Chinni Serial Today May 15th: చిన్ని సీరియల్: చిన్నిని తీసుకొని రాజుతో వెళ్లిపోతున్నా కావేరి.. మరోసారి అన్న నమ్మకాన్ని మోసం చేస్తుందా!
Chinni Today Episode దేవా ఇచ్చిన వార్నింగ్‌తో కావేరి చిన్నిని తీసుకొని బాలరాజుతో వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు కావేరికి కాల్ చేసి రాత్రి 12కి చిన్నిని తీసుకొని వచ్చేయమని చెప్తాడు. కావేరి వస్తుందని చాలా సంతోషపడతాడు. మీరు వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నా నన్ను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందని ఆఫ్ టికెట్ ఏడుస్తాడు. దానికి రాజు నిన్ను వదిలేసి ఎలా వెళ్తాంరా మేం అక్కడ సెటిల్ అయితే నిన్ను తీసుకెళ్తా అంటాడు.
చిన్ని మామయ్యని వదిలి వెళ్లాల్సి వస్తుందా అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని బాధ పడి ఏడుస్తుంది. సత్యం చూసి చిన్నిని ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. మీరంతా చూపిస్తున్న అభిమానానికి ఏడుపొస్తుందని అంటుంది. నువ్వు ఈ ఇంటికి ఎప్పటికీ దూరం అవ్వవు అమ్మ ఈ ఇంటి మనుషులు ఈ ఇంటి అభిమానం ఎప్పటికీ నీతోనే ఉంటుందని సత్యంబాబు చిన్నితో చెప్తాడు. ఇక కావేరి అన్నయ్య మాటలు తలచుకొని ఏం నిర్ణయం తీసుకోవాలో అనుకుంటుంది. ఇంతలో జైలు జీవితం గడిపిన కావేరి అంతరాత్మ దర్శనం ఇస్తుంది. అన్నయ్య చెప్పినట్లు ఇక్కడే ఉండిపో అని అంటుంది. దేవా ఏం చేస్తాడో అన్న భయంగా ఉందని కావేరి బాధ పడుతుంది. నీ స్వార్థం నువ్వు చూసుకొని అతనితో వెళ్లిపోవాలి అనుకుంటున్నావ్ అని అంతరాత్మ చెప్తుంది.
కావేరి అంతరాత్మతో అందరికీ మంచి జరగాలి అని వెళ్లిపోవాలి అనుకుంటున్నా అంటే మంచి జరిగేది ఆ దేవాకి బాలరాజుకి. బాలరాజు మంచి వాడిలా నటించి నిన్ను నీ కూతుర్ని దేవాకి అప్పగిస్తాడు. తర్వాత నా భార్య కావేరి బతికే ఉందని పోలీసులకు పట్టిస్తాడు. అప్పుడు చిన్ని నీ దగ్గర లేక అన్నయ్య దగ్గర లేక అనాథ అయిపోతుంది అని ఆ బాలరాజు ఎంత దుర్మార్గుడో నీకు తెలీదా అంటుంది. దానికి కావేరి బాలరాజు మారిపోయాడు. జైలులో నన్ను కాపాడటం దగ్గర నుంచి ఈ రోజు వరకు నా కోసమే ఆలోచిస్తున్నాడని కావేరి అంతరాత్మకు చెప్పుకుంటుంది. బాలరాజులో ఎప్పటికీ మార్పు రాదు అని అంతరాత్మ చెప్తుంది. దాంతో కావేరి ఆలోచనలో పడుతుంది.
దేవేంద్ర వర్మ కావేరికి కాల్ చేస్తాడు. కావేరి తను బాలరాజు అనుకుంటుంది. కావేరి ఉషగా భలే నటించావ్ సూపర్ నటన అంటాడు. ఇంతకాలం మీరు నాతో ఆడుకున్నారు ఇప్పుడు నేను మీతో ఆడుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నా అసలైన ఆట మొదలైంది. ఈ క్షణం నుంచి నువ్వు నీ మొగుడు ప్రతీ క్షణం భయంతో ఉంటారని మీ ఇద్దరి మీదకు ఒకేసారి బ్రహ్మాస్త్రం వదులుతున్నానని మీ ఇద్దరి ప్రాణాలు మీ ముద్దుల కూతురు చిన్ని మీద ఉన్నాయని నాకు తెలుసు ఇక మీ ఇద్దరి పని అయిపోతుందని వార్నింగ్ ఇస్తాడు. కావేరి చాలా భయపడుతుంది.
దేవా వార్నింగ్ తర్వాత కావేరి చిన్నిని తీసుకొని ఆయనతో వెళ్లిపోవాలి అని అనుకుంటూ గజగజా వణికిపోతుంది. ఇంతలో చిన్ని వచ్చి ఏమైంది అమ్మా అని అడుగుతుంది. వెళ్లిపోదాం అమ్మా అని కావేరి చిన్నితో చెప్తుంది. ఏం చేయాలో చిన్నికి కావేరి చెప్తుంది. రాత్రి బాలరాజు ఆటో తీసుకొని కావేరికి చెప్పిన అడ్రస్‌కి వస్తాడు. ఆఫ్ టికెట్‌తో కాసేపట్లో కావేరి వాళ్లు వచ్చేస్తారు నువ్వు ఇక వెళ్లిపో అని ఆఫ్ టికెట్‌కి చెప్తాడు. ఏడుస్తూ ఆఫ్ టికెట్ వెళ్లిపోతాడు. కావేరి లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. చిన్ని కూడా చాటుగా లగేజ్ తీసుకొని మామయ్య దగ్గరకు వెళ్లి మిమల్ని వదిలి వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పడం లేదు అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!





















