Chinni Serial Today May 13th: చిన్ని సీరియల్: చిన్నిని చంపేస్తానని రాజుకి వార్నింగ్ ఇచ్చిన దేవా.. బాలరాజు త్యాగానికి కావేరి బతుకుతుందా!
Chinni Today Episode కావేరి బతకడం కష్టమని డాక్టర్లు సత్యంబాబు, బాలరాజులతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్ర వర్మ, నాగవల్లి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే బాలరాజు ఎదురుగా వస్తాడు. దేవా బాలరాజుతో ఎందుకు వచ్చావ్ బాలరాజు ఉష టీచర్ కోసమా అని అడుగుతాడు. దానికి బాల నువ్వు ఎందుకు వచ్చావ్ టీచర్ చనిపోయిందా లేదా చూడటానికా.. ఆ స్వీట్‌లో విషం ఎందుకు కలిపావ్ చెప్పు అని నిలదీస్తాడు.
దేవా: విషయం ఇంత వరకు వచ్చింది కదా చెప్తాను. ఆ స్వీట్‌లో విషం కలిపింది నీ కూతురు చిన్నిని చంపడానికి కాదు. ఆ స్వీట్‌లో విషం కలిపింది నీ బామ్మర్ది సత్యంబాబుని చంపడానికి కాదు. ఆ స్వీట్‌లో విషం కలిపింది నీ పెళ్లాం కావేరి అలియాస్ ఉషని చంపడం కోసం.. ఎస్ కావేరిని చంపడం కోసమే విషం కలిపాను సరేనా.. దేవా మాటలకు బాలరాజు షాక్ అయిపోతాడు. ఏంటి నోటి మాట రావడం లేదు.
బాలరాజు: చిన్ని నా కూతురు ఏంటి సత్యంబాబు నాకు బామ్మర్ది ఏంటి. ఆ ఉష నా కూతురు ఏంటి.
దేవా: నిన్న నువ్వు రోడ్డు మీద రౌడీలను కొడుతుంటే చిన్ని నిన్ను నాన్న అని పిలవడం కావేరిని అమ్మ అని పిలవడం నేను కళ్లారా చూశాను.నిజం నాకు తెలిసిపోయిందని వెన్నులో వణుకు పుడుతుందా. ఎంతలా ఆడుకున్నావ్‌రా నాతో నా సామ్రాజ్యం కూలగొట్టావ్. కోట్లలో ఆస్తి నష్టం తెచ్చావ్. ఇక నీ పెళ్లాం నువ్వు నాతో ఆడిన ఆట పూర్తయిపోయిందిరా. ఇప్పుడు నా ఆట మొదలైంది. బాలరాజు: దేవా ఇప్పటి వరకు జరిగింది చాలు. నీ ఆట ఆపేయ్.
దేవా: ఎలా ఆపుతానురా నా బంగారు పుట్టలో చేయి పెడితే ఎలా వదులుతాను. ముందు నీ పెళ్లాన్ని వేసేస్తా తర్వాత నీ సంగతి చెప్తా. ఆ తర్వాత నీ కూతురు.
బాలరాజు: వద్దు నా కూతురి జోలికి రావొద్దు. మనిషిలా బతుకుతున్న నన్ను మళ్లీ మార్చొద్దు. నా కూతురు అంటే నాకు ప్రాణం నా కూతురి జోలికి వస్తే ఎవరి ప్రాణాలు అయినా తీయడానికి వెనకాడను. జాగ్రత్త.
నాగవల్లి: ఏంటి బావ వాడు అలా మాట్లాడుతున్నాడు.
దేవా: వాడేం చేయలేడు వల్లి వాడి బంతి నా కోర్టులో ఉంది.
కావేరిని చూడటానికి నర్స్‌ని సత్యంబాబు బతిమాలుతాడు. నర్స్ ఓకే అనండంతో చిన్ని, సత్యంబాబు వెళ్తారు. చిన్ని అమ్మా లే అమ్మా అని ఏడుస్తుంది. సత్యంబాబు కూడా కావేరి కావేరి అని పిలుస్తాడు. తర్వాత చిన్ని దేవుడి దగ్గరకు వెళ్లి తన తల్లిని బతికించమని కోరుతుంది. సత్యంబాబు కూడా దండం పెట్టుకుంటాడు. అప్పుడే వచ్చిన బాలరాజు కూడా దండం పెట్టుకుంటాడు. అక్కడే ఉన్న నర్స్‌లు ఉష బతకడం కష్టం అని రాత్రి వరకు చూసి పంపేద్దామని డాక్టర్ అన్నారని అంటారు. ఆ మాటలు చిన్ని వాళ్లు వింటారు. బాలరాజుని పట్టుకొని చిన్ని నాన్నఅమ్మ బతకడం కష్టం అంటున్నారు అని ఏడుస్తుంది. తర్వాత మామయ్యని పట్టుకొని ఏడుస్తుంది. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని సత్యంబాబు చెప్తాడు.
డాక్టర్లు వస్తే అడుగుతారు. మా ప్రయత్నం చేస్తున్నాం ఇక మీ అదృష్టం దేవుడి దయ అని డాక్టర్లు అంటారు. కావేరి బతకాలి అని కోరుకుంటూ బాలరాజు నిప్పుల గుండం తొక్కాలి అనుకుంటాడు. ఆఫ్ టికెట్ వద్దని నీకు కొంచెం వేడినే తట్టుకోలేవు కదా అన్నా అంటే నా వల్ల కావేరికి ఈ పరిస్థితి కావేరి కోసం ఏమైనా చేస్తా అని అంటాడు. ఆఫ్ టికెట్ చిన్ని దగ్గరకు వెళ్లి మీ నాన్న నిప్పుల గమనం చేస్తున్నాడుని చెప్తాడు. చిన్ని పరుగులు తీస్తుంది. వెళ్లి నాన్నని వద్దని చెప్తుంది. అయినా బాలరాజు నిప్పులగుండం తొక్కుతాడు. పంతులు బాలరాజుతో నీ కోరిక తప్పకుండా తీరుతుందని అంటారు.
సరళ హాస్పిటల్‌కి వచ్చి ఏంటయ్యా నువ్వు నీ సొంత మనిషికి ఇంత ప్రమాదం జరిగినట్లు కంగారు పడుతున్నావ్ అని అంటుంది. తను నా చెల్లిలా ఉంటుంది కదా అందుకే అని అంటాడు. ఇక బాలరాజు వాళ్లు నర్స్‌ని రిక్వెస్ట్ చేసి కావేరికి బొట్టు పెట్టడానికి వెళ్తారు. నువ్వు తొందరగా కోలుకుంటావ్ కావేరి అని బొట్టు పెడతాడు. కావేరిలో కొంచెం చలనం వస్తుంది. చిన్ని ఏడుస్తూ అమ్మా నాన్న నీ కోసం ఏం చేశాడో తెలుసా అంటుంది. నర్స్ వచ్చి బయటకు వెళ్లమని అంటుంది. సత్యం దగ్గరకు వచ్చి రాజు కూడా కూర్చొంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!





















