హర్షవర్థన్ రాణే గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇతను హైదరాబాద్ కుర్రాడు.

కానీ హిందీ సినిమాల్లో ఎక్కువ కనిపించడం వల్ల అతను నార్త్​కి చెందిన వ్యక్తి అనుకుంటారు.

తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసిన హర్ష.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా చేశాడు.

ఫిదా, అవును, అనామిక వంటి సినిమాల్లో కనిపించినా.. తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

హిందీలో మాత్రం సనమ్ తేరీ కసమ్ సినిమాతో మంచి హిట్​ని అందుకుని గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ సినిమా రీ రిలీజ్ అయ్యాక కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది.

కానీ హిందీలో కూడా హీరోగా సెటిల్ అవ్వలేకపోయాడు హర్ష.

ఫిట్​నెస్​కి హర్ష చాలా ప్రయారిటీ ఇస్తాడు. షూట్​లో ఉన్నా లేకున్నా వ్యాయామం చేస్తాడు.

అడవుల్లో ఎక్కువగా తిరుగుతూ ఫోటోగ్రఫిని ఎంజాయ్ చేస్తాడు హర్ష.

ఇప్పటికీ మంచి రోల్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నాడు ఈ నటుడు.