బొప్పాయి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

బొప్పాయి సీడ్స్​లో పాపైన్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి.. గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

కడుపులోని పురుగులను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. కొన్ని పద్ధతుల్లో నులిపురుగులు పోవడానికి ఉపయోగిస్తారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం బొప్పాయి గింజలు శరీరాన్ని డిటాక్స్ చేసి లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయట.

వీటిలోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఇన్​ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని ఇన్​ఫ్లమేటరీ లక్షణాలను తగ్గిస్తాయి.

వీటితో శరీరానికి హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్.. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ శరీరానికి అందుతాయి.

ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో ఇరిటేషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

పెద్దలు 1 టీస్పూన్ బొప్పాయి గింజలను​ లేదా పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకోకూడదు.

ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, యూట్రస్ సమస్యలున్నవారు తీసుకోకపోవడమే మంచిది.