కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భిణీలు తాగితే మంచిదా? కాదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి.

ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి డీహైడ్రేషన్ రాకుండా హెల్ప్ చేస్తాయి.

కొబ్బరి నీళ్లలో ఫైబర్ కంటెంట్ ఉంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వేడిని తగ్గించి.. హీట్ బర్న్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది.

కొబ్బరి నీళ్లలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దీనిలోని పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేస్తుంది.

కడుపులో తిప్పడం, వాంతులు కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఫ్రెష్​గా ఉండేవాటిని తాగితే మంచిది. ప్రిజర్వెటివ్స్ ఉండే వాటిని దూరంగా ఉంచాలి.