సమ్మర్​లో జామపండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.

జామపండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని కూల్ చేసి హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.

జామపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సమ్మర్​లో వచ్చే ఇన్​ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

మలబద్ధకం సమస్య వంటి సమస్యలను దూరం చేస్తుంది.

జామకాయలను మధుమేహం ఉన్నవారు కూడా చాలా రెగ్యులర్​గా తీసుకోవచ్చు.

వీటిని తినడం వల్ల గ్లైసమిక్ ఇండెక్స్ కంట్రోల్​లో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్​ని కంట్రోల్ చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు డైట్​లో దీనిని చేర్చుకోవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.