నిమ్మకాయలను చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటల్లో, ఆరోగ్యం కోసం కూడా వాడతారు.

అయితే వీటిని ఫ్రిడ్జ్​లో స్టోర్ చేసినా కొన్నిరోజులు ఫ్రెష్​గా ఉన్నా.. తర్వాత ఎండిపోతాయి.

అలా ఎండిపోయిన నిమ్మకాయలను చాలామంది బయటపడేస్తారు. అలా పడేయకుండా వీటిని ఫాలో అవ్వండి.

మీకు తెలుసా? ఎండిపోయిన నిమ్మకాయలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గిస్తాయి.

వాటిలో ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను దూరం చేస్తాయి.

ఈ నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి. సూప్​లు, కూరల్లో వీటిని ఉపయోగిస్తే మంచి రుచి ఉంటుంది.

హెర్బల్ టీని చేసుకోవడానికి కూడా ఎండిన నిమ్మకాయలను వాడుకోవచ్చు.

ఎండిన నిమ్మకాయలతో గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ బర్నర్​లు కూడా ఈజీగా శుభ్రమవుతాయి.

ఎండిన నిమ్మకాయలు సహజ క్లెన్సర్​లుగా పనిచేస్తాయి. ఇవి మరకలను తేలికగా శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

కాబట్టి నిమ్మకాయలు ఫ్రెష్​గా ఉంటేనే కాదు.. ఎండినా కూడా ఉపయోగించుకోవచ్చు.