గ్రిల్ చేసిన స్నాక్స్​కి, వివిధ ఆహార పదార్థాలకు మయొన్నైస్ చాలా మంచి కాంబినేషన్.

ఈ మధ్యకాలంలో మయోన్నైస్​పై వివిధ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెజ్ మయోన్నైస్​ గురించి చూస్తున్నారు.

పచ్చి గుడ్డు ఉపయోగించడం వల్ల దానిలోని బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్​గా మారుతుండడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

గతంలో హైదరాబాద్​లో దీనిని బ్యాన్ చేయగా.. తాజాగా తమిళనాడులో దీనిని నిషేదించారు.

ఈ క్రమంలో గుడ్డు లేకుండా ఇంట్లోనే మయోన్నైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

పనీర్ 100 గ్రాములు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వైట్ పెప్పర్ తీసుకోవాలి.

నూనెలో 6 వెల్లుల్లి రెబ్బలు వేయించి.. 20 గ్రాముల జీడిపప్పు కూడా వేయించుకోవాలి.

ఉప్పు, నూనె వేసి, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకుని మిక్సీలో వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు తాజా పనీర్​ను తీసుకోవాలి. దానిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

పుదీనా లేదా కొత్తిమీర తీసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ పొందవచ్చు. టేస్టీ మయొన్నైస్ రెడీ.