గులాబ్ జామున్ ఇష్టమా? అయితే ఈ టిప్స్​తో టేస్టీ గులాబ్ జామున్ చేసేయొచ్చు.

ముందుగా గులాబ్ జామున్ పౌడర్ తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి.

అనంతరం గులాబ్ జామున్ మిక్స్​లో పాలు వేస్తూ పిండిని కలపాలి. నీళ్లు కూడా వేసుకోవచ్చు.

పూర్తి పాలతో పిండిని కలిపితే జామున్ రుచి బాగుంటుంది. దీనిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఇలా కలిపిన పిండిన పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత వేసి మాత్రమే పక్కన పెట్టాలి.

ఇప్పుడు మీ రుచికి తగినంత షుగర్ తీసుకుని పాకం పట్టుకోవాలి. దానిలో యాలకుల పొడి వేయాలి.

సిరప్ రెడీ అయ్యే లోపు చిన్న చిన్న ఉండలుగా గులాబ్ జామున్స్ రెడీ చేసుకోవాలి.

డీప్ ఫ్రైకి నూనె పెట్టి అది కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న జామున్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.

అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సిరప్​లో గులాబ్ జామున్స్ వేసి 1 లేదా రెండు గంటలు అలా వదిలేయాలి.

అంతే టేస్టీ గులాబ్ జామున్ రెడీ. హాయిగా ఇంటిల్లిపాది లాగించేయవచ్చు.