తాడు. ఆటోలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని వాడిని పోలీసులు అప్పగిస్తారని చెప్పి తన ప్లాన్స్ అన్నీ రౌడీలకు చెప్తాడు. ఇక నాగవల్లి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి బావకి ఇస్తుంది. దేవా తినబోతే ఆపి అది మనకోసం కాదు బావ అది కావేరి కోసం. ఇది తిన్ని అరగంటకు కావేరి చాప్టర్ క్లోజ్ అయిపోతుందని అంటుంది.
చిన్నికి అందరూ మంగళస్నానం చేయిస్తారు. అందరూ కలిసి పసుపు, గంధం పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి మంగళస్నానాలు సంతోషంగా చేయిస్తారు. కావేరి, బాలరాజులు తన కూతురిని చూసి చాలా సంతోషపడతారు. తర్వాత చిన్నిని రెడీ చేసి కూర్చొపెడతారు. చిన్ని కాళ్లకు సరళ పసపు రాస్తుంటే నువ్వు నా కాళ్లు పట్టుకోవడం ఏంటి అత్త అని చిన్ని అంటుంది. దానికి సరళ నా చేత పసుపు రాసుకునే అదృష్టం వస్తే అలా అంటావేంటి అని అంటుంది. ఇక సరళ చిన్నికి పసుపు రాస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















