పుచ్చకాయను సమ్మర్​లో ఎక్కువమంది తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలిస్తుంది.

దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటింగ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

సమ్మర్​లో దీనిని డైట్​లో చేర్చుకోవడం వల్ల డీహైడ్రేషన్, ఫటిగో, హీట్ స్ట్రోక్ సమస్యలను దూరం చేస్తుంది.

శరీరంలోని వేడిని తగ్గించి.. కూల్ చేస్తుంది. బాడీ ఉష్ణోగ్రతలను రెగ్యులేట్ చేస్తుంది.

పుచ్చకాయలోని లైకోపిన్, విటమిన్ సి, బీటా కెరోటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్​ నుంచి కాపాడుతాయి.

లైకోపిన్ రక్తప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో హెల్ప్ చేస్తుంది.

పుచ్చకాయలోని ఫైబర్, నీటి కంటెంట్ మలబద్ధకం సమస్యల్ని, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.