మామిడిపండ్లు రోజూ తినొచ్చా? దానివల్ల లాభాలు ఎన్ని ఉంటాయో.. తీసుకున్న జాగ్రత్తలేంటో చూసేద్దాం.

మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. చర్మ ఆరోగ్యానికి, జీర్ణ సమస్యలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.

మామిడికాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది శరీరానికి ప్రోటీన్​ని అందిస్తుంది.

అయితే మామిడికాయలను డయాబెటిస్ ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.

మామిడిలో సహాజమైన షుగర్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి పరిస్థితిని తీవ్రం చేస్తాయి.

అలాగే రోజుకు ఒక చిన్న మామిడి పండు తినొచ్చు. కానీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

బరువు తగ్గాలనుకునేవారు దీనిని రోజుకు 100 గ్రాములు తీసుకోవచ్చు.

ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ, బ్లోటింగ్ సమస్యలు పెరుగుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.