తెల్లని దుస్తులపై ఎలాంటి మరకలు పడినా వాటిని వదిలించడం చాలా కష్టంగా ఉంటుంది.

పసుపు మరకలు తెల్లని దుస్తులపై ఉన్నప్పుడు, ఏ ఇతర మరకలనైనా వదిలించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

సమ్మర్​లో చాలామంది తెల్లని దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. ఇవి వేడిని దూరం చేస్తాయి.

కానీ ఇవి చాలా త్వరగా మురికి అయిపోతాయి. లేదా మరకలు పడతాయి.

తెల్లని దుస్తులపై మరకలు పడినా.. లేదా ఉతికే కొద్ది రంగు మారిపోతూ ఉంటాయి.

అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా సింపుల్​గా మరకలు వదిలించుకోవచ్చు.

వేడి నీటిలో సోడా కలిపి దానిలో తెల్లని దుస్తులను కొన్ని గంటలు నానబెడితే మరకలు ఈజీగా వదిలిపోతాయి.

తెల్లని దుస్తులపై మరకలను వదిలించుకోవడానికి మీరు నిమ్మకాయను కూడా ఉపయోగించుకోవచ్చు.

వాషింగ్​ మిషన్​లో కూడా నిమ్మరసం వేసి బట్టలు వాష్ చేసుకోవచ్చు.

వైట్ వెనిగర్​తో దుస్తులు ఉతికే పసుపు రంగు కూడా పోతుంది.

తెల్లని దుస్తులను ఎండలో ఆరబెడితే వాటి రంగు ఎక్కువకాలం ఉంటుంది.