సమ్మర్​లో ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది చియా సీడ్స్​ని తీసుకుంటారు.

అయితే వీటిని ఎలా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయో ఇప్పుడు చూసేద్దాం.

1 లేదా 2 టీస్పూన్ల చియా సీడ్స్​ని గ్లాస్​ వాటర్​లో అరగంట నుంచి 2 గంటలు నానబెట్టుకోవాలి.

ఉదయాన్నే పరగడుపుతో లేదా లంచ్​ మధ్యలో వీటిని తీసుకోవచ్చు.

ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. వేడి తగ్గి శరీరం కూల్ అవుతుంది.

చియా సీడ్స్​ని నిమ్మరసం కలిపి నీటిలో కలిపి తీసుకుంటే సహజంగా శరీరం డీటాక్స్ అవుతుంది.

బరువు తగ్గడం, జీర్ణ సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు.

కొబ్బరి నీళ్లలో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

సమ్మర్​లో స్మూతీలు, జ్యూస్​లు ఎక్కువగా తీసుకునేవారు కూడా చియా సీడ్స్​ని వాటిలో కలిపి తీసుకోవచ్చు.

వీటివల్ల ఫైబర్, ఒమేగా 3 శరీరానికి అందుతుంది. ఇవి గట్​ హెల్త్​కి మంచి చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.