మంచి నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే నీటిని తాగేప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని చెప్తున్నారు.

నీరు వేగంగా తాగితే కడుపు ఉబ్బరం చేస్తుందట. కాబట్టి కొద్ది కొద్దిగా నీటిని స్లోగా తీసుకోవాలి.

అన్నం తిన్నవెంటనే నీటిని అస్సలు తాగకూడదు. కనీసం అరగంట తర్వాత తాగితే మంచిది.

కోల్డ్ వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇది ఆహారాన్ని ఆలస్యంగా జీర్ణం చేస్తుంది.

రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని కచ్చితంగా తీసుకోవాలి దీనివల్ల తలనొప్పి, ఫటిగో సమస్యలు రావు.

నీరు తాగాలి కదా అనే ఒకేసారి తాగితే కిడ్నీలపై ప్రెజర్ పడుతుంది. కాబట్టి తక్కువగా ఎక్కువసార్లు తాగాలి.

నీటిని తాగేప్పుడు నిల్చొని కంటే కూర్చోని తాగితే మంచిది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు.

మీరు దాహం వేసే వరకు నీటిని తాగట్లే అండే మీరు డీహైడ్రేట్ అయినట్టే. కాబట్టి నీటిని తరచూ తాగుతూ ఉండండి.

మీ రోజును 1 లేదా 2 గ్లాసుల నీటితో ప్రారంభిస్తే మెటబాలీజం పెరుగుతుంది. టాక్సిన్లు బయటకొస్తాయి.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాతో రోజుకి ఎంత నీరు తీసుకుంటే మంచిదో తెలుసుకోండి.