టేస్టీ స్వీట్​లలో రసగుల్లా ఒకటి. దీనిని ఇంట్లోనే టేస్టీగా, స్పాంజ్​గా ఎలా చేయాలో చూసేద్దాం.

దీనిని తయారు చేడానికి ఫ్యాట్ మిల్క్, నిమ్మరసం లేదా వెనిగర్ సిద్ధం చేసుకోవాలి.

పాలను మందపాటి గిన్నెలో వేసి మరిగించాలి. అనంతరం దానిలో నిమ్మరసం లేదా వెనిగర్ వేసి కలపాలి.

పాలు విడిపోయాక నీటిని వేరు చేసి.. చల్లని నీటితో మిగిలిన పదార్థాన్ని కడగాలి.

ఇప్పుడు దానిలోని నీటిని పిండేసి 30 నుంచి 45 నిమిషాలు పక్కన ఉంచి డ్రై అయ్యేలా చూసుకోవాలి.

ఈ పిండిని బాగా కలిపితే మెత్తగా అవుతుంది. దానిని చిన్న చిన్న బాల్స్​గా సిద్ధం చేసుకోవాలి.

ఇప్పుడు ఓ గిన్నెలో షుగర్ సిరప్ సిద్ధం చేసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసి మరిగించాలి.

ఇప్పుడు రసగుల్లా బాల్స్​ని షుగర్ సిరప్​లో వేసి ఉడికించాలి. ఉడికితే అవి పెద్దగా ఉబ్బుతాయి.

చివర్లో రోజ్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. స్టౌవ్ ఆపేస్తే రసగుల్లా రెడీ.

వీటిని ఫ్రిడ్జ్​లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే మంచి రుచి ఉంటుంది.