Chinni Serial Today May 20th: చిన్ని సీరియల్: చిన్నిని ఇంటి నుంచి గెంటేసిన సరళ.. చూస్తూ ఉండిపోయిన కన్న తల్లి!
Chinni Today Episode కావేరి ఎదురుగానే చిన్నిని సరళ ఎన్జీఓతో పంపేయడం దేవాకి సరళ ఆ విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యంబాబుని చంపినట్లే కావేరి కూడా చంపేస్తానని దేవేంద్ర వర్మ బాలరాజుతో చెప్తాడు. నువ్వు జైలుకి పోతున్నావ్ చిన్నికి కూడా కాపాడుకోలేక కావేరి గిలగిలా కొట్టుకుంటుందని ఇప్పుడు అసలు ఆట మొదలైందని దేవేంద్ర వర్మ అంటాడు. బాల కోపంతో దేవా గొంతు పట్టుకొని ఇప్పటికే నాకు ఓ మర్డర్ కేసు ఉంది మరోకటి ఉంటే నష్టం ఏం లేదు.. నా భార్య పిల్లల జోలికి వస్తే చంపేస్తా అని అంటాడు.
దేవా పోలీసుల్ని చూసి బాలరాజు తనని చంపబోయినట్లు నటించి ఇలాంటి వాడు ఎప్పటికీ బయట ఉండకూడదని పోలీసులతో చెప్తాడు. సత్యంబాబు ఫొటో దగ్గర దీపం పెట్టి అందరూ పూలు చల్లతారు. అందరూ ఏడుస్తారు. చిన్నిని చూసిన సరళ కోపంతో చిన్ని చేతిలో పూల పళ్లెం విసిరేసి.. ఆయన ఫొటో ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదే మా కళ్ల ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదే.. నా పసుపు కుంకుమలు తీసేసిన వాడి కడుపున పుట్టావే అని ఏడుస్తుంది. మీ అమ్మ మా మామయ్యని చంపేసింది.. మీ నాన్న నా భర్తని చంపేసింది అని సరళ ఏడుస్తుంది. హంతకుల కడుపున పుట్టిన నీకు మా ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి చిన్ని బ్యాగ్ తీసుకొని రమ్మని లోహితకు చెప్తుంది. నన్ను పంపొద్దు అత్తయ్య అని చిన్ని ఏడుస్తుంది.
సరళ కాళ్లు పట్టుకొని చిన్ని తనని పంపొద్దని చెప్తుంది. కావేరి కూడా అలా ఒంటరిగా పిల్లని పంపడం తప్పని అంటుంది. ఒంటరిగా పంపడం లేదని ఎన్‌జీఓకి కాల్ చేశానని చెప్తుంది. ఇంతలో ఎన్‌జీఓ వాళ్లు వచ్చి చిన్నిని తీసుకెళ్తుంటారు. ఇంతలో కావేరి ఆపి చిన్నిని తీసుకెళ్లొద్దు చిన్ని నాతో ఉంటుంది అని అంటుంది. చిన్ని నీతో ఉండాలి అంటే నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటుంది. చిన్నికి ఇంత కాలం సత్యంబాబు గార్డెన్‌గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిన్నిని తనతో ఉంచుకోవడానికి వాళ్ల అత్తయ్య ఒప్పుకోకపోవడంతో చిన్నిని రూల్స్ ప్రకారం తీసుకెళ్తామని అంటారు.
చిన్ని కావేరితో టీచరమ్మ నేను అక్కడే ఉంటాను మీరు మా అత్తయ్య వాళ్లకి తోడుగా ఉండండి అని చెప్తుంది. చిన్నిని ఎన్జీఓకి తీసుకెళ్తారు. కావేరి చాలా ఏడుస్తుంది. ఇంటికి పట్టిన శని వదిలిపోయిందని సరళ వెళ్లిపోతుంది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాలరాజు సత్యంబాబు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కోపంతో జైలు గోడకు కొట్టుకుంటాడు. కానిస్టేబుల్ వచ్చి బాలరాజు నేను విన్నది నిజమేనా అని అంటే లేదు బాబాయ్ చేయని తప్పుకి నన్ను ఇరికించారు. నేనే ఎలా బయట పడాలి అంటే చాలా కష్టం బాలరాజు 14ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. లేదంటే ఏ దేవుడో కరుణించాలి అంటాడు. బాలరాజు మనసులో దేవా నువ్వు ఇంత దారుణం చేస్తావని అనుకోలేదని అనుకుంటాడు.
దేవేంద్ర వర్మ, నాగవల్లి సరళని పరామర్శించడానికి ఏం తెలీనట్లు వస్తారు. సత్యంబాబు ఫొటోకి నివాళులు అర్పించి సరళతో మంచిగా మాట్లాడుతారు. ఇద్దరి ఏడుస్తూ బాగా నటిస్తారు. కావేరి కోపంగా చూస్తుంది. నీకు అన్న ఎప్పటికీ తోడుగా ఉంటాడని సరళతో చెప్తాడు. నువ్వే వీళ్లని జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. చిన్ని గురించి అడిగితే ఆ దరిద్రాన్ని వదిలించుకున్నాం అని చెప్తుంది. ఎన్జీఓతో పంపేశామని చెప్తుంది. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి అని చెప్తాడు. ఇక ఫోన్ మర్చిపోయా అని మళ్లీ వెళ్తాడు. వీడు మళ్లీ వస్తున్నాడు ఏంటి అని కావేరి ఎదురు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!





















