చాక్లెట్స్​ని చాలామంది ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా వాటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు.

అయితే చాక్లెట్స్ ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కాబట్టి మీరు డార్క్ చాక్లెట్లతో క్రేవింగ్స్​ని రిప్లేస్ చేయొచ్చు.

డార్క్ చాక్లెట్​లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

బీపీ సమస్యలను అదుపులో ఉంచి.. గుండె సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

బ్రెయిన్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. ఫోకస్ పెంచుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

డార్క్ చాక్లెట్​ ఫోలిఫెనోల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

ఇవి ఫ్రీ రాడికల్స్​నుంచి శరీరాన్ని దూరం చేసి.. ఆక్సిడేటివ్ స్ట్రెస్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

కొలెస్ట్రాల్ లెవెల్స్​ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి.

సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. సహజంగా మూడ్​ని మెరుగుపరుస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని లిమిటెడ్​గా డైట్​లో చేర్చుకోండి.