వేసవిలో బెల్లం తినాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవాల్సిందే.

బెల్లం సాధారణంగా వేడి చేస్తుంది. సమ్మర్​లో దీనిని తినడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి.

దీనిని ఎక్కువగా తీసుకుంటే చర్మంపై మొటిమలు, మంట, అలెర్జీలు వంటి సమస్యలు కలిగిస్తుంది.

బెల్లం ఎక్కువగా తింటే డీహైడ్రేషన్ కూడా వస్తుంది. కొందరికి వేడి వల్ల ముక్కు నుంచి రక్తం కారవచ్చు.

కానీ పరిమిత మోతాదులో తీసుకుంటే బెల్లంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

బెల్లం తింటే ఐరన్ అంది.. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత తగ్గుతుంది.

వేసవిలో జీర్ణసమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది బెల్లం.

రోగనిరోధక శక్తిని పెంచి.. సమ్మర్లో వచ్చే సీజనల్ సమస్యలను దూరం చేస్తుంది.

డీటాక్స్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని డైట్లో చేర్చుకుంటే మంచిది.