సమ్మర్​లో ఉక్కపోత, ఎండ వల్ల చెమట ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా స్కాల్ప్​లో కూడా ఎక్కువ చెమట వస్తుంది.

దీనివల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

చెమట, దుమ్ము, నూనె సమ్మరలో కుదుళ్లను వీక్ చేస్తాయి. దీనివల్ల జుట్టు రాలిపోతుంది.

అందుకే జుట్టును వారానికి 2 లేదా 3 సార్లు మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూతో వాష్ చేయాలి.

కొబ్బరి నూనె, బాదం, ఆముదం వంటి నూనెలను రెగ్యులర్​గా తలకి అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

బయటకు వెళ్లినప్పుడు యూవీ కిరణాలు పడకుండా హెయిర్ డ్యామేజ్ కాకుండా దానిని కవర్ చేయాలి.

హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల కుదుళ్లకు బలం పెరుగుతుంది. కొబ్బరి నీరు, బటర్ మిల్క్ మంచి ఫలితాలు ఇస్తాయి.

ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ జుట్టు పెరిగేలా చేస్తాయి. జంక్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది.

స్ప్లిట్ ఎండ్స్ 6 నుంచి 8 వారాలకోసారి కట్ చేస్తే బ్రేకేజ్ ఉండదు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

హీట్ స్టైయిలింగ్, హార్ష్ కెమికల్స్​ని అవాయిడ్ చేయడమే మంచిది.