గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని ఫుడ్స్ రెగ్యులర్​గా తీసుకోవాల్సి ఉంటుంది.

టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు డైట్​లో తీసుకోవచ్చు.

స్ట్రాబెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వీటిలో ఫైబర్, విటిమిన్ సి కూడా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది.

యాపిల్​లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె సమస్యలను దూరం చేస్తుంది.

రెడ్ క్యాప్సికమ్​లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి.

బీట్​రూట్​లలోని నైట్రేట్లు రక్తప్రసరణను పెంచుతాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి.

దీనిలోని ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.