పెరుగును కొందరు ఇష్టంగా తింటారు. మరికొందరు మాత్రం అస్సలు తినరు.

అయితే ఇష్టమున్నా లేకున్నా పెరుగును డైట్​లో చేర్చుకుంటే మంచిదని చెప్తున్నారు.

మీకు డెయిరీ ప్రొడెక్ట్స్ అలెర్జీ ఉంటే లైట్​ కానీ.. అలాంటి సమస్యలు లేకుంటే పెరుగు తినండి.

పెరుగులో శరీరంలోని వేడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇది సమ్మర్​ హీట్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

పెరుగులో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సమ్మర్​లోని గట్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

సమ్మర్​లో హైడ్రేషన్ కోసం పెరుగులో కాస్త నీళ్లు కలిపి బటర్ మిల్క్​గా తీసుకోవచ్చు. ఇది ఎలక్ట్రోలైట్స్​ని పెంచుతుంది.

పెరుగులో విటమిన్ డి, కాల్షియం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.

పెరుగులోని ప్రోటీన్, కాల్షియం.. ఎముకల ఆరోగ్యానికి, కండర బలానికి ఇవి మేలు చేస్తాయి.

సమ్మర్​లో పెరుగును తీసుకుంటే ఈజీగా జీర్ణమవుతుంది. రైతా, బటర్​మిల్క్​ రూపంలో కూడా తీసుకోవచ్చు.