వామ్ములోని యాంటీ ఆక్సిడెంట్లు సమ్మర్​లో వచ్చే ఇన్​ఫ్లమేషన్​ని దూరం చేస్తాయి.

యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఫ్యాట్​ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బరువును కంట్రోల్ చేస్తాయి.

గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు దూరం చేయడంలో వామ్మునీరు మంచి ప్రయోజనాలిస్తుంది.

వామ్ములోని ఫైబర్ మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది. టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది.

రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఎనర్జీని పెంచుతుంది. హైడ్రేషన్​ని అందించి యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

వామ్ములోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించి నొప్పులను కంట్రోల్ చేస్తాయి.

వామ్మును నీటిలో వేసి మరిగించి దానిలో కాస్త నిమ్మరసం కలిపి పరగడుపునే తాగితే మంచిది.

వామ్మును నేరుగా కూడా తినొచ్చు. పౌడర్ చేసి కూడా నీటిలో కలిపి తాగొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.