Chinni Serial Today May 17th: చిన్ని సీరియల్: దేవా దారుణానికి సత్యంబాబు బలి.. అన్యాయం అయిపోయిన సరళ, పిల్లలు!
Chinni Today Episode సత్యంబాబు చనిపోయాడని పోలీసులు కావేరి, చిన్నిలకు చెప్పి బాలరాజే సత్యంబాబుని చంపేశాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరి, చిన్నిలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సత్యంబాబుని బాలరాజు, దేవా కలిసే ఇదంతా చేసుంటారని బాలరాజు ఇంటికి వెళ్తాడు. అక్కడ బాలరాజు లేకపోవడంతో దేవా ఇంటికి వెళ్తాడు. దేవా సత్యంబాబుతో బాలరాజు మంచి వాడిగా మారిపోయాడని కావేరిని జైలులో కాపాడింది ఇప్పటి వరకు కాపాడుతూ వస్తుంది బాలరాజు అనే చెప్తాడు. అందుకే నిన్ను చంపి ఆ బాలరాజు అంతు చూస్తానని చెప్పి దేవా సత్యంబాబుని పొడిచేస్తాడు.
సత్యంబాబుని పొడిచేసిన దేవేంద్ర వర్మ తన మనుషులతో ఆ బాలరాజుని ఇరికించాలని పక్కా ప్లాన్ వేసి సత్యంబాబుని రోడ్డు మీద పడేసి బాలారాజు రాగానే బాలరాజే చంపేసినట్లు వీడియో తీసి పోలీసులకు చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయమని అంటాడు. సత్యంబాబుని రోడ్డు మీద పడేస్తారు. మరోవైపు కావేరి, చిన్నిలు రాత్రి మొత్తం బాలరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకీ రాకపోవడంతో బాలరాజుని కావేరి తిడుతుంది. అతన్ని మరోసారి నమ్మి తప్పు చేశానని ఇక జీవితంలో నమ్మను అని అంటుంది. అలా కాదు అని తన తండ్రి వస్తాడని చిన్ని అంటుంది. మరోసారి కావేరి బాలరాజుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవదు.
బాలరాజు రోడ్డు మీద సత్యంబాబుని చూస్తాడు. పొట్టలో ఉన్న కత్తి తీస్తాడు. సత్యంబాబు బామ్మర్దితో కావేరి, చిన్ని జాగ్రత్త అని వాళ్లని కాపాడుకోమని దేవా దుర్మార్గానికి తాను బలైపోయానని అంటాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్తానని రాజు అంటే మరి నేను బతకను నాకు అర్థమైపోయిందని అంటాడు. సత్యంబాబు చనిపోతాడు. బాలరాజు చాలా ఏడుస్తాడు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి వస్తారు. కావేరికి కాల్ చేసి సత్యంబాబు ఫోన్‌లో నెంబరు చూశామని చివరి కాల్ మీకే వచ్చిందని సత్యంబాబు చనిపోయారని చెప్పి రమ్మని చెప్తారు. కావేరి షాక్ అయి కుప్పుకూలిపోయి అన్నయ్యా అని పెద్దగా ఏడుస్తుంది. ఏమైందని చిన్ని అడిగితే విషయం చెప్తుంది ఇద్దరూ ఏడుస్తారు.
చిన్ని కావేరి సత్యంబాబు శవం దగ్గరకు వెళ్తారు. ఇద్దరూ శవం దగ్గర పెద్దగా ఏడుస్తారు. ఇంత దారుణం ఎవరు చేశారని అడిగితే బాలరాజు అని పోలీసులు చెప్తారు. ఇద్దరూ షాక్ అయిపోతారు. మా నాన్న అలా చేయడు అని చిన్ని అంటుంది. కావేరి మనసులో బాలరాజునే చేసుంటాడా లేక ఇంకెవరైనా చేసుకుంటారా అని ఆలోచిస్తుంది. బాలరాజు తనేం చేయలేదు అని నమ్మొద్దని అంటాడు. పోలీసులు వీడియో సాక్ష్యం చూపిస్తారు. అందులో బాలరాజు కత్తి తీయడం చూసి బాలరాజే చంపాడని అనుకుంటారు. చిన్ని మాత్రం తన తండ్రి అలాంటి వాడు కాదని ఏడుస్తుంది. పోలీసులు బాలరాజుని అరెస్ట్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తారు. ఇంటి దగ్గర సరళ పిల్లలు సత్యంబాబు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హారతి ఆరిపోవడంతో సరళ కంగారు పడుతుంది. ఇక దేవా నాగవల్లితో మాట్లాడుతాడు. సత్యంబాబు కంటే ముందే కావేరిని చంపాల్సిందని నాగవల్లి అంటుంది. కావేరి చస్తేనే తన పగ చల్లారుతుందని అంటుంది. సత్యంబాబు బాడీని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొస్తారు. సరళ పిల్లలకు విషయం తెలుస్తుంది. భర్త చనిపోయాడని తెలిసి సరళ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!





















