మామిడి పండ్లు సమ్మర్​లో విరివిగా దొరుకుతాయి. అయితే వీటిని ఎక్కువగా కొన్నప్పుడు స్టోర్ ఎలా స్టోర్ చేస్తారు?

చాలామంది మామిడి పండ్లు ఫ్రిడ్జ్​లలో స్టోర్ చేస్తారు. అయితే కొందరు ఫ్రిడ్జ్​లో పెడితే రుచి మారిపోతుందని అంటారు.

అలాగే ఫ్రిడ్జ్​లో మామిడి పండ్లు ఉంచడం వల్ల అవి నల్లగా మారిపోతాయి. రుచి కూడా తగ్గుతుంది.

ఇలా అవ్వకుండా ఉండాలంటే మామిడి పండ్లను ఫ్రిడ్జ్​లో ఉంచాలా? వద్దా?

మామిడి పండ్లను ఫ్రిడ్జ్​లో ఉంచవచ్చు. అయితే ఎలా స్టోర్ చేస్తే మంచిదో చూద్దాం.

మామిడి పండ్లను నేరుగా కాకుండా పేపర్​ క్లాత్​లో లేదా పేపర్​లో చుట్టి పెట్టాలి.

ఇలా చేయడం వల్ల మామిడి రంగు మారదు. రుచి కూడా మారకుండా ఉంటుంది.

మామిడి పండ్లను కోసి ఫ్రిడ్జ్​లో ఉంచకూడదు. అలా ఉంచాల్సి వస్తే కంటైనర్​లో మూత బిగించి పెట్టాలి.

మామిడి పండ్లను 2 లేదా మూడు రోజులు ఫ్రిడ్జ్​లో ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉంచితే రుచి మారుతుంది.

మీరు ఫ్రిడ్జ్​లో ఉంచకూడదనుకుంటే మీరు నీటిలో వాటిని వేస్తే ఎక్కువకాలం చెడిపోకుండా ఉంటాయి.