వ్యాయామం కుదరట్లేదా? అయితే బరువు తగ్గడానికి దీనిని కంట్రోల్ చేయండి

కొందరు వ్యాయామం చేయడం కుదరట్లేదని.. తమ షెడ్యూల్ బిజీ అని చెప్తారు.

అలాంటి తమ డైట్​ నుంచి కనీసం చక్కెరను దూరం చేసుకోవాలని చెప్తున్నారు నిపుణులు.

షుగర్స్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది.

మీరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు దానిని తీసుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది.

స్వీట్స్​తో పాటు షుగర్ డ్రింక్స్​ను కూడా డైట్​ నుంచి దూరం చేసుకోవాలి.

అధిక చక్కెర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఊబకాయం మాత్రమే కాదు.. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఇది రెట్టింపు చేస్తుంది.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల లేజీగా ఉంటారు. దంతాలకు కూడా మంచిది కాదు.

కాలేయ ప్రమాదాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కాబట్టి వీలైనంత దూరంగా ఉండండి.